Search
  • Follow NativePlanet
Share
» »ఈ కార్తీకమాసంలో ఈ దేవాలయాల్లో ఒక్కదాన్ని సందర్శించినా మోక్షమే

ఈ కార్తీకమాసంలో ఈ దేవాలయాల్లో ఒక్కదాన్ని సందర్శించినా మోక్షమే

కొయంబత్తూరులో చూడదగిన దేవాలయాల జాబితా ఇదే.

తమిళనాడులోని కొయంబత్తూర్ సుందరమైన నగరం. పారిశ్రామిక రంగంలోనే కాకుండా చారిత్రాత్మకంగాను, ధార్మికంగాను ఈ నగరాలనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నగరంలో చూడదగ్గ ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి. అంతేకాకుండా ఈ కొయంబత్తూరు పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యత చెందినది. పౌరాణిక ప్రాధాన్యమైన దేవాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించిన కథనాలు మీ కోసం...

మరుడమాలై మురుగన్ దేవాలయం

మరుడమాలై మురుగన్ దేవాలయం

P.C: You Tube

మరుడమలై మురుగన్ దేవాలయం సముద్రమట్టానికి దాదాపు 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 12వ శతాబ్దంలో నిర్మించారు. కొయంబత్తూరులోని అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయానికి ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. చుట్టూ పచ్చదనంతో ఉండే ఈ దేవాలయం చూడటానికి ప్రతి ఏడాలి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

బెట్టద బిర్యానీ దొరికేది ఇక్కడే?బెట్టద బిర్యానీ దొరికేది ఇక్కడే?

ధ్యానలింగ

ధ్యానలింగ

P.C: You Tube

మీకు శాంతియుత వాతావరణంలో దైవ పూజ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ దేవాలయం ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ధ్యానలింగ దేవస్థానాన్ని క్రీస్తుశకం 1999లో యోగ, ధార్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్మింపజేశారు. ఇది కేవలం ధార్మిక కేంద్రమే కాకుండా ధ్యాన కేంద్రంగా కూడా ప్రాచూర్యం చెందింది.

యోగిక్ దేవస్థానం

యోగిక్ దేవస్థానం

P.C: You Tube

మీకు ఆధ్యాత్మిక ప్రాంతాలంటే చాలా ఇష్టం అనుకొంటే మీరు యోగిక్ దేవస్థానాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ దేవాలయంలోపలికి వెళ్లడానికి ముందు మీరు ఇక్కడ ఉన్న పుష్కరిణిలో ఖచ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీ శరీరంతో పాటు ఆత్మ కూడా పరిశుద్ధి అవుతుందని చెబుతారు.

పెరూర్ పట్టీశ్వరార్ దేవాలయం

పెరూర్ పట్టీశ్వరార్ దేవాలయం

P.C: You Tube

పెరూర్ పట్టీశ్వరార్ దేవాలయం కొయంబత్తూరు దగ్గర ఉన్న మరో ప్రముఖ దేవాలయం. ఇది తమిళనాడులోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం ఒకటో శతాబ్దంలో కరికాళ చోళుల కాలంలో నిర్మించినట్లు స్థానికంగా దొరికిన ఆధారాలను అనుసరించి తెలుస్తోంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు.

శివుడి బంగారు విగ్రహం.

శివుడి బంగారు విగ్రహం.

P.C: You Tube

ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం మిమ్ములను ఖచ్చితంగా ఈ దేవాలయానికి వెళ్లేలా చేస్తుంది. ఇక్కడ మనం ఎంతసేపైనా ధ్యానం చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేనట్లు ఇక్కడ శివుడి విగ్రహం బంగారంతో మలచబడి ఉంది. ఈ దేవాలయం వాస్తుశైలిని చూడటానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

అన్నిరకాల రోగాలు నయమవుతాయి

అన్నిరకాల రోగాలు నయమవుతాయి

P.C: You Tube

మసాని అమ్మన్ దేవాలయాన్ని సందర్శించడం వల్ల అన్ని రకాల రోగాలు నయమవుతాయని చెబుతారు. స్థానిక కథనం ప్రకారం శ్రీరాముడు అంతటివాడే ఇక్కడకు ఒకసారి భేటీ అయ్యాడు. చుట్టూ ప్రక`తి రమనీయతతో ఉండే ఈ దేవాలయం సందర్శనం వల్ల మనసుకు ఎంతో హాయి కలుగుతుంది.

అన్నిరకాల రోగాలు నయమవుతాయి

అన్నిరకాల రోగాలు నయమవుతాయి

P.C: You Tube

మసాని అమ్మన్ దేవాలయాన్ని సందర్శించడం వల్ల అన్ని రకాల రోగాలు నయమవుతాయని చెబుతారు. స్థానిక కథనం ప్రకారం శ్రీరాముడు అంతటివాడే ఇక్కడకు ఒకసారి భేటీ అయ్యాడు. చుట్టూ ప్రక`తి రమనీయతతో ఉండే ఈ దేవాలయం సందర్శనం వల్ల మనసుకు ఎంతో హాయి కలుగుతుంది.

అష్టవరద ఆంజనేయస్వామి

అష్టవరద ఆంజనేయస్వామి

P.C: You Tube

అష్టవరద ఆంజనేయస్వామి దేవాలయం కొయంబత్తూరులో ఇటీవల నిర్మించారు. ప్రతి రోజూ ఇక్కడలకు వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా మంగళవారం ఇక్కడకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X