Search
  • Follow NativePlanet
Share
» »నాగర్ కోయిల్ - నాగరాజ దేవాలయం !

నాగర్ కోయిల్ - నాగరాజ దేవాలయం !

By Mohammad

అందమైన ప్రకృతి దృశ్యాల వల్ల నాగర్ కోయిల్ భారతదేశంలో ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది. ఇది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో కలదు. దీనికి ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు దట్టమైన పశ్చిమ కనుమలు ఉండి, మొదటి సారి ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులను కనువిందు చేస్తుంది. కన్యాకుమారి లోగానీ లేదా దాని చుట్టుపక్కల గానీ దేశ, విదేశీ పర్యాటకులు ఉంటె తప్పక నాగర్ కోయిల్ కు వెళతారు. అక్కడి ప్రకృతి దృశ్యాలను, జలపాతాలను మరియు ఇతర సైట్ సీఇంగ్ ప్రదేశాలను చూసి వారు మంత్రముగ్ధులవుతారు.

ఇది కూడా చదవండి : శ్రీ పెరుంబుదూర్ - స్మారకాలు, రేసులు !

నాగర్ కోయిల్ లో నివశించే స్థానికులుశాంతి స్వభావులు. ఇక్కడికి వచ్చే పర్యాటకులను ప్రేమాభిమానాలతో పలకరిస్తారు. తూర్పు, పశ్చిమ కనుమల సంస్కృతుల మేళవింపు నాగర్ కోయిల్ పట్టణంలో కనిపిస్తుంది.

పూర్వం ఈ ప్రాంతాన్ని వివిధ రాజవంశాలు పరిపాలించారు. వారిలో చోళ, చేర మరియు పాండ్యులు ముఖ్యులు. నాగరాజ దేవాలయం, ఒలకరువి జలపాతం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. వీటితో పాటు సుగుంధ ద్రవ్యల తోటలు, ప్యాలెస్ లు మరియు మరికొన్ని ఆలయాలు ఈ పట్టణంలో చూడదగినవిగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశం !

నాగరాజ దేవాలయం

నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ పట్టణంలో నాగరాజ దేవాలయం తప్పక దర్శించాలి. ఈ కోవెల్ పేరుమీదనే పట్టణానికి ఆపేరొచ్చింది. ఆలయంలో ఆనంద కృష్ణ మరియు నాగరాజ రెండు ప్రధాన దైవాలుగా ఉన్నారు. భక్తులు పసుపు మరియు పాలతో విగ్రహాలను అభిషేకిస్తారు.

చిత్ర కృప : Infocaster

నాగరాజ దేవాలయం

నాగరాజ దేవాలయం

నాగరాజ గుడి ముందు భాగంలో పెద్ద కోనేరు ఉంది. ఇందులో భక్తులు స్నానాలు ఆచరించి నాగరాజను దర్శిస్తారు. కోనేరు పక్కనే పెద్ద దిమ్మె మీద చాలా నాగరాజ ప్రతిమలు ఉన్నాయి. ఈ గుడిలో ఎక్కడ చూసిన నాగరాజ ప్రతిమలే కనిపిస్తాయి.

చిత్ర కృప : Shareef Taliparamba

నాగరాజ ఆలయం - ప్రత్యేకత

నాగరాజ ఆలయం - ప్రత్యేకత

నాగరాజ గర్భాలయంలో వూరు నీటి ఊట లోని నీటిని తీర్థముగా ఇస్తారు. ఈ నీటిఊటలోని ఇసుక సంవత్సరంలో సగభాగం తెల్లగా మరియు మిగిలిన సగభాగం నల్లగా ఉంటుంది.

చిత్ర కృప : Meenkulambu

ఆలయంలో ఇతర ఆకర్షణలు

ఆలయంలో ఇతర ఆకర్షణలు

ఈ ఆలయంలో నాగ దేవతలతో పాటు జైన తీర్ధాంకులైన మహావీర, పార్శ్వనాథ మందిరాలు ఉన్నాయి. ముఖ ద్వారంపై బుద్ధ విహారం లోని చైనా శిల్పకళ అబ్భురపరుస్తుంది.

చిత్ర కృప : Meenkulambu

ఒలకరువి జలపాతాలు

ఒలకరువి జలపాతాలు

నాగర్ కోయిల్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒలకరువి జలపాతాలు ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానంగా ఉన్నాయి. తరచూ కన్యాకుమారికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు ఈ జలపాతాలను తప్పక సందర్శిస్తారు.

చిత్ర కృప : telugu native planet

ఒలకరువి జలపాతాలు

ఒలకరువి జలపాతాలు

స్థానికుల కథనం మేరకు ఒలకరువి జలపాతాలు దివ్య ఔషధ గుణాలు కలిగి ఉందని చెబుతారు. ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గిపోతాయని అభిప్రాయం.

చిత్ర కృప : Niran V V Follow

తోటలు

తోటలు

నాగర్ కోయిల్ పట్టణంలో ఏలకులు, లవంగాల తోటలు అధికంగా ఉన్నాయి. స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్ వారు ఇక్కడ స్థిరపడి తోటలను సాగుచేసేవారు. మీరు ఈ తోటల ప్రాంతానికి చేరుకోగానే ఏలకుల సువాసన గుబాళిస్తుంది.

చిత్ర కృప : Sahaya Minu Anish

నాగర్ కోయిల్ ఎలా చేరుకోవాలి ?

నాగర్ కోయిల్ ఎలా చేరుకోవాలి ?

విమానం ద్వారా : త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ 80 km ల దూరంలో కలదు.

రైలు ద్వారా : కన్యాకుమారి రైల్వే స్టేషన్ 20 కిలోమీటర్ల దోరంలో కలదు.

రోడ్డు ద్వారా : త్రివేండ్రం, తిరునల్వేలి, కన్యాకుమారి మరియు సమీప పట్టణాల నుండి నాగర్ కోయిల్ కు బస్సులు నడుస్తాయి.

చిత్ర కృప : Kkdrua

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X