Search
  • Follow NativePlanet
Share
» »నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ దేవాలయాలలో హిందువుల ఖగోళ శాస్త్రం మేరకు చెప్పబడే తొమ్మిది నవగ్రహాలు వుంటాయి. అవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు లేదా బృహస్పతి, శుక్ర , శని, రాహు, కేతు గ్రహాలుగా చెపుతారు.

By Venkatakarunasri

నవగ్రహ దేవాలయాలలో హిందువుల ఖగోళ శాస్త్రం మేరకు చెప్పబడే తొమ్మిది నవగ్రహాలు వుంటాయి. అవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు లేదా బృహస్పతి, శుక్ర , శని, రాహు, కేతు గ్రహాలుగా చెపుతారు. ఈ నవగ్రహ దేవాలయాలు దేశ వ్యాప్తంగా కలవు. అయితే, దక్షిణ ఇండియా లోని తమిళనాడు లో కల కుంబకోణం పట్టణం లోని నవగ్రహ దేవాలయాల సమూహం ప్రత్యేకత కలిగినదిగా భావిస్తారు. ఈ దేవాలయాలు చోళ రాజుల కాలం నాటివి. వీటిలో కొన్ని చోళుల కంటే ముందు కల పల్లవ రాజుల కాలం నాటివిగా కూడా చెపుతారు.

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

సూర్య దేవాలయం

ఈ దేవాలయంలో గ్రహాల అధిపతి అయిన సూర్య భగవానుడు వుంటారు. ఇది తమిళనాడు లోని తంజావూర్ జిల్లా లో కలదు. దేవాలయం వద్ద కల శిలా ఫలకాలపై దీని నిర్మాణం క్రీ శ 1060-1118 లలో కులోత్తుంగ చోలదేవుడిచే చేయబడినట్లు చెప్పబడుతోంది. దీనిని కులోత్తుంగ చోళ - మార్తాన్దాలయ అని అంటారు. తొమ్మిది దేవాలయాల్లోనూ ఈ టెంపుల్ లో ప్రత్యేక ఆలయాలతో తొమ్మిది నవ గ్రహాలూ వుంటాయి.

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

కైలాష నాథ టెంపుల్

కైలాసనాథ టెంపుల్ లో చంద్రుడు విగ్రహం వుంటుంది. ఈ గుడి తిన్గాలూర్ గ్రామంలో కలదు. ఇది కుంబకోనానిని 18 కి. మీ. ల దూరంలో వుంటుంది. అయితే, టెంపుల్ లో ప్రధాన విగ్రహం శివుడిది కావటం చేత దీనికి కైలాష నాద టెంపుల్ అనే పేరు వచ్చింది.

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

వైదీశ్వరన్ టెంపుల్

ఈ టెంపుల్ ను క్రీ. శ. 7 వ శతాబ్దానికి చెందిన శైవ నయనార్ లు నిర్మించారు. వీరు తమిళ మహా కవులు ఈ టెంపుల్ లో కుజ గ్రహం వుంటుంది. ఇక్కడ కల శివ విగ్రహాన్ని వైదీశ్వరన్ లేదా 'నివారణా దేముడు' గా పిలుస్తారు. ఇక్కాడ కల టెంపుల్ కాంప్లెక్స్ లోని కొలను నీటిలో వ్యాధి నివారణా గుణాలు వున్నాయని నమ్ముతారు.

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

స్వేతారంఎస్వర టెంపుల్

ఈ టెంపుల్ లో బుధ గ్రహం కలదు. ఈ టెంపుల్ శీర్కాలి సమీపంలోని తిరువెంగడు గ్రామంలో కలదు. ఇక్కడ కల శివ విగ్రహం ' అఘోర మూర్తి' గా చెప్పబడుతుంది. ఇక్కడ మూడు విసిష్టమైన కొలనులు కలవు. వీటిలో స్నానం చేస్తే, ఏ రకమైన చర్మ వ్యాదులైనా సరే నివారించ బడతాయని చెపుతారు.

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

ఆపత్ సహాఎస్వర్ టెంపుల్

అలాన్ గుడి ఆపత్ సాహాఎస్వర్ టెంపుల్ లో గురు గ్రహం కలదు. ఇక్కడ కూడా శివుడు ప్రధాన దైవం. అలంగుడి తిరువారూర్ జిల్లాలో కలదు. ఇతిహాసం మేరకు శివుడు విషం మింగినపుడు అలంగుడి ఏర్పడినదని అందుకనే ఈ దేముడిని ఆపత్ సహాఎస్వర అంటారని చెపుతారు. ఆపాత్ సహాఎస్వర్ అంటే కష్ట కాలంలో సహాయం చేసే వాడని చెపుతారు.

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

అగ్ని ఈశ్వర టెంపుల్ కన్జనూర్

ఈ దేవాలయంలో శుక్రుడు ప్రధాన దైవం ఇది కావేరి డెల్టా ప్రాంతంలో కలదు. ఇక్కడ కల శివ విగ్రహం అంటే అగ్నిస్వర శుక్ర గ్రహంగా పూజించ బడుతుంది. ఈ టెంపుల్ గురించి తమిళ్ కవి అప్పార్ ఎన్నో పద్యాలు వ్రాశాడు. ఈ టెంపుల్ ను మధ్య యుగం నాటి చోళులు నిర్మించగా, విజయనగర పాలకులు పునరుద్ధరించారు. టెంపుల్ రాజగోపురం అయిదు అంతస్తులు కలిగి రెండు ప్రాకారాలతో వుంటుంది.

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

తిరునల్లార్ శనీశ్వర టెంపుల్

ఇక్కడి దేవాలయంలో కల శివుడిని దర్బ అరణ్యేస్వర్ అంటారు. శని ప్రభావాల గురించి తెలియని వారు వుండరు. ఈ గ్రహ ప్రభావం తో మంచి, చెడూ కూడా జరుగుతాయి.

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

రాహు స్థలం

ఇతిహాసాల మేరకు, ఈ ప్రదేశంలో అనేక సర్పాలు శివుడిని పూజించేవిగా చెపుతారు. సర్పాల రాజు అయిన ఆది శేషుడు ఇక్కడ తపము ఆచరించుట వలన ఈ ప్రదేశానికి తిరు నాగేస్వరం అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశం రాహు గ్రహానిదిగా చెపుతారు. ఇక్కడి ప్రత్యేకత అంటే, రాహుకాల సమయంలో ఇక్కడ పాలు ఉంచితే అవి నీలం రంగులోకి మారిపోతాయని చెపుతారు. ఈ వింతను చూసేందుకు భక్తులు దూర ప్రదేశాలనుండి కూడా వస్తారు.

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నవగ్రహ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

నాగానాద స్వామి టెంపుల్

కీలపెరుమ్పల్లం నాగా నాధ స్వామీ టెంపుల్, కీల పెరుమ్పల్లం గ్రామంలో కలదు. ఇక్కడి గ్రహం కేతువు. రాహువు వలెనె ఇది కూడా ఒక చాయా గ్రహం. ఇతర దేవాలయాల లో వలెనె ఇక్కడ కూడా శివుడు నాగనాథ స్వామి పేరుతో పూజించబడతాడు.

Image credit: Wiki Commons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X