Search
  • Follow NativePlanet
Share
» »రించెన్ పొంగ్ మొనాస్టరీ చూసొద్దామా !!

రించెన్ పొంగ్ మొనాస్టరీ చూసొద్దామా !!

పశ్చిమ సిక్కింలో దట్టమైన అడవుల మధ్య ఉన్న రించెన్ పొంగ్ ఉత్కంఠభరితమైన దృశ్యాలు అందించే దాని పర్వతాలకు, సుందరదృశ్యాలకు పేరొందింది.

By Mohammad

పశ్చిమ సిక్కింలో దట్టమైన అడవుల మధ్య ఉన్న రించెన్ పొంగ్ ఉత్కంఠభరితమైన దృశ్యాలు అందించే దాని పర్వతాలకు, సుందరదృశ్యాలకు పేరొందింది. సముద్రమట్టానికి 5576 అడుగుల ఎగువన ఉన్న రించెన్ పొంగ్ చిన్న పర్వతారోహణ యాత్రలకు సరైనది.

రించెన్ పొంగ్ లో చూడదగిన ప్రాంతాలురించెన్ పొంగ్ దాని అందమైన ప్రదేశాలకే కాక, నిర్మలమైన వాతావరణానికి కూడా పేరొందింది. పర్యాటకులు ఇది అందించే కంచన్ జంగా పర్వత శ్రేణుల ఉత్కంఠభరిత దృశ్యాల వల్ల కూడా ఈ ప్రాంతానికి ఆకర్షితులౌతారు. ఎంతో రద్దీగా ఉండే కంచన్ జంగా పట్టణం నుండి కంచన్ జంగా దృశ్యాలను చూడటానికి మీరు అలసిపోయి ఉంటే, నగరానికి దూరంగా ఉంటూ దాని అందాన్ని పొగడానికి రించెన్ పొంగ్ ఒక ఆదర్శ గమ్యస్థాన౦.

మొనాస్టరీ

చిత్రకృప : Alakananda.s

రించెన్ పొంగ్ లోని చారిత్రిక ప్రాధాన్యత రించెన్ పొంగ్ చరిత్రలో కూడా దాని ప్రాధాన్యతను కల్గి ఉంది. ఈ ప్రాంతంలోనే సిక్కిం రాజు చోగ్యాల్ కు బ్రిటిష్ దళాలకు పోరాటం జరిగింది. దీని వలన అనేక మంది బ్రిటిష్ వారు చనిపోయారు. కారణం సిక్కిం స్థానిక తెగ, లెప్చా ఇక్కడి ఒకే ఒక్క నీటి వనరు, ఒక సరస్సును విషపూరితం చేసారు. ఈ నాటికి కూడా విషపూరితమై ఉన్న ఈ సరస్సును స్థానికంగా "బిఖ్-పోఖ్రి" అంటే స్థానిక భాషలో విషపూరిత సరస్సు అని అర్ధం. రించెన్ పొంగ్ లో ఒక పురాతనమైన బౌద్ధ మఠం కలదు. దీనిని 1730 లో న్గదక్ప లామా నిర్మించాడు.

రించెన్ పొంగ్ లోని పర్యాటక ఆకర్షణలు ఈ ప్రాంతంలో ఉన్న సుందర దృశ్యాల వలన ప్రతి పర్యాటకుడు ఇక్కడ కొద్ది సమయం గడుపుదామనుకుంటాడు. ఈ ప్రాంతంలోని గొప్ప సౌ౦దర్యంతో బాటుగా, రించెన్ పొంగ్ లో కొన్ని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు కూడా దీనికి తోడౌతున్నాయి. రించెన్ పొంగ్ సన్యాసిమఠం మగ్గి దార, రబీంద్ర స్మ్రితి వనం రించెన్ పొంగ్ లోని కొన్ని ప్రధాన ఆకర్షణలు.

రించెన్ పొంగ్ మొనాస్టరీ

రించెన్ పొంగ్ మొనాస్టరీ

చిత్రకృప : Alakananda.s

మగ్గి దార

మగ్గి దార, రించెన్ పొంగ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతం. గొప్ప కుడ్య చిత్రాలు ఉన్న ఒక సన్యాసి మఠానికి ఇది నివాసమైనందున సిక్కింలో పర్యాటక ఆకర్షణ అయింది.

రించెన్ పొంగ్ సన్యాసి మఠం

రించెన్ పొంగ్ సన్యాసి మఠం రించెన్ పొంగ్ లో ఒక ఆసక్తికరమైన ప్రాంతం. ఇక్కడ ఉన్న అతి పెద్ద, అందమైన బుద్ధుని విగ్రహా౦ అతిబుద్ధ విగ్రహం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.

మఠంలో బౌద్ధ విద్యార్థులు

మఠంలో బౌద్ధ విద్యార్థులు

చిత్రకృప : Sukanto Debnath

శ్రీజంగా ఆలయం

రించెన్ పొంగ్ కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ జంగా ఆలయాన్ని స్థానికులు తరచూ సందర్శిస్తుంటారు. శ్రీ జంగా విగ్రహాన్ని లింబు తెగ వారు పూజిస్తారు. ఈ ఆలయం అందాన్ని ఇక్కడ గల అందమైన జలపాతం రెట్టింపు చేస్తుంది. ఈ ఆలయ సందర్శనకు పుష్పాలు పూర్తిగా వికసించే ఏప్రిల్ నెల ఉత్తమమైనది.

రించెన్ పొంగ్ ఎలా చేరుకోవాలి ?

రించెన్ పొంగ్ హెరిటేజ్ హౌస్

రించెన్ పొంగ్ హెరిటేజ్ హౌస్

చిత్రకృప : Lokenrc

రోడ్డుమార్గం ద్వారా

గ్యాంగ్ టక్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేప్ షిప్ కు దగ్గరగా ఉన్న రించెన్ పొంగ్ కు టాక్సీలు, జీపులు, ప్రైవేట్ వాహనాల ద్వారా సులువుగా చేరవచ్చు.

రైలుమార్గం ద్వారా

రించెన్ పొంగ్ లో రైలుస్టేషన్ లేదు. రించెన్ పొంగ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఒకే ఒక్క రైలుస్టేషన్ సిలిగురి మాత్రమే. ఈ స్టేషన్ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానం ఉంది.

విమానమార్గం ద్వారా

సిలిగురికి దగ్గరగా ఉన్న బాగ్డోగ్రా విమానాశ్రయం రించెన్ పొంగ్ కు అతి దగ్గరది. దేశంలోని ముంబై, చెన్నై, గువహతి, ఢిల్లీ, కోల్కతా, వంటి ప్రదేశాల నుండి రోజువారీ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విమానాశ్రయం నుండి కొన్ని అంతర్జాతీయ ప్రాంతాలకు కూడా మార్గం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X