Search
  • Follow NativePlanet
Share
» »శ్రీరాముడు నిర్మించిన ఈ తీర్థంలో స్నానం చేస్తే సర్వ రోగాలు బలాదూర్

శ్రీరాముడు నిర్మించిన ఈ తీర్థంలో స్నానం చేస్తే సర్వ రోగాలు బలాదూర్

పాంబండ్ రామలింగేశ్వర దేవాలయం గురించి కథనం.

భారత దేశంలో ఉన్నన్ని ఆలయాలు మరే దేశంలో కూడా ఉండవు. ఒక్కొక్క ఆలయానిది ఒక్కొక్క విశిష్టత. అవి చిన్న దేవాలయాలు కాని పెద్ద దేవాలయాలు కాని దేని కదే ప్రత్యేకం. ఈ నేపథ్యంలోనే తెలంగాణాలోని ఒక దేవాలయం చాలా భిన్నమైనది. ఇక్కడ తీర్థంలోని నీరు ఎప్పటికీ ఎండిపోదని చెబుతారు. అంతేకాకుండా ఈ నీటిలో స్నానం చేస్తే సర్వ రోగాలు నయమై పోతాయని కథనం. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

దక్షయాగం జరిగిన ప్రదేశం ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే సందర్శనకు అనుమతిదక్షయాగం జరిగిన ప్రదేశం ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే సందర్శనకు అనుమతి

ఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి తెలుసాఇక్కడ 24 గంటలూ చలిస్తుండే శివలింగానికి అభిషేకం చేసిన పాలకు గల శక్తి గురించి తెలుసా

పాంబండ రామలింగేశ్వర స్వామి

పాంబండ రామలింగేశ్వర స్వామి

P.C: You Tube

పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల సమీపంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయానికి పురాణ కాలం నాటి చరిత్ర ఉంది.

విశ్వామిత్రుడు ప్రతిష్టించిన ఈ కాళిని సందర్శిస్తే భూత, ప్రేత పిచాచాలన్నీ బలాదూర్విశ్వామిత్రుడు ప్రతిష్టించిన ఈ కాళిని సందర్శిస్తే భూత, ప్రేత పిచాచాలన్నీ బలాదూర్

త్రేతాయుగంలో

త్రేతాయుగంలో

P.C: You Tube

త్రేతాయుగంలో రావణ సంహారం తరువాత బ్రహ్మ హత్యాపాపం నుంచి విముక్తి కోసం కోటి లింగలను స్థాపించాలని బుుషులు శ్రీరాముడికి సూచిస్తారు. దీంతో శ్రీరాముడు శ్రీలంకలో బయలుదేరి అయోధ్య చేరుకొనే మార్గంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ శివలింగాలను ప్రతిష్టిస్తూ ముందుకు కదులుతారు.

శ్రీరాముడు స్వయంగా

శ్రీరాముడు స్వయంగా

P.C: You Tube

అందులో భాగంగానే పాంబండపైన శ్రీరాముడు స్వయంగా ఒక శివలింగాన్ని స్థాపించి పూజించారని చెబుతారు. అందుకే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడని పిలుస్తారు. ఆలయం పక్కనే రామ లక్ష్మణుల దేవాలయం కూడా ఉంది.

అటు శైవులకు ఇటు వైష్ణవులకు

అటు శైవులకు ఇటు వైష్ణవులకు

P.C: You Tube

అందువల్లే ఈ క్షేత్రం అటు శైవులకు, ఇటు వైష్ణవులకు కూడా ఎంతో ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ సుమారు కిలోమీటరు విస్తీర్ణంలో వెలసిన ఒక ఏకశిల పాము ఆకారంలో మెలితిరిగి ఉంటుంది.

పేరు అలా

పేరు అలా

P.C: You Tube

ఈ పాము-బండ పేరే క్రమంగా పాంబండగా మారిపోయిందని కథనం. కాగా, మొదట్లో పాంబండ ఒక పెద్ద ఏక శిల. కానీ కాలక్రమంలో అది రెండుగా చీలిపోయిందని చెబుతారు. ఈ బండ వెనుక భాగంలో పుట్టు లింగం కూడా ఉంది.

ప్రతి ఏడాది పెరుగుతుంది.

ప్రతి ఏడాది పెరుగుతుంది.

P.C: You Tube

ఇది ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటుందని చెబుతారు. ఇక ఆలయం పక్కనే భ్రమరాంబ దేవి ఆలయం కూడా ఉంది. దానికి ముందు భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ బండకు వెనుక ఉన్న చర్ల అనే ఊరు క్రమంగా బండవెనుక చర్లగా పిలిచేవారు.

కోనేరులో

కోనేరులో

P.C: You Tube

అదే కాల క్రమంలో బండవెల్కి చర్లగా మారింది. పాంబండ పై ఉన్న గుండంలో నీటికి చాలా విశిష్టత ఉందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద బండ మధ్యలో వెలిసిన ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీరు ఉంటుంది.

శ్రీరాముడు బాణాన్ని

శ్రీరాముడు బాణాన్ని

P.C: You Tube

శ్రీరాముడు లింగాన్ని స్థాపించే సమయంలో పూజ చేయడానికి అవసరమైన పుణ్య జలాల కోసం శ్రీరాముడు బాణాన్ని సంధించాడరు. అప్పుడు బండ మధ్య భాగంలో కోనేరు ఏర్పడిందని చెబుతారు. ఆ కోనేరుతోనే శివలింగాన్ని అభిషేకం చేశాడని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తారు.

నీరు ఎప్పటికీ

నీరు ఎప్పటికీ

P.C: You Tube

అందుకే ఈ గుండంలోని నీరు ఎప్పుడూ ఎండిపోదని చెబుతారు. అన్ని కాలాల్లో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ గుండంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు సమసిపోతాయని భక్తుల నమ్మకం అదే విధంగా పొలాల్లో, పశువుల పై ఈ ఇళ్లలోని నీటిని చల్లితే ఎలాంటి అరిష్టాలైనా తొలగిపోతాయని ప్రజల నమ్మకం.

తమతో పాటు తీసుకువెలుతారు

తమతో పాటు తీసుకువెలుతారు

P.C: You Tube

ఇక్కడికి వచ్చిన భక్తులు గుండంలో నీటిని తమతో తీసుకుపోయి పొలాల్లో చల్లుతారు. బ్రహోత్సవాల్లో భాగంగా ఉగాదికి రెండు రోజుల ముందు పాంబండ పై వీర శైవులు అగ్ని గుండలను తొక్కే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమానికి పెద్ధ సంఖ్యలో భక్తులు వస్తారు.

శివగంగ రాజరాజేశ్వర

శివగంగ రాజరాజేశ్వర

P.C: You Tube

ఇక ఈ ఆలయానికి దగ్గర్లోనే శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే మహేశ్వరం గ్రామంలో ఇది ఉంది.

16 శివాలయాలు

16 శివాలయాలు

P.C: You Tube

కోరును మధ్యలో ఉన్న శివలిగాల పైకి ఈ శివగంగ రాజరాజేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. అంతేకాకుండా ఇక్కడున్న కోనేరు చుట్టూ 16 శివాలయాలు ఉన్నాయి.

16 వేర్వేరు నామాలతో

16 వేర్వేరు నామాలతో

P.C: You Tube

ఇవన్నీ పదహారు వేర్వేరు నామాలతో ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయానికి నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తుశకం 1673 నుంచి 1680 మధ్య కాలంలో గోల్కొండ నవాబు తానీషా కాలంలో పనిచేసిన అక్కన్న, మాదన్నలు ఈ ఆలయాన్ని కట్టించారని సమాచారం.

అక్కన్నమాదన్నలు

అక్కన్నమాదన్నలు

P.C: You Tube

అటు పై అక్కన్న, మాదన్నలు హత్యకు గురికావడంతో ఈ ఆలయ ప్రాభవం కొంత తగ్గిపోతూ వస్తుంది. ఇక క్రీస్తుశకం 1687లో ఔరంగజేబు దండయాత్రలు చేసి రాతితో నిర్మించిన ఈ దేవాలయాన్ని ధ్వసం చేశాడు.

శిథిలా వస్థలో

శిథిలా వస్థలో

P.C: You Tube

అప్పటి నుంచి 1979 వరకూ ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలోనే ఉండిపోయింది. అటు పై స్థానికులు కొంతమంది పూనుకొని క్రీస్తుశకం 1980లో ఆలయన పునరుద్ధరకు శ్రీకారం చుట్టింది. దీంతో ప్రస్తుతం మనం చూస్తున్న స్థితిలో శివాలయం ఉంది.

కాశీ నుంచి

కాశీ నుంచి

P.C: You Tube

కాశీ నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతి శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి.

శివగంగ రాజేశ్వరీ

శివగంగ రాజేశ్వరీ

P.C: You Tube

మహేశ్వరంలోని శివగంగారాజేశ్వరీ ఆలయానికి సమీపంలోనే అక్కన్న, మాదన్నలు నిర్మించిన కోట ఉంది. ఈ కోట చుట్టూ నిర్మించిన రాతి కట్టడాలు, కోటలోని నాట్య కళామందిరం, బందిఖనాలు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి.

చాలా సినిమాలను

చాలా సినిమాలను

P.C: You Tube

ఈ కోటలో చాలా సినిమాలను చిత్రీకరించారు. మహేశ్వరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘట్టుపల్లి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం, హైదరాబాదు నుంచి మహేశ్వరం వచ్చే దారిలో తుక్కుగూడలో అయ్యప్పస్వామి ఆలయాలు ఉన్నాయి.

ఇలా వెళ్లవచ్చు

ఇలా వెళ్లవచ్చు

P.C: You Tube

హైదరాబాదుకి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివగంగారాజరజేశ్వర స్వామి ఆలయానికి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్ లోని చార్మినార్, కోఠి, సికింద్రాబాద్, షాద్ నగర్, ఇబ్రాహీం పట్నం, రాజేంద్రనగర్ నుంచి మహేశ్వరానికి ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది.

ఇంద్రుడు మేకు కొట్టడంతో శివలింగానికి రక్తం, నేటికీ ఆ చారలు చూడవచ్చు.ఇంద్రుడు మేకు కొట్టడంతో శివలింగానికి రక్తం, నేటికీ ఆ చారలు చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X