Search
  • Follow NativePlanet
Share
» » శివుడి శరీర భాగాలు పడిన ఈ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శిస్తే మోక్షం ఖచ్చితం

శివుడి శరీర భాగాలు పడిన ఈ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శిస్తే మోక్షం ఖచ్చితం

పంచ కేదార పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కథనం.

లయకారకుడిగా పేరొందిన పరమశివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ నెలలో ఆ దేవదేవుడు వెలిసిన కొన్ని క్షేత్రాలను దర్శనం చేసుకొంటే మోక్షం లభిస్తుందని అనాదిగా హిందువులు నమ్ముతున్నారు.

అంతేకాకుండా ఇందుకోసం పరమ పవిత్రంగా పర్యాటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ పరమశివుడు వెలిసిన కొన్ని క్షేత్రాలు అత్యంత కఠినంగా ఉంటున్నాయి. అయినా కూడా ఆ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం చేసే పర్యాటనలు ఆగడం లేదు.

పైగా ప్రతి ఏడాది ఆ పర్యటనలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు చెప్పబోయే ఐదు క్షేత్రాల సందర్శనం కూడా అత్యంత క్లిష్టమైనదే. అయినా భక్తులు వెలుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరమశివుడి శరీర భాగాలు పడి పుణ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్న ప్రాంతాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

పంచ కేదరాలు

పంచ కేదరాలు

P.C: You Tube

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన అనంతరం పాండవులు తమకు అంటిన బ్రహ్మహత్యా పాతకం, దాయాదులు, బందువులను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానకి శివుడిని ఆరాధించాలని నారదుడి ద్వారా తెలుసుకొంటారు. అయితే పాండవులకు ఈశ్వరుడు తన దర్శనభాగ్యం కల్పించడు.

ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలంటే రానున్న వేసవి వరకూ ఆగాల్సిందే.ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలంటే రానున్న వేసవి వరకూ ఆగాల్సిందే.

పంచ కేదరాలు

పంచ కేదరాలు

P.C: You Tube

కాశీని వదిలి నంది రూపంలో ఉత్తర దిశకు పయానమవుతాడు. చివరికి హిమాలయాలను చేరుకొంటాడు. అయితే పట్టువదలని పాండవులు ఆయనను వెంబడించి గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో ఉన్న ఈశ్వరుడిని గుర్తిస్తారు. దీంతో భీమసేనుడు నంది రూపంలో ఉన్న పరమేశ్వరుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆయన మాయవుతాడు.

పంచ కేదరాలు

పంచ కేదరాలు

P.C: You Tube

అప్పుడు ఈశ్వరుడి శరీర భాగాలు ఐదు చోట్ల పడి అవి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా మారాయి. వీటినే శివ పురాణంలో పంచ కేదారాలు అని అభివర్ణించారు. ఈ పంచకేదారాలు వరుసగా కేదారినాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. నేపాల్ లోని ఘెరాక్ నాధ్ తెగవారు ఈ పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

పంచ కేదరాలు

పంచ కేదరాలు

P.C: You Tube

భారతీయులూ తమ జీవిత చరమాంకంలో ఈ యాత్రలో పాల్గొంటారు. అసలు ఖాట్మాండులోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పంచ కేదారాల నిర్మాణానికి పోలిక ఉందని చాలా మంది భక్తుల భావన. ఈ పంచ కేదారాల దర్శనం వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు చెబుతారు.

మూడు యుగాల నుంచి వెలుగుతున్న ఈ ‘శివజ్యోతి'ని ఈ శ్రావణ మాసంలో చూస్తేమూడు యుగాల నుంచి వెలుగుతున్న ఈ ‘శివజ్యోతి'ని ఈ శ్రావణ మాసంలో చూస్తే

కేదార్నాథ్

కేదార్నాథ్

P.C: You Tube

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదర్నాథ్ ఒకటి. పంచ కేదారాల్లో మొదటిది ఈ కేదార్నాథ్. పాండవులకు అందకుండా పోయిన పరమశివుడు నందిగా మారిన విషయం తెలిసిందే. ఆ నందిలో మూపురం పడిన భాగమే కేదర్నాథ్ గామారిందని చెబుతారు. అందుకు నిదర్శంగా ఇక్కడ శివలింగం ఎనిమిది గజాల పొడవు, నాలుగు గజాల ఎత్తు, నాలుగు గజాల వెడల్పు ఉంటుంది.

కేదార్నాథ్

కేదార్నాథ్

P.C: You Tube

ఇక్కడ శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడి నుంచే ప్రారంభించారని చెబుతారు. అంతేకాకుండా శంకరాచార్యుల వారు మోక్షం పొందిన ప్రదేశం కూడా ఇదే.
ఏడాదిలో ఆరునెలలు మాత్రమే ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.

కేదార్నాథ్

కేదార్నాథ్

P.C: You Tube

ప్రతి ఏడాది అక్షయత్రుతియ నాడు తెరిచి కార్తీక మాసంలో వచ్చే యమద్వితీయ రోజున మూసివేస్తారు. అటు పై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి దగ్గర్లో రుషికేష్ వరకూ రైలు మార్గం ఉంది.

కేదార్నాథ్

కేదార్నాథ్

P.C: You Tube

అక్కడి నుంచి 250 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రాయాణించి గౌరీకుండ్ చేరుకుంటారు. అక్కడి నుంచి కేదర్నాథ్ కు 14 మైళ్లు నడక మార్గం. నడక మార్గం కష్టమని భావించేవారికి డోలీలు, గుర్రాలు అదుబాటుబాటులో ఉంటాయి. దీనికి కొంత రుసుం చెల్లించాలి.

తుంగనాథ్

తుంగనాథ్

P.C: You Tube

పంచ కేదారాల్లో రెండవ పుణ్యక్షేత్రమే తుంగనాథ్. శివుడి రెండు చేతులు పడిన ప్రాంతాన్ని తుంగానాథ్ అని అంటారు. ఇది కేదర్నాథ్ కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. తుంగానాథ్ అంటే శిఖరాలకు అధిపతి అని అర్థం. ఈ క్షేత్రంలో శివలింగం అడుగు ఎత్తులో చేతులను పోలి ఉండటం గమనార్హం.

తుంగనాథ్

తుంగనాథ్

P.C: You Tube

ఇక్కడ శివలింగం స్వల్పంగా ఎడమ వైపునకు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివుడితో పాటు వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. ప్రమధ గణాల విగ్రహాలు కూడా చూడ ముచ్చటగా ఉంటాయి. పాండవులు చెక్కిన చిత్రాలు గోడల పై చూడవచ్చు.

తుంగనాథ్

తుంగనాథ్

P.C: You Tube

ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి. అవి పంచ కేదారాల నమూనా ఆలయాలు అంటారు. ఈ తుంగనాథ్ ఆలయాన్ని అర్జునుడు స్వయంగా నిర్మించాడని కథనం. శీతాకాలంలో ఉత్సవ విగ్రహాన్ని ముకునాథ్ మఠానికి తరలించి పూజిస్తారు.

రుద్రనాథ్

రుద్రనాథ్

P.C: You Tube

పంచ కేదరాల్లో మూడవ క్షేత్రమే రుద్రనాథ్. నంది రూపంలో ఉన్న శివుడి ముఖ భాగం వెలిసిన పుణ్యక్షేత్రమే రుద్రానాథ్ అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ శివలింగం నంది ముఖ రూపంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న పరమేశ్వరుడిని నీలకంఠ్ మహదేవ్ అంటారు.

రుద్రనాథ్

రుద్రనాథ్

P.C: You Tube

తెల్లవారుజామున అభిషేక సమయంలో స్వామి వెండి తొడుగును తొలగిస్తారు. అప్పుడు భక్తులు నిజరూప దర్శనం చేసుకోవచ్చు. ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకొంటారు.

రుద్రనాథ్

రుద్రనాథ్

P.C: You Tube

ఈ ఆలయానికి సమీపంలో గోపేశ్వర గ్రామం ఉంటుంది. దాదాపు 24 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడి ఆలయానికి చేరుకోవాలి. కాబట్టి ఇది పంచకేదారాల్లో అత్యంత క్లిష్టమైన పుణ్యక్షేత్ర పర్యాటకంగా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాన్ని గోపేశ్వర్ లో ఉంచి పూజిస్తారు.

మధ్య మహేశ్వర్

మధ్య మహేశ్వర్

P.C: You Tube

పంచ కేదారాల్లో నాల్గవది మధ్య మహేశ్వర్ పుణ్యక్షేత్రం. విశ్వనాథుడి నాభి భాగం పడిన ప్రాంతమే మధ్య మహేశ్వర్ అని చెబుతారు. నంది రూపంలో ఉన్న పరమేశ్వరుడిని భీమసేనుడు పట్టుకున్న గుప్తకాశీకి ఈ క్షేత్రం 24 మైళ్ల దూరంలో ఉంటుంది.

మధ్య మహేశ్వర్

మధ్య మహేశ్వర్

P.C: You Tube

ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి. ఒకటి పార్వతీ దేవిది కాగా, మరొకటి అర్థనారీశ్వర దేవాలయం. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయ దర్శనం వల్ల కుటుంబ సమస్యలన్నీ తొలిగిపోతాయని భక్తులు భావిస్తారు.

మధ్య మహేశ్వర్

మధ్య మహేశ్వర్

P.C: You Tube

ఆలయానికి కుడివైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతాలకాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. పంచ కేదారాల్లో అత్యంత విశిష్ట క్షేత్రంగా ఈ మధ్య మహేశ్వర్ కు పేరు.

కల్పనాథ్

కల్పనాథ్

P.C: You Tube

పంచ కేదారాల్లో చిట్టచివరిది కల్పనాథ్ పుణ్యక్షేత్రం. రుషికేశ్ నుంచి బద్రీనాథ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ శివుడి ఝటాజూటం లింగ రూపంలో వెలిసిందని స్థలపురాణం చెబుతారు.

కల్పనాథ్

కల్పనాథ్

P.C: You Tube

పంచ కేదారాల క్షేత్రాల్లో సంవత్సరంలోని 365 రోజులూ పూజలు నిర్వహిస్తారు. దట్టమైన అడవుల మధ్య చిన్న గుహల్లో వెలిసిన ఈ స్వామిని ఝుటేశ్వర్ మహదేవ్ అని పిలుస్తారు. ఈ క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X