Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకులకు స్వర్గధామం - పంచగని, మహాబలేశ్వర్ !

పర్యాటకులకు స్వర్గధామం - పంచగని, మహాబలేశ్వర్ !

By Mohammad

ప్రకృతి రమణీయత తో శోభిల్లే జంట పర్యాటక కేంద్రాలు పంచగని. మహాబలేశ్వర్. ఇవి మహారాష్ట్ర రాష్ట్రంలో పశ్చిమకనుమలలో విస్తరించి ఉన్నాయి. మహాబలేశ్వర్, పంచగని ప్రదేశాల మధ్య దూరం 69 కిలోమీటర్లు. పంచగని అంటే 'అయిదు కొండల భూమి' అని, మహాబలేశ్వర్ అంటే 'అయిదు నదుల ప్రదేశం' అని అర్థం.

<strong>కామ్ షెట్ - సాహస క్రీడల నగరం !</strong>కామ్ షెట్ - సాహస క్రీడల నగరం !

వర్షఋతువు ఈ జంట కేంద్రాలను సరికొత్త అందాలను తీసుకువస్తుంది. ఇరుకైన కొండల మధ్య జాలువారే జలపాతాలు మనోహరంగా ఉంటాయి. లోయలు, అడవులు, డ్యాంలు, అరుదైన పక్షులు, అంతరించిపోతున్న మొక్కలు, వివిధ రకాల జంతువులు ఇలా ఎన్నో అద్భుత దృశ్యాలను ఈ ప్రాంతం అందిస్తుంది. పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచిన ఈ ప్రాంతంలో చూడవలసిన సైట్ సీఇంగ్ లు ...

చూపు తిప్పుకొని హిల్ స్టేషన్ ... ఖండాలా !చూపు తిప్పుకొని హిల్ స్టేషన్ ... ఖండాలా !

పంచగని

పంచగని

పంచగని సముద్రమట్టానికి 1350 మీటర్ల ఎత్తున కలదు. పూణే నుండి పంచగని 101 కి.మీ ల దూరంలో, ముంబై నుండి 244 కి.మీ ల దూరంలో (వయా పూణే) ఉన్నది. ఈ ప్రాంతంలో ఎటుచూసిన పచ్చదనమే కనిపిస్తుంది.

చిత్రకృప : B Balaji

షేర్ బాగ్

షేర్ బాగ్

షేర్ బాగ్ అద్భుత ల్యాండ్ స్కేప్ గల ఓక్ అందమైన లోయ. ఇందులో గులాబీ తోట తో పాటు పిల్లలు ఆడుకోవటానికి పార్క్ కూడా ఉంది. గంతులేసే కుందేళ్ళు, కొలనులో కొంగలు చూడముచ్చటగా ఉంటాయి.

చిత్రకృప : Ekabhishek

టేబుల్ ల్యాండ్

టేబుల్ ల్యాండ్

లాటరైట్ నేలతో కూడిన భూమి ఇది. ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద కొండ ప్రాంతపు పీఠభూమిగా దీనిని ఇటీవలే గుర్తించారు. ఇక్కడ పాండవులు కొంతకాలం పాటు ఉన్నారని ప్రతీతి. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆటపాటలతో సాయంత్రం సరదాగా గడపవచ్చు.

చిత్రకృప : JakilDedhia

ధూమ్ డ్యాం

ధూమ్ డ్యాం

ధూమ్ డ్యాం ను కృష్ణా నది మీద నిర్మించారు. పర్యాటకుల కోసం బోట్ షికారు, వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ లు అందిస్తున్నారు. స్పీడ్ బోట్ లు, స్కూటర్ బోట్ లు ఉన్నాయి.

చిత్రకృప : Akash Satpathy

రాయ్ పూర్

రాయ్ పూర్

పంచగని లో కార్తికేయుని గుడి రాయ్ పూర్ గుహలలో కలదు. ఇసుకతో నిర్మించిన ఈ అందమైన దేవాలయాన్ని చూడటానికి భక్తులు బారులు తీరతారు. ఫిబ్రవరి నెలలో ఈ ప్రదేశం అశేష భక్తులతో సందడిగా ఉంటుంది.

చిత్రకృప : B Balaji

సిడ్నీ పాయింట్

సిడ్నీ పాయింట్

సిడ్నీ పాయింట్, పంచాంగాన్ని బస్ స్టాండ్ కు 2 కి. మీ ల దూరంలో కలదు. ఈ వ్యూ పాయింట్ నుంచి కృష్ణా నది లోయ, ధూమ్ డ్యాం, మన్ దర్ దేవి, పాండవ్ గృహ్ లను వీక్షించవచ్చు.

చిత్రకృప : Akhilesh Dasgupta

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్ సతారా జిల్లాలోని పశ్చిమ కనుమలలో విస్తరించి ఉంది. ఈ హిల్ స్టేషన్ సముద్రమట్టానికి 4,718 మీటర్ల ఎత్తున కలదు. నగర జీవనం నుండి కాసింత రిలాక్స్ కోరుకునేవారు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. పర్యాటకులు ఇక్కడి స్ట్రాబెర్రీ రుచులు చూడకుండా ఉండలేరు.

చిత్రకృప : Nishanth Jois

చైనా మాన్స్ ఫాల్స్

చైనా మాన్స్ ఫాల్స్

ఎత్తైన కొండల మధ్య ప్రవహిస్తూ పర్యాటకులను ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి ఈ జలపాతాలు. ఈ ప్రదేశంలో విశ్రాంతి కోరుకునేవారు వెళితే బాగుంటుంది. ఇక్కడ గల లోతైన కొయినా లోయ బహుసుందరంగా ఉంటుంది.

చిత్రకృప : Dinesh Valke

దోభి జలపాతాలు

దోభి జలపాతాలు

దోభి జలపాతాల అందాలను ప్రత్యేకించి వర్షాకాలంలో చూడాలి. ఎత్తు నుండి రొయినా లోయలో పడి కొయినా నదిలో కలిసే తీరు తప్పక ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం మహాబలేశ్వర్ కు 3 కి.మీ ల దూరంలో ఉన్నది.

చిత్రకృప : Clive Dadida

హెలెన్స్ పాయింట్

హెలెన్స్ పాయింట్

దీనినే బ్లూ వేలీ అంటారు. సమీపంలోని జలపాతాలు ఈ ప్రదేశాన్ని అందమైన దృశ్యంగా మార్చాయి. ఇక్కడి నుండి కృష్ణా నదిని చూడవచ్చు. రాబర్స్ కేవ్ ను, నార్త్ కోట్ పాయింట్ ను, గవలాని పాయింట్ మొదలైనవి సమీపంలో చూడదగినవిగా ఉన్నాయి.

చిత్రకృప : Akshatha Inamdar

ముంబై పాయింట్

ముంబై పాయింట్

దీనినే సూర్యాస్తమ పాయింట్ అని అంటారు. మీకు ఈపాటికే అర్ధమయ్యే ఉంటుంది ఇది సూర్యాస్తమ పాయింట్ అని. ఇక్కడి నుండి అద్భుత సూర్యాస్తమ దృశ్యాలను పర్యాటకులు తిలకించవచ్చు. దీనికి సమీపంలోనే లవర్స్ పాయింట్ కలదు.

చిత్రకృప : David Lowry

ప్రతాప్ ఘడ్ ఫోర్ట్

ప్రతాప్ ఘడ్ ఫోర్ట్

ఈ కోట మహాబలేశ్వర్ కు కొద్ది దూరంలో కలదు. దీనిని శివాజీ ఆదేశాలతో కొండపై నిర్మించారు. ఈ కోటాలో ఎన్నో రహస్య గదులు, ద్వారాలు నిండి ఉన్నాయి. భవానీ ఆలయం, శివాలయం, అఫ్జల్ ఖాన్ సమాధి చూడదగ్గవి.

చిత్రకృప : Neeraj Rane

విల్సన్ పాయింట్

విల్సన్ పాయింట్

దీనినే సన్ రైజ్ పాయింట్ అని పిలుస్తారు. పర్యాటకులు ఇక్కడి నుండి అద్భుత సూర్యోదయ దృశ్యాలను చూడవచ్చు.

చిత్రకృప : Reju.kaipreth

బాబింగ్టన్ పాయింట్

బాబింగ్టన్ పాయింట్

ఈ పాయింట్ సముద్ర మట్టం నుండి 1294 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశానికి వెళ్లే మార్గం అంతా పచ్చదనంతో నిండి ఉండటంతో పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చూడగలుగుతారు. చైనా మాన్స్ జలపాతాలు, కొయినా వ్యాలీ ఇక్కడ నుంచి వీక్షించవచ్చు.

చిత్రకృప : ସୁରଥ କୁମାର ପାଢ଼ୀ

ఎలిఫెంట్ హెడ్ పాయింట్

ఎలిఫెంట్ హెడ్ పాయింట్

దీనిని ఏనుగు తల పాయింట్ అని అంటారు . ఈ ప్రదేశం ఏనుగు తల, తొండం ఆకారాన్ని తలపిస్తుంది. ఈ ప్రదేశం నుండి సుదూరాన ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణులను చూడవచ్చు.

చిత్రకృప : Ankur P

మహాబలేశ్వర్ ఆలయం

మహాబలేశ్వర్ ఆలయం

ఈ దేవాలయం శివభగవానుడికి చెందినది. దేవాలయ శిల్పశైలి హేమదంత శైలిలో ఉంటుంది. ఇందులో రెండు గదులు ఉంటాయి. అందులో ఒకటి గర్భగుడి కాగా, మరొకటి సెంట్ర హాల్.

చిత్రకృప : Karthik Easvur

కొన్నాట్ శిఖరం

కొన్నాట్ శిఖరం

ఇది మహాబలేశ్వర్ లోని రెండవ ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 1440 మీటర్లు.
చూడవలసినవి : కృష్ణా నది లోయ, వెన్న సరస్సు, అజిన్ క్యతారా, రాజ్ ఘాట్, కమలాఘడ్, ప్రతాప్ ఘడ్, పసరాని ఘాట్ మొదలైనవి.

చిత్రకృప : Ganesh G

అర్థర్స్ సీట్

అర్థర్స్ సీట్

ఇది సముద్రమట్టానికి 1470 మీటర్ల ఎత్తున, మహాబలేశ్వర్ కు 10 కి. మీ లాదూరంలో ఉంటుంది. లోతైన లోయలు, అద్భుత సైట్ సీఇంగ్ ప్రదేశాలను ఇక్కడి నుండి వీక్షించవచ్చు.

చిత్రకృప : The.sgr

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

మహాబలేశ్వర్ - పంచగని పర్యాటక కేంద్రాలకు చేరువలో పూణే, సతారా నగరాలు ఉన్నాయి. పూణే లో ఎయిర్ పోర్ట్ కలదు. అలాగే సతారా, పూణే లలో రైల్వే స్టేషన్ లు కలవు. ఈ రెండు నగరాల నుండి ప్రతిరోజూ పంచగని, మహాబలేశ్వర్ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్రకృప : Vikas Rana

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X