Search
  • Follow NativePlanet
Share
» »పంచగణి పర్యాటకం వెళ్లారా?

పంచగణి పర్యాటకం వెళ్లారా?

మహారాష్ట్రలోని పంచగణి సతారా జిల్లాలో ఉంది. ఇది ప్రముఖ హిల్‌స్టేషన్.

మహారాష్ట్రలో ట్రెక్కింగ్‌కు అనుకూలమైన అనేక ప్రాంతాలు ఉన్నాయి. అందులో పంచగణి కూడా ఒకటి. పంచగణి సహ్యాద్రి పర్వత పంక్తుల్లో ఉన్న ఒక సుందరమైన ప్రాంతం. ప్రతి వీకెండ్‌లో వేల మంది పర్యాటకులు ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. ఈ నేపథ్యంలో పంచగణికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

పంచగణి, మహారాష్ట్ర

పంచగణి, మహారాష్ట్ర

P.C: You Tube

మహారాష్ట్రలోని సతార జిల్లాలో పంచగణి వస్తుంది. ఇప్పటికీ ఇక్కడి ఉన్న కొన్ని భవంతుల్లో బ్రిటీష్ వాస్తుశైలి కనిపిస్తుంది. గతంలో బ్రిటీష్ వారు తమ సెలవు రోజులను ఇక్కడ గడపడానికి ఎక్కువగా సహాద్రి పర్వత ప్రాంతాలకు వచ్చేవారు.

పంచగణి, మహారాష్ట్ర

పంచగణి, మహారాష్ట్ర

P.C: You Tube

అటువంటి ప్రాంతాల్లో పంచగణి ప్రత్యకస్థానాన్ని ఆక్రమించుకొంది. ఇక్కడి సిడ్నీపాయింట్ పర్యాటకులను అత్యంత ఇష్టమైన స్థలం. ఇక్కడ కుర్చొని చుట్టూ ఉన్న ప్రక`తిని ఆస్వాధించవచ్చు.

పంచగణి, మహారాష్ట్ర

పంచగణి, మహారాష్ట్ర

P.C: You Tube

పంచగణికి వెళ్లాలంటే చలికాలంలో లేదా వేసవి కాలం ప్రారంభంలోనే వెళ్లడం ఉత్తమం. అందువల్ల మీరు నవంబర్ నుంచి మే మధ్య కాలంలో అక్కడికి వెళితే ప్రక`తి సౌదర్యాన్ని ఆస్వాధించవచ్చు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇక్కడ చలి కాస్త ఎక్కువగా ఉంటుంది.

పంచగణి, మహారాష్ట్ర

పంచగణి, మహారాష్ట్ర

P.C: You Tube

విమానం ద్వారా మీరు పంచగణికి వెళ్లాలనుకొంటే పుణే ఇక్కడకు దగ్గరగా ఉంటుంది. పూనే నుంచి నేరుగా పంచగణికి చేరుకోవడానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా ప్రైవేటు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

పంచగణి, మహారాష్ట్ర

పంచగణి, మహారాష్ట్ర

P.C: You Tube

అదే విధంగా రోడ్డు మార్గం ద్వారా కూడా సులభంగా పూణే, మహాబలేశ్వరం తదితర ప్రాంతాల నుంచి నేరుగా ఈ పంచగణిని చేరుకోవచ్చు. సొంతంగా కారు ఉంటే మీ ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.

పంచగణి, మహారాష్ట్ర

పంచగణి, మహారాష్ట్ర

P.C: You Tube

పంచగణికి దగ్గరగా ఉన్న రైల్వేష్టేషన్ సతారా రైల్వేష్టేషన్. అయితే చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి పూనేకు వచ్చి అక్కడి నుంచి పంచగణికి వెళ్లడానికి ఇష్టపడుతారు. ఇక్కడ వసతి తక్కువ బడ్జెట్‌లోనే దొరుకుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X