Search
  • Follow NativePlanet
Share
» »ఇటుక పై నిల్చున్న విష్ణువు, లోహ దండం తేలిన తీర్థం, మునిగిన నారద ఆలయం ఇవన్నీ ఒకే క్షేత్రంలో

ఇటుక పై నిల్చున్న విష్ణువు, లోహ దండం తేలిన తీర్థం, మునిగిన నారద ఆలయం ఇవన్నీ ఒకే క్షేత్రంలో

ఓ భక్తుడి తల్లిదండ్రుల సేవకు మెచ్చి మహావిష్ణువు కరిగిపోయాడు. ఆ భక్తుడి ఆదేశాలకు తలొగ్గి ఓ ఇటుక పై బాల కృష్ణుడి వలే నిలిచిపోయారు. అందుకు గుర్తుగా ఆ విగ్రహం ఎడమ చేతిలో శంఖువును చూడవచ్చు. సాధారణంగా లోహాలు నీటిలో మునిగిపోతాయని తెలిసిందే.

అయితే ఆ పుణ్యక్షేత్రంలో మాత్రం ఓ తీర్థంలో లోహంతో చేసిన దండం నీటి పై తేలి ఇంద్రుడి శాప విముక్తికి మార్గం చూపించింది. మరోవైపు ఈశ్వరుడి చమట బిందువల్ల ఉద్భవించిన భీమా నది ఆ తీర్థం గుండా ప్రవహించి ఆ తీర్థానికి మరింత పవిత్రతను తీసుకువస్తోంది.

దీంతో ఆ తీర్థంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మరోవైపు ఆ క్షేత్రంలోనే నారదుడి దేవాలయం రుక్మిణి శాపం వల్ల నీటి మునిగి పోయింది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ దేవాలయానికి సంబంధించిన కథనం మీ కోసం...

శ్రీ కృష్ణుడి దేవాలయలు

శ్రీ కృష్ణుడి దేవాలయలు

P.C: You Tube

భారత దేశంలో శ్రీ కృష్ణుడి దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా తూర్పున పూరీ, పడమర ద్వారక, ఉత్తరాన మధుర, బదరీ, దక్షిణాన ఉడిపి, గురువాయూర్ వంటివి. ఇటువంటి కోవకు చెందినదే పండరీపురం.

విఠలాలయం

విఠలాలయం

P.C: You Tube

ఇక్కడ శ్రీ కృష్ణుడు కొలువై ఉన్న దేవాలయాన్ని విఠలాలయం అని అంటారు. ఇక్కడ శ్రీ కృష్ణుడు పాండురంగడి రూపంలో కొలువై ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఈ క్షేత్రంలో పాండురంగడు ఒక ఇటుక పై రెండు చేతులూ నడుము మీద పెట్టుకొని నిల్చొన్న భంగిమలో ఉంటాడు.

ముచుకుందుడు

ముచుకుందుడు

P.C: You Tube

దీనికి సంబంధించి ఒక పురాణ కథనం ప్రచారంలో ఉంది. దీని ప్రకారం పూర్వం ముచుకుందుడనే రాజు దేవతలకు యుద్ధంలో సాయం చేస్తాడు. దీంతో దేవతలు రాక్షసుల పై విజయం సాధిస్తారు.

భస్మం కావాలని

భస్మం కావాలని

P.C: You Tube

అయితే దాదాపు వందల ఏళ్లు సాగిన ఆ యుద్దంలో ముచుకుందుడు పూర్తిగా అలిసిపోతాడు. దీంతో దేవతల అనుమతి తీసుకొని ఓ గుహలో నిద్రపోతాడు. ఎవరైతే తన నిద్రను భంగం కలిగిస్తారో వారు నా చూపునకు భస్మం కావాలనే వరాన్ని పొందుతాడు.

నిద్రలేపుతాడు

నిద్రలేపుతాడు

P.C: You Tube

ఈ క్రమంలో శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ ముచుకుందుడు పడుకొన్ని గుహలోకి వెళ్లి దాక్కొంటాడు. శ్రీ కృష్ణుడిని వెదుక్కొంటూ కాలయవనుడు ఆ గుహ వద్దకు వస్తాడు. అయితే తన నుంచి తప్పించుకోవడానికి శ్రీ కృష్ణుడు అక్కడ మునివేషంలో పడుకొన్నాడని భావించి నిద్రలేపుతాడు.

శ్రీ కృష్ణుడు దర్శనమిస్తాడు

శ్రీ కృష్ణుడు దర్శనమిస్తాడు

P.C: You Tube

నిద్రాభంగం అయిన వెంటనే ఆ కాలయవనుడు భస్మం అయిపోతాడు. ఇక అక్కడే ఉన్న శ్రీ కృష్ణుడు ముచుకుందుడకు దర్శనమిస్తాడు. తన శత్రువైన రాక్షసుడు సంహరించడానికి సాయపడిన ముచుకుందుడకు వరం కోరుకోవాల్సిందిగా శ్రీ కృష్ణుడు సూచిస్తాడు.

రానున్న జన్మలో

రానున్న జన్మలో

P.C: You Tube

దీంతో తాను నిద్రలో ఉండి బాల కృష్ణుడి చేష్టలను చూడలేకపోయానని అందువల్ల తనకు బాల కృష్ణుడి రూపంలో కనిపించి అక్కడే కొలువై ఉండాలని కోరుతాడు. వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుందని చెప్పి శ్రీ కృష్ణుడు అక్కడి నుంచి అంతర్థానమై పోతాడు.

తల్లిదండ్రల పై భక్తి శ్రద్ధలతో

తల్లిదండ్రల పై భక్తి శ్రద్ధలతో

P.C: You Tube

ఇదిలా ఉండగా మచుకుందుడు తరువాతి జన్మలో పుండరీకుడిగా జన్మిస్తాడు. మొదట్లో అన్ని చెడుఅలవాట్లు ఉన్న ఈ పుండరీకుడు అటు పై తల్లిదండ్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు.

 బాల కృష్ణుడి రూపంలో

బాల కృష్ణుడి రూపంలో

P.C: You Tube

ఒకసారి ఈయన భక్తిని పరీక్షించదలిచి దేవతలు విష్ణువును పంపిస్తాడు. దీంతో విష్ణువు బాల కృష్ణుడి రూపంలో పుండరీకుడు ఉన్న ఇంటి ముందుకు వచ్చి నీ భక్తికి మెచ్చి వరాలు ఇవ్వడానికి వచ్చానని చెబుతాడు. ఇంటి బయటికి రావాల్సిందిగా సూచిస్తాడు.

ఇటుకను బయటికి విసురుతాడు

ఇటుకను బయటికి విసురుతాడు

P.C: You Tube

అయితే తాను ప్రస్తుతం తల్లిదండ్రుల సేవలో ఉన్నానని ఇప్పటికిప్పుడు రావడం కుదరదని చెబుతాడు. అయినా పట్టువిడవకుండా విష్ణువు పిలుస్తూ ఉంటాడు. దీంతో కోపంతో పుండరీకుడు ఓ ఇటుకను బయటికి విసిరి మరు మాట్లాడకుండా దాని పై నిలుచుకోవాలని సూచిస్తాడు.

పాండురంగడు

పాండురంగడు

P.C: You Tube

పుండరీకుడికి వరాల కంటే తల్లిదండ్రుల సేవలే ఎక్కువన్న విషయాన్ని గుర్తించిన పాండు రంగడు ఆ ఇటుక పై అలాగే విగ్రహ రూపంలో నిలబడి పోతాడు. అంతేకాకుండా పుండరీకుడికి గత జన్మలో జరిగిన విషయాలన్ని చెప్పి తాను ఇక పై ఇక్కడ నీ పేరు మీదనే పాండురంగడుగా కొలువై ఉంటానని చెబుతాడు.

 లోహ తీర్థం

లోహ తీర్థం

P.C: You Tube

అలా పాండరీపురంలో పాండురంగడు కొలువై ఉన్నాడు. ఇక ఇక్కడే లోహదండ తీర్థం ఉంది. ఈ తీర్థ:లో మునిగితే ఎటువంటి పాపాలైనా నశించిపోతాయాని చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం ఇంద్రుడికి గౌతమ ముని శాపం వల్ల ఒంటి పై వెయ్యి కన్నులు మెలిచి అంద వికారంగా తయారవుతాడు.

శాప విమోచనం

శాప విమోచనం

P.C: You Tube

దీంతో ఇంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి శాప విమోచన మార్గం చెప్పమని సూచిస్తాడు. దీంతో ఇంద్రుడు విష్ణవు ఇంద్రుడికి ఒక ఇనుప దండమిచ్చి ఈ భూమండలంలో ఏ తీర్థంలో ఈ దండం తేలుతుందో అక్కడే నీకు శాప విమోచనం కలుగుతుందని చెబుతాడు.

అందుకే ఆపేరు

అందుకే ఆపేరు

P.C: You Tube

దీంతో ఇంద్రుడు భూలోకంలో అనేక తీర్థాలు తిరుగుతూ ఇక్కడ ఉన్న తీర్థంలో ఇనుప దండాన్ని వేస్తాడు. అక్కడ ఇనుప దండం తేలుతుంది. వెంటనే ఇంద్రుడు ఈ తీర్థంలో స్నానం చేసి శాపం నుంచి విముక్తి పొందుతాడు. అప్పటి నుంచి ఇది లోహ దండ తీర్థంగా పేరు గాంచింది.

చంద్రభాగ నది

చంద్రభాగ నది

P.C: You Tube

భీమా నదిని ఈ క్షేత్రంలో చంద్రభాగ నది అంటారు. ఈ నది ఈ క్షేత్రంలో చంద్రవంక లా కనిపించడం కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. ఇక ఈ నది ఒడ్డున 11 ఘాట్ లు ఉన్నాయి. ఆలయం ఎదురుగా ఉన్న ఘాట్ లో పుండరీకుడి మందిరం, ఆయన తల్లిదండ్రుల సమాధులతో పాటు మరికొందరి భక్తుల మందిరాలను కూడా చూడవచ్చు.

నారదుడి మందిరం

నారదుడి మందిరం

P.C: You Tube

ఈ నదిలో నారదుడి ఆలయం మునిగి ఉంటుంది.శ్రీ కృష్ణుడికి తనకు తగువులు పెట్టిన కారణంగా నారదుడి ఆలయం నీట మునిగిపోవాలని రుక్మిణి శపించిందని ఇక్కడి వారి కథనం. అందువల్లే ఈ నదిలో నారదుడి ఆలయం మునిగిపోయిందని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X