Search
  • Follow NativePlanet
Share
» »పన్హాలా హిల్ స్టేషన్ - అద్భుతం, ప్రశాంతం !

పన్హాలా హిల్ స్టేషన్ - అద్భుతం, ప్రశాంతం !

కొల్హాపూర్ మహాలక్ష్మిదేవి ఆలయాన్ని దర్శించే పర్యాటకులు పన్హాలా హిల్ స్టేషన్ ను తప్పక సందర్శిస్తారు. కొల్హాపూర్ నుండి ఈ హిల్ స్టేషన్ వరకు తరచూ ప్రవేట్ వాహనాలు, ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

By Mohammad

పన్హాలా ఒక హిల్ స్టేషన్. ఇది మహారాష్ట్ర కొల్హాపూర్ (లక్ష్మి దేవి ఆలయానికి ప్రసిద్ధి) జిల్లాలోని గంభీరమైన పడమటి కనుమల మధ్యలో .. సముద్రమట్టానికి 3200 అడుగుల ఎత్తులో కలదు. ముంబై నగరం నుండి లాంగ్ వీకెండ్ గడపాలనుకొనేవారికి ఈ హిల్ స్టేషన్ ఎంతో విశ్రాంతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. ముంబై నగరం నుండి 374 కిలోమీటర్ల దూరంలో, కొల్హాపూర్ పట్టణం నుండి 21 కిలోమీటర్ల దూరంలో, పూణే నుండి 231 కిలోమీటర్ల దూరంలో పన్హాలా హిల్ స్టేషన్ కలదు.

కొల్హాపూర్ మహాలక్ష్మిదేవి ఆలయాన్ని దర్శించే పర్యాటకులు పన్హాలా హిల్ స్టేషన్ ను తప్పక సందర్శిస్తారు. కొల్హాపూర్ నుండి ఈ హిల్ స్టేషన్ వరకు తరచూ ప్రవేట్ వాహనాలు, ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

<strong>షిర్డీ వెళ్తున్నారా ?</strong>షిర్డీ వెళ్తున్నారా ?

చరిత్రను ఒకసారి పరిశిలిస్తే గొప్ప మరాఠా సాంస్కృతిక వైభవానికి పన్హాలా అద్దంలా మెరుస్తూ కనిపిస్తుంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ పన్హాలా కోట. శివాజీ పాలనలో ఇది కొన్ని రోజులు మాత్రమే ఉన్నది. ఔరంగజేబుకు బందీగా చిక్కిన శివాజీ, చివరి క్షణంలో ఈ కోట నుండే తప్పించుకున్నాడు.

పన్హాలా హిల్ స్టేషన్ చిన్నది మరియు అందమైనది. పర్యాటకులు సంవత్సరం పొడవునా హిల్ స్టేషన్ ను సందర్శించవచ్చు. తాజాగాలి, చల్లని పరిసరాలు, ఆహ్లాదపరిచే ప్రకృతి, జలపాతాలు, పచ్చదనం, కోటలు వంటివి పర్యాటకులను ఆకర్షిస్తాయి.

అష్టవినాయక - జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకొనే యాత్ర !అష్టవినాయక - జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకొనే యాత్ర !

పన్హాలా కోట

పన్హాలా కోట

పన్హాలా కోట, పన్హాలా హిల్ స్టేషన్ లో ప్రధాన ఆకర్షణ. దీనిని క్రీ.శ. 12 వ శతాబ్దంలో రాజు రాజా భోజ్ నిర్మించాడు. దీని ప్రవేశం దుర్భేద్యంగా ఉంటుంది. ఇది శక్తివంతమైనది మరియు రక్షణ అవసరాల కోసం నిర్మించబడింది. కోట ను శివాజీ 500 రోజులు మాత్రమే పాలించాడు.

చిత్రకృప : Pmohite

సజ్జా కోఠి

సజ్జా కోఠి

సజ్జా కోఠి అనేది పన్హాలా కోట లో మరణశిక్షలు అమలుచేసే గది. ఇది మూడు అంతస్తులు కలిగి ఉంటుంది. శివాజీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కు పట్టుబడి ఈ గదిలోనే బంధించబడ్డాడు. శివాజీ తన చాకచక్యంతో అతి సులభంగా ఈ గది నుంచి బయటపడ్డాడు.

చిత్రకృప : Nilesh2 str

తీన్ దర్వాజా

తీన్ దర్వాజా

తీన్ దర్వాజా అంటే మూడు ద్వారాలు అని అర్థం. కోట లోకి ప్రవేశించాలంటే ఈ మూడు గేట్ల ద్వారానే లోనికి వెళ్ళాలి. బ్రిటీష్ వారు కూడా ఈ ద్వారాల గుండా లోనికి ప్రవేశించి కోటను హస్తగతం చేసుకున్నారు.

చిత్రకృప : DigheArun

అందర్ బావి

అందర్ బావి

అందర్ బావి కోటలో దాగున్న రహస్య బావి. ఇది మూడు అంతస్తులుగా ఉంటుంది. కోటను శత్రువులు ముట్టడించినప్పుడు రాజులు ప్రాణ రక్షణ కోసం ఈ బావిలో దాక్కొనేవారు, కోట బయటకు వచ్చేవారు.

చిత్రకృప : Ankur P

కలవంటిచ మహల్

కలవంటిచ మహల్

దీనినే నాయకిని సజ్జా అని కూడా పిలుస్తారు. ఇది కోట కు తూర్పు దిక్కున కలదు. చెప్పాలంటే ఇదొక టెర్రస్ రూమ్. బహమనీ సుల్తాన్ కాలంలో దీనిని రంగ్ మహల్ (ఆస్థాన స్త్రీలు నివాసం ఉండే చోటు) గా వ్యవహరించేవారు.

చిత్రకృప : DigheArun

రాజ్ డిండి బురుజు

రాజ్ డిండి బురుజు

రాజ్ డిండి బురుజు కోట నుండి బయటపడే ఒక రహస్య మార్గం. దీనిని అత్యవసర సమయాల్లో (యుద్ధం జరిగేటప్పుడు) వినియోగించేవారు. శివాజీ పవన్ ఖిండ్ యుద్ధంలో ఈ మార్గం నుండే తప్పించుకొని విశాల్గఢ్ చేరుకున్నాడు.

చిత్రకృప : Ankur P

అంబర్ ఖానా కోట

అంబర్ ఖానా కోట

అంబర్ ఖానా కోటను మరాఠా పాలకులు పెద్దదిగా మరియు దృఢంగా నిర్మించినారు. ఇందులో రాజు రాచకార్యాలు, సమావేశాలు నిర్వహించేవారు. ఖజానా గది లేదా మింట్ గది ని కూడా కోట లో చూడవచ్చు.

చిత్రకృప : Ankur P

ధాన్యంచ కొఠార్

ధాన్యంచ కొఠార్

అంబర్ ఖానా కోట కు సమీపాన ఉన్న మరో కట్టడం ధాన్యంచ కొఠార్. ఇదొక పురాతన భవనం. దీనిలో ఆహార ధాన్యాలు నిల్వచేసేవారు. గంగా, జమున మరియు సరస్వతి అనే పేర్లు గల మూడు ధాన్యాగారాలు ఉండేవి.

చిత్రకృప : Nilesh2 str

బొటానికల్ గార్డెన్

బొటానికల్ గార్డెన్

ఎంప్రెస్బొటానికల్ గార్డెన్ గా కూడా పిలువబడే ఈ గార్డెన్ లో అప్పట్లో రాజులు సాయంత్రం వేళ విశ్రాంతి తీసుకోవటానికి వచ్చేవారు. ప్రస్తుతం ఈ తోట పొడవైన చెట్లతో, పచ్చని బయళ్లతో నిండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. పిల్లలు ఆడుకోవటానికి, పెద్దలు సేదతీరటానికి గార్డెన్ లో చాలా ప్రదేశాలు ఉన్నాయి. బోట్ విహారం, గుర్రపు స్వారీ అదనపు ఆకర్షణలు.

చిత్రకృప : nilesh1foru

దాజీపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ

దాజీపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ

ఈ శాంక్చురీ కొల్హాపూర్ జిల్లా, రాధానగరి తాలూకాలో ఉన్నది. ఈ శాంక్చురీ చుట్టూ సహ్యాద్రి కొండలు, పశ్చిమ కనుమలు కప్పబడి ఉన్నాయి. వివిధ రకాలైన జంతువులకు, పక్షులకు మరియు మొక్కలకు ఇది ఆవాసం. శాంక్చురీ లో గడపాలనుకొనేవారు అటవీ శాఖ అనుమతితో ఫారెస్ట్ రెస్ట్ రూమ్, డాక్ బంగ్లా మరియు డార్మిటరీ లో బస చేయవచ్చు.

చిత్రకృప : BetacommandBot

ఆలయాలు మరియు సమాధులు

ఆలయాలు మరియు సమాధులు

శంభాజీ II, సోమేశ్వర, మహంకాళి ఆలయం, అంబాబాయ్ ఆలయం లు కోటలో ఉన్నాయి. శివాజీ యుద్ధానికి సన్నద్ధం అయ్యేటప్పుడు అంబాబాయ్ ఆలయంలో పూజలు జరిపేవాడట. శంభాజీ II కు ఎదురుగా ఆయన భార్య జీజాబాయ్ సమాధి కలదు.

చిత్రకృప : Ankur P

తారాబాయి ఫోర్ట్

తారాబాయి ఫోర్ట్

తారాబాయి ఫోర్ట్ ను రాణి తారాబాయి వీరోచిత పోరాటానికి గుర్తుగా నిలిచింది. ప్రస్తుతం ఈ కోట ప్రదేశాన్ని స్కూల్ గా, గవర్నమెంట్ ఆఫీస్ లుగా మరియు బాయ్స్ హాస్టల్ గా మార్చివేశారు. శిధిలావస్థ దశలో ఉన్న కోట మిగితా భాగాన్ని పర్యాటకులు తరచూ సందర్శిస్తారు.

చిత్రకృప : Nilsjadhav

పరుశురాముడు గుహలు

పరుశురాముడు గుహలు

పన్హాలా లో పరుశురాముడు నివాసం ఉన్న గుహలు ఉన్నాయి. సుప్రసిద్ధ మరాఠా కవి మోరోపంత్ ఇక్కడే కూర్చొని నవలలు, కవిత్వాలు వ్రాసాడు.

చిత్రకృప : Nilesh2 str

వసతి

వసతి

మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ టెంట్స్, గదులు లను అద్దెకు ఇస్తుంటారు. ప్రవేట్ హోటళ్ళు, రిసార్ట్ లు కూడా ఈ హిల్ స్టేషన్ లో బాడుగకు దొరుకుతాయి. వాటిలో హోటల్ హిల్ టాప్ ముందువరుసలో ఉన్నది.

చిత్రకృప : Ankur P

పన్హాలా హిల్ స్టేషన్

పన్హాలా హిల్ స్టేషన్

పన్హాలా కు సమీపాన కొల్హాపూర్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లేదా ఆటో రిక్షాలలో ప్రయాణించి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్హాలా హిల్ స్టేషన్ సులభంగా చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్లు : మీరజ్ - 55 కి.మీ, సాంగ్లీ - 55 కి.మీ.

చిత్రకృప : Yogendra Joshi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X