Search
  • Follow NativePlanet
Share
» »మీ చావును ముందుగా తెలిపే దేవాలయం ఇదే?

మీ చావును ముందుగా తెలిపే దేవాలయం ఇదే?

హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో పశుపతినాథ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం హిమాలయ పర్వతాల్లో ఉంది. ఇక్కడ పరమశివుడు పశుపతినాథ రూపంలో కొలువై ఉన్నాడు. జీవిత చరమాంకంలోనైనా ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల చేసిన పాపాలన్నీ పోయి తప్పక మోక్షం లభిస్తుందని చెబుతారు. మరికొంత మంది ముసలివారు జీవిత చరమాంకంలో ఇక్కడే ఆశ్రయం పొందుతూ తమ ప్రాణాలను వదిలివేస్తుంటారు. ఇంతటి విశిష్టత వెనుక ఉన్న కారణాలన్నీ మీ కోసం...

పశుపతినాథ దేవాలయం

పశుపతినాథ దేవాలయం

P.C: You Tube

అనేకమంది హిందువులు తమ జీవన యాత్ర చివరి దశలో ఈ పశుపతినాథ దేవాలయాన్ని చేరుకొంటారు. ఈ పశుపతినాథ దేవాలయంలో ప్రాణాలు వదిలిన వారు తమ జీవితంలో చేసిన పాపాలననీ పోగొట్టుకొని పునీతులవుతారని విశ్వసిస్తారు. తద్వార జన్మరాహిత్యం పొందుతామనేది వారి నమ్మకం.

జ్యోతిష్యాలు

జ్యోతిష్యాలు

P.C: You Tube

సాధారణంగా పుట్టుక మరణాలు ఎవరూ అంచనా వేయలేరు. ఈ జగత్తులో వాటి గురించి ఖచ్చితంగా చెప్పగలిగేవారు కేవలం ఆ దైవమే. అయితే ఈ పశుపతినాథ దేవాలయంలో ప్రధాన అర్చకులు భక్తుల మరణానికి సంబంధించిన రోజు, సమయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారు. ఇక్కడి వాతావరణంలో మరణ దేవత ఉండటమే ఇందుకు కారణమని చెబుతారు.

ప్రధాన దైవాలయం

ప్రధాన దైవాలయం

P.C: You Tube

పశుపతినాథ దేవాలయం బంగార శిఖరంతో అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం భగవతి నది తీరంలో, పశ్చిమ దిశలో ఉంది. ఈ దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో జరిగే వైదిక కార్యక్రమాలు కొన్ని ఆశ్చార్యానికి గురిచేస్తాయి.

ప్రధాన ద్వారాలు

ప్రధాన ద్వారాలు

P.C: You Tube

ఈ దేవాలయం హిందూ వాస్తు శిల్పశైలతో నిర్మితమైనది. ఈ దేవాలయానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ భాగమతి తీరంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా శైవ దేవాలయాలు ఉండటం గమనార్హం.

బంగారు కళశాలు

బంగారు కళశాలు

P.C: You Tube

ఈ దేవాలయ ప్రధాన శిఖరాల పై బంగారు కళశాలను అమర్చారు. ఆ సూర్య కిరణాలు వీటి పై పడినప్పుడు ఇవి మెరిసిపోతు కనులకు విందును చేస్తాయి. ఇక్కడి శిల్ప సౌదర్యం ఎంత ముచ్చట గొలిపిస్తుందో పూజాది కార్యక్రమాలు అంతే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్ని కార్యక్రమాలు భయంకరంగా కూడా ఉంటాయి.

శిల్పాలు

శిల్పాలు

P.C: You Tube

ఈ దేవాలయం అద్భుత శిల్పకళకు నిలయం. ఆ శిల్పాలను చూస్తున్నంత సేపు మనం నిజమైన దేవతలను, నాట్యగత్తలను చూస్తున్నామేమో అన్న అనుభూతిని కలిగిస్తుంది. అందువల్లే భారతీయ శిల్పకళ పై పరిశోధన చేసేవారు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు.

పెద్ద నంది

పెద్ద నంది

P.C: You Tube

వీటన్నింటితో పాటు ఈ దేవాలయంలో బ`హత్ నంది భక్తులను ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఈ దేవాలయం గర్భగుడిలోకి మాత్రం కేవలం హిందువులకు మాత్రమే అనుమతి. మిగిలిన దేవాలయ ప్రాంగణం మొత్తం ఎవరైనా తిరుగవచ్చు.

విదేశీయులు

విదేశీయులు

P.C: You Tube

ఈ దేవాలయాన్ని సందర్శించే పర్యాటకుల్లో దాదాపు 30 శాతం విదేశీయులే ఉండటం గమనార్హం. ఈ దేవలయం గర్భగుడిలోకి తప్ప మిగిలిన ప్రాంతమంతా వీరిని తిరడగానికి అనుమతిస్తారు. భాగమతి తూర్పు దిశ నుంచి చూస్తే ఈ దేవాలయం ఎంతో అందంగా కనిపిస్తుంది.

అనాథలకు ఆశ్రమం

అనాథలకు ఆశ్రమం

P.C: You Tube

పశ్చిమ తీరంలో పశుపతినాథ దేవలయంతో పాటు పంచ దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే ఐదు పుణ్య దేవాలయాలన్నమాట. ఈ ఐదు పుణ్య దేవాలయాల్లో ఒక్కప్పుడు దూప దీప నైవేద్యాలు జరిగేవి. ప్రస్తుతం ముసలివారికి ఆ్రయం కల్పిస్తున్నాయి.

అంత్యక్రియలు

అంత్యక్రియలు

P.C: You Tube

ఈ నదీ తీరంలో ఎక్కడ చూసిన శివలింగాలే దర్శనమిస్తాయి. దీంతో ఈ ప్రదేశంలో అణువణువునా ఆ పరమశివుడు ఉన్నాడని భావిస్తారు. ఇక ఈ భాగమతి నది ఎడమవైన అంత్యక్రియలు నిర్వహించడానికి అనేక వేదికలు ఉన్నాయి. ప్రతి వేదిక వద్ద ప్రతి రెండుగంటలకు ఒకసారైన అంత్యక్రియల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.

ప్రతి జీవిలోనూ దైవత్యం

ప్రతి జీవిలోనూ దైవత్యం

P.C: You Tube

ఇక్కడ ఉన్న ప్రతి జీవిలోనూ ఆ పరమశివుడు ఉన్నాడని భావించి మహిళలు ఇక్కడ కనబడిన ప్రతి జీవికి ఏదో ఒక ఆహారం అందజేస్తుంటారు. తద్వారా పుణ్యం వస్తుందని భావిస్తుంటారు.

ఫొటోల కోసం ఫోజులు

ఫొటోల కోసం ఫోజులు

P.C: You Tube

ఈ దేవాలయంలో సాధువులు ఎక్కువగా కనిపిస్తుంటారు. పర్యాటకులు, భక్తులతో చాలా స్నేహంగా కూడా మెలుగుతూ ఉంటారు. ఫొటోలకు ఫోజులు కూడా ఇస్తారు. అయితే ఇందు కోసం కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X