Search
  • Follow NativePlanet
Share
» »రావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవే

రావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవే

పౌరివాల మందిరం గురించి కథనం

రావణుడు రాక్షసరాజుగానే మనకు తెలుసు. అయితే ఆయనకు రావణ బ్రహ్మగా కూడా పేరుంది. సకల శాస్త్రాలను చదివిని విద్యావంతుడు ఆయన. రామ రాజ్యం కంటే రావణ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించే వారు. అయితే రావణుడు చేసిన ఒకే ఒక తప్పిదంతో అతనికి ఉన్న మంచి లక్షణాలన్నీ మరుగుణ పడిపోయాయి. ఇక ఆ లంకాధిపతి రావణుడు ఆ పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి స్వర్గానికి చేరుకోవడానికి మెట్లను నిర్మింప జేసిన ఓ ప్రాంతం గురించి తెలుసుకొందాం. అదే విధంగా రావణుడికి సంబంధించిన మరికొన్ని వివరాలు మీ కోసం...

అరుదైన 'సబ్బురాయి' తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లోఅరుదైన 'సబ్బురాయి' తో నిర్మించిన దేవాలయాలు ఈ జంట నగరాల్లో

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

రావణుడు హిమాచల్ ప్రదేశ్ లోని సిరోమోర్ జిల్లాలోని పౌరి వాలా మందిరంలో తానకు అమరత్వం ప్రసాదించాలని కోరుతూ శివుడి గురించి ఘెర తపస్సు చేశాడు.

పరమశివుడు

పరమశివుడు

P.C: You Tube
రావణుడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోవాల్సిందిగా రావణుడికి చెబుతారు. దీంతో మహాదానందంతో రావణుడు తనకు చావుల లేకుండా అమరత్వాన్ని ప్రసాదించాలని కోరుకొంటాడు.

షరత్తు

షరత్తు

P.C: You Tube

ఇందుకు పరమశివుడు ఒక షరత్తును విధిస్తాడు. దాని ప్రకారం రావణుడు స్వర్గానికి చేరుకోవడానికి అవసరమైన మెట్లను ఒకరాత్రి లోపు ఐదు చోట్ల నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు రావణుడు సంసిద్ధత వ్యక్తం చేస్తాడు.

హరిద్వార్

హరిద్వార్

P.C: You Tube

అందులో భాగంగా హరిద్వార్ లో మొదటగా స్వర్గానికి చేరుకోవడానికి మెట్లను నిర్మిస్తాడు. దీనినే హరి కి పౌరి అంటారు. అటు పై హిమాచల్ ప్రదేశ్ లోని పోడివాలా మందిరంలో మెట్లను నిర్మిస్తాడు.

మెట్లను

మెట్లను

P.C: You Tube

చోడేశ్వర్ మహాదేవ్ మందిరంలో, కిన్నార్ కైలాశ్ మందిరంలో మెట్లను నిర్మిస్తాడు. దీంతో మొత్తం నాలుగు చోట్ల రావణుడు స్వర్గానికి చేరుకోవడానికి అవసరమైన మెట్లను నిర్మింపజేస్తాడు. మిగిలిన ఐదో చోటు కోసం వెదుకుతూ ఉండగా దేవతలంతా కలిసి ఆయనకు నిద్ర వచ్చేలా చేస్తారు.

రావణుడు నిద్రపోతాడు

రావణుడు నిద్రపోతాడు

P.C: You Tube

దీంతో రావణుడు కొద్ది సేపు నిద్రపోతాడు. లేచి చూసే సమయానికి సూర్యోదయం అయి ఉంటుంది. దీంతో పరమేశ్వరుడు ఆ రావణుడికి ఇచ్చిన వరం వ్యర్థమవుతుంది. అయితే రావణుడు తన అమరత్వం కోసం తపస్సు చేసిన ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాలన్నీ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉండటం విశేషం.

ప్రతి నాయకుడు

ప్రతి నాయకుడు

P.C: You Tube

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామాయణములో ప్రతి నాయకుడు రావణుడు. ఆయన లంకకు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడు కాబట్టే అతనిని పది తలలతో చిత్రిస్తారు.

పది తలలు ఉండటంతో

పది తలలు ఉండటంతో

P.C: You Tube

పది తలలు ఉండటం చేత ఈయనకు దశ ముఖుడని దశ కంఠుడని పిలుస్తారు. భారతదేశం నుంచి తాము స్వతంత్రులయ్యామన్న దానికి ప్రతీకగా శ్రీలంకలో రావణుడిని ఇప్పటికీ గౌరవిస్తారు.

బ్రహ్మ మానస కుమారుడైన

బ్రహ్మ మానస కుమారుడైన

P.C: You Tube

బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వ వసు బ్రహ్మనికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసుడు జన్మిస్తాడు. రావణాసుడి సోదరులు కుంభకర్ణుడు, విభీషనుడు.

శూర్పణఖ

శూర్పణఖ

P.C: You Tube

ఇక రావణాసుడి చెల్లెలు శూర్పణఖ. రావణాసురుడు వేద విద్యలు తన తండ్రి విశ్వ వసు బ్రహ్మ నుంచి నేర్చుకొని గొప్ప విద్వాంసుడు అవుతాడు. అదే విధంగా తన తాత సుమాలి వద్ద నుంచి రాజ్యపాలనా విషయాలు తెలుసుకొని ప్రజారంజకంగా పాలిస్తుంటాడు.

భార్య మండోదరి

భార్య మండోదరి

P.C: You Tube

ఇతని భార్య మయుని కుమార్తే మండోదరి. రావణుడు కుబేరునితో తలపడి అతని పై యుద్ధంలో గెలుస్తాడు. అతని వద్ద ఉన్న పుష్పక వీమానాన్ని స్వాధీనం చేసుకొంటాడు.

వాలితో

వాలితో

P.C: You Tube

వానర నాయకుడు వాలితో యుద్ధం చేయడానికి వెళ్లి అతడి బాహువుల్లో చిక్కి సప్త సముద్రాల నీళ్లు తాగుతాడు. దీంతో తాను వాలిని గెలువలేనని తెలుసుకొని అతనితో స్నేహం చేస్తాడు.

కార్త వీరార్జునిడితో ఓడిపోయి

కార్త వీరార్జునిడితో ఓడిపోయి

P.C: You Tube

కార్తవీర్యార్జునిడితో యుద్ధంలో ఓడిపోయి కొద్ది కాలం చెరసాలలో కూడా ఉంటాడు. స్వర్గం పై దండెత్తి రంభను బలత్కరిస్తాడు. దీంతో మరోక స్త్రీని నీవు ఇలా బలత్కరిస్తే నీ తల వెయ్యి చెక్కలవుతుందని ఆమె శాపం పెడుతుంది.

దేవేంద్రుడితో

దేవేంద్రుడితో

P.C: You Tube

దేవేంద్రుడితో యుద్ధం చేసే సమయంలో అతని వాహనమైన ఐరావతం రావణుడి రొమ్ములో తన దంతాలతో పొడుస్తుంది. అయితే ఆ దంతాలు విరిగిపోతాయి. దీంతో రావణుడు ఎంతటి బలవంతుడో అర్థం చేసుకోవచ్చు.

రామ రావణ యుద్ధం

రామ రావణ యుద్ధం

P.C: You Tube

అంతేకాకుండా బ్రహ్మ వరంతో రావణుడికి తన కడుపులో అమ`త కలశం ఉంటుంది. అందువల్లే ఎన్ని సార్లు తలలు నరికినా అతనికి చావు రాదు. అందుకే రామ రావణ యుద్ధ సమయంలో విభీషనుడు ఈ కిటుకును రాముడికి చెప్పి రావణుడి అమ`త కలశమును ఛేదించి ఆయన్ను హతమారుస్తాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X