Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ అరటిపళ్లు ఇస్తే చాలు కోరికలన్నీ తీరిపోతాయి?

ఇక్కడ అరటిపళ్లు ఇస్తే చాలు కోరికలన్నీ తీరిపోతాయి?

ఉడిపిలోని శ్రీ క్షేత్ర అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన కథనం

ఉడిపిలోని ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. ఈ దేవాలయం విశేషం ఏమిటో తెలుసా? ఇక్కడ మీరు ఏ కోరికనైనా కోరుకొని అది నెరవేరితే బుట్ట నిండా అరటిపళ్లు అందజేస్తమని ఖచ్చితంగా చెప్పాల్సిందే. అప్పుడు మాత్రమే మీ కోరిక నెరవేరుతుంది. ఈ దేవాలయానికి సంబంధించిన మరికొన్ని వివరాలు మీ కోసం....

ఎక్కడ ఉంది ఈ దేవాలయం

ఎక్కడ ఉంది ఈ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం పేరు శ్రీ అనంత పద్మనాభ క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం ఉడిపి జిల్లాలోని పడూర్ అనే గ్రామంంలో ఉంది. ఈ పడూర్ ఉడిపి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా హబ్రి నుంచి 32 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఈ గ్రామానికి చేరుకోవచ్చు..

ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది

ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది

P.C: You Tube

ఓ పశుపాలకుడు గోవులను కాచే సమయంలో కపిల పేరుతో ఉన్న ఓ గోవు తప్పించుకు పోయింది. ఆ గోవును వెదుకుతూ వెళ్లిన గోపాలుడికి ఒక చోట గోవు కనిపించడమే కాక దాని పొదుగు నుంచి ధారగా పాలు రావడం కనిపించింది. దీంతో ఆ గోపాలుగు పేరుండు, పేరుండు అని అరవడం ప్రారంభించాడు. తుళు భాషలో పేరుండు అంటే పాలు అని అర్థం. అందువల్ల ఈ గ్రామానికి పేడూర్ అని పేరు వచ్చింది.

800 చరిత్ర

800 చరిత్ర

P.C: You Tube

ఈ దేవాలయం నిర్మించి దాదాపు 800 ఏళ్లు అయినట్లు చెబుతారు. ప్రతి రోజూ వేల మంది భక్తులు ఈ దేవాలయానికి సందర్శిస్తూ ఉంటారు.

రెండు అడుగుల విగ్రహం

రెండు అడుగుల విగ్రహం

P.C: You Tube

ఈ దేవాలయంలోని అనంత పద్మనాభ స్వామి విగ్రహం 2 అడుగుల ఎత్తు ఉంటుంది. శంఖ, చక్రాలతో అభయహస్తాలతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. నిలబడిన స్థితిలో ఈ విగ్రహం మనకు కనిపిస్తుంది.

పద్మతీర్థ

పద్మతీర్థ

P.C: You Tube

దేవస్థానంలో ఒక పుష్కరతీర్థం ఉంది. దీనిని పద్మతీర్థం అని అంటారు. ఈ పుష్కర తీర్థంలోని నీరు చాలా పవిత్రమైనదని అందరి నమ్మకం. అందువల్లే ఈ నీటిని తల పై వేసుకొన్న తర్వాతనే దేవుడిని సందర్శించడానికి వెలుతారు.

అరటిపళ్లు

అరటిపళ్లు

P.C: You Tube

ఈ దేవాలయంలో భక్తులు దేవుడికి అరటిపళ్లను కానుకగా అందిస్తారు. మొదట మన కోరికను దేవుడి ముందు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఆ కోరిక నెరవేరిన తర్వాత ఒక బుట్టడు అరటిపళ్లను కానుకగా దేవుడికి సమర్పిస్తారు.

జంటగా

జంటగా

P.C: You Tube
దంపతులు ఈ దేవాలయానికి జంటగా రావడం ఉత్తమమని చెబుతారు. తద్వారా వారి కుటుంబ సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయని నమ్ముతారు. అందువల్లే ఇక్కడకు ఎక్కువగా దంపతులు జంటగా వస్తుంటారు.

రుద్ర దేవస్థాన

రుద్ర దేవస్థాన

P.C: You Tube

ఈ దేవాలయంలో మరో దేవాలయం కూడా ఉంది. దీనిని రుద్ర దేవలయం అని అంటారు. ఈ దేవాలయం గర్భగుడిలో రుద్ర లింగం కలిగి ఉంది. ఇక్కడ గణపతి విగ్రహం కూడా ఉంది. గణపతిని పూజించిన తర్వాతనే మూలవిరాట్టును పూజిస్తారు.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

P.C: You Tube

ఉడిపికి చేరుకోవడానికి బెంగళూరు నుంచి చాలా బస్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి పడూరు చేరుకోవడానికి ట్యాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఉడిపిలో రైల్వేస్టేషన్ కూడా ఉంది.
ఉడిపిలో విమానాశ్రయం లేదు అందువల్ల మంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి ఉడిపికి వెళ్లాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X