Search
  • Follow NativePlanet
Share
» »కొడైకెనాల్లోని ఈ రాక్ పిల్లర్స్ అందాలు పర్యాటకుల మదిని దోచేస్తాయి...!

కొడైకెనాల్లోని ఈ రాక్ పిల్లర్స్ అందాలు పర్యాటకుల మదిని దోచేస్తాయి...!

తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ హిల్ స్టేషన్ పర్యాకులకు స్వర్గధామంగా ఉంది. ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ గా పేరుమోసిన కొడైకెనాల్ తమిళనాడులో ముఖ్య పర్యాటక కేంద్రాల్లో ఒకటని మనక అందరికీ తెలుసు. దిండుగల్ జిల్లాలో పర్వత శ్రేణులు, ప్రకృతి అందాల మధ్య అలరిస్తున్న ఈ విహార కేంద్రం మమ్మల్ని మైమరిచిపించింది. అక్కడి ఎత్తైన కొండలు, పచ్చని లోయలు, అక్కడక్కడా పారుతున్న జలపాతాలు, పార్కులు, పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, వినోధ కేంద్రాలు కొడైకెనాల్ అందాలు చూపరులను కట్టిపడేస్తాయి.

7200అడుగుల ఎత్తులో ఉండే కొడైకెనాల్ మండు వేసవిలోనూ చల్లదనాన్ని పంచుతుంది. కొడైకెనాల్ సందర్శించే వారు నాలుగైదు రోజులు విడిది చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. లేక్, కుక్కల్ కేవ్స్, టెలిస్కోప్ హౌస్, బెరిజం లేక్ పిల్లర్ రాక్స్ వంటి ప్రదేశాలు తప్పకుండా వీక్షించవల్సినవి. వీటిలో పిల్లర్స్ రాక్స్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం...

పిల్లర్ రాక్స్

పిల్లర్ రాక్స్

పిల్లర్ రాక్స్ కొడైకెనాల్ లో ప్రసిద్ది చెందిన అట్రాక్షన్ ప్లేస్ ఇది. కొడైకెనాల్ కు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వ్యూ నుండి సుందర ప్రకృతి కాంత సమస్త అందాలను చూడవచ్చు. ఇక్కడ సహజ సిద్దమైన మూడు పొడవైన శిలలు ఒకదానికొకటి ఆనుకుని 400 అడుగల ఎత్తులో ఉండే ఈ రాక్ పిల్లర్స్ అందాలు పర్యాటకుల మదిని దోచేస్తాయి. ఇక్కడి నుండి కొడైకెనాల్ అందాలు చూసి తీరాల్సిందే.

Photo Courtesy: Brunda Nagaraj

మబ్బులు మన పైనే తేలియాడుతున్నట్లు వుంటుంది

మబ్బులు మన పైనే తేలియాడుతున్నట్లు వుంటుంది

మబ్బులు మన పైనే తేలియాడుతున్నట్లు వుంటుంది ఇక్కడ.ఇవి 400 అడుగుల ఎత్తున స్తంభాలులా వుండే మూడు రాళ్ళు.ఇక్కడ డ్రై ఫ్లవర్స్ అమ్ముతారు.కులుకులొలుకు చెలి చెంతనుండగా ఊటి,కొడైకెనల్ ఏలనో అని పాట వుందిగాని కొడై వచ్చెది ఎక్కువమంది కొత్త జంటలే.

PC:Saishreyaswiki

దెయ్యాల కిచెన్

దెయ్యాల కిచెన్

రోడ్డు అంచులో ఉన్న ఒక బాట వెంట సుమారు 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుంచి కిందకు దిగుతూ వెళితే, చిన్న కొండ అడుగుభాగంలో గుహ కనిపిస్తుంది. కానీ దాని దగ్గరగా వెళ్ళి చూడటం కుదరలేదు. అక్కడకు వెళ్ళటానికి వీలు లేకుండా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. స్థానికులు దీనిని దయ్యాల గుహ అని వ్యవహరిస్తారు. అయితే విషసర్పాలు ఎక్కువగా ఈ గుహలో ఉంటాయని, అందువల్లే పర్యాటకులు లోపలికి వెళ్ళకుండా గుహ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసారు.

PC:Dhanil K

పిల్లర్స్ రాక్ స్తంభాలు

పిల్లర్స్ రాక్ స్తంభాలు

పిల్లర్స్ రాక్ స్తంభాలు రాళ్లు మూడు పెద్ద రాళ్ళకలిగిన స్తంభాలు. ఇవి 400 అడుగుల ఎత్తులో ఉన్నాయి, దట్టమైన వృక్ష మరియు మేఘ పర్వతాల మధ్య అద్భుతమైన ద్రుశ్యాలను చూడటం ఆనందాన్ని కలిగిస్తుంది. కొడైకెనాల్ లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి.

PC:Ahmed Mahin Fayaz

తమిళనాడు అరణ్య ప్రదేశంలో ఒక పిక్ నిక్ స్పాట్ గా

తమిళనాడు అరణ్య ప్రదేశంలో ఒక పిక్ నిక్ స్పాట్ గా

తమిళనాడు అరణ్య ప్రదేశంలో ఉన్న పిల్లర్స్ రాక్ మోయిర్ పాయింట్ రోడ్లో ఉంది. ఈ ప్రదేశంలో పచ్చని పచ్చిక మధ్య అక్కడక్కడ రంగు రంగుల పువ్వులు మెరుస్తూ ఉన్న ఒక చిన్న మరియు అందమైన తోట పరిపూర్ణ సౌందర్యానికి అందం ఒక మంచి మధుర జ్ఝాపకంగా నిలుస్తుంది. ఈ స్థంభాల ఆకారం షేడ్స్ చూడాటనికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇది ఒక పిక్ నిక్ స్పాట్ గా ఉంది. కాబట్టి, చుట్టు ప్రక్కల ప్రదేశాలలోని స్థానికులుతో పాటు పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దాంతో ఈ ప్రదేశం ఒక ప్రసిద్ద విహారయాత్రా స్థలంగా పేరుగాంచినది.

PC:Bhadani

ట్రెక్కింగ్ కు ఉత్తమ ప్రదేశం

ట్రెక్కింగ్ కు ఉత్తమ ప్రదేశం

శీతాకాలం మరియు వర్షాకాలంలో పిల్లర్స్ రాక్ స్తంభాలు దట్టమైన మేఘాలమధ్య దాగి ఉంటాయి .ఈ సమయంలో పర్యాటకులు ఈ స్థంబాలను ఎక్కడానికి కాస్త ఇబ్బందికి గురి అవుతారు. అలాగే మేఘాల మధ్య ఉన్న అందమైన స్పష్టమైన దృశ్యాన్ని చూడడానికి కాస్త ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. ఈ స్తంబాలను చేరుకోవడానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. అయితే ఈ మద్యకాలంలో ఆత్యహత్యల ప్రభావంవల్ల ఈ పిల్లర్స్ రాక్ ఎక్కడానికి నిషేదించడం జరిగింది.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

విమానంలో : కొడైకెనాల్‌కు 120కి.మీల దూరంలో మధురై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉంది. ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌, జెట్‌ఎయిర్‌వేస్‌ విమానాలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటాయి. విమానంలో ఇక్కడికి చేరుకుంటే ఇక్కడి నుంచి టాక్సీ, క్యాబ్‌లో కొడైకెనాల్‌కు సులువుగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గంలో : బెంగళూరుకు 460కి.మీ, తిరుచానూరుకు 198కి.మీ, చెన్నైకు 530కి.మీ, ఊటీకి 255కి.మీ, కోయంబత్తూరుకు 175కి.మీ దూరంలో కొడైకెనాల్‌ ఉంది. ఈ ప్రదేశాల నుంచి బస్సులో లేక కారులో రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

రైలులో : కొడైకెనాల్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌లో దిగి టాక్సీలో కొడైకెనాల్‌ చేరుకోవచ్చు. సుమారు 90 కి.మీల దూరం ఉంటుంది. టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

PC: Parthan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X