Search
  • Follow NativePlanet
Share
» »భువనేశ్వర్ పర్యాటక ప్రదేశాలు !

భువనేశ్వర్ పర్యాటక ప్రదేశాలు !

ఈ హాలిడే సీసన్ లో ఎక్కడకు వెళ్ళాలా ? అని ఆలోచిస్తున్నారా ? ఇప్పటికే బీచ్ ప్రదేశాలు అనేకం చూసారా ? అయితే, ఇపుడు భువనేశ్వర్ కు ఒక పర్యటన చేపట్టండి. ఓడిశా రాష్ట్రానికి రాజధాని ఐన భువనేశ్వర్ అక్కడ కల అందమైన దేవాలయాలు వాటి శిల్ప నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందినది.

గొప్ప చక్రవర్తి అయిన అశోకుడు తన భయంకరమైన కళింగ యుద్ధాన్ని ఇక్కడే చేశాడు. ఆ తరువాత యుద్ధ భీభత్సం కు పశ్చాత్తాపం చెంది బౌద్ధ మతాన్ని ఆశ్రయించాడు.

పర్యాటకులు ఈ ప్రదేశాలను పర్యటించి మరొక్కమారు చరిత్ర అంశాలను పునరుజ్జీవింప చేయవచ్చు. మరి భువనేశ్వర్ పర్యటనలో ఏమేమి చూడాలి అనేది పరిశీలించండి.

హోటల్ వసతులకు క్లిక్ చేయండి

భునేశ్వర్ ఎలా చేరాలి ?

భునేశ్వర్ ఎలా చేరాలి ?

భువనేశ్వర్ పట్టణానికి ఇండియా లోని అన్ని ప్రధాన నగరాల నుండి విమాన సర్వీస్ లు కలవు. రైలు మార్గంలో కూడా ఇది దేశంలోని వివిధ ప్రధాన రైలు స్టేషన్ లకు కలుపబడి వుంది. రోడ్డు మార్గంలో కూడా తేలికగా చేరవచ్చు. నేషనల్ హై వే నెం .5 మిమ్మల్ని అతి వేగంగా ఇక్కడకు తీసుకు వస్తుంది.
Photo Courtesy: vishwaant avk

లింగరాజ్ టెంపుల్

లింగరాజ్ టెంపుల్

లింగ రాజ్ టెంపుల్ పదవ శతాబ్దం నాటి ఒక హిందూ టెంపుల్. దీనిలో శివ భగవానుడి విగ్రహం వుంటుంది. లింగ రాజ్ టెంపుల్ ను కలల ను నిజం చేసే టెంపుల్ అని భావిస్తారు . ఈ టెంపుల్ పై కల శిల్ప సంపద, చెక్కడాలు, ఆశ్చర్యం గొలుపుతాయి. ఈ టెంపుల్ లోకి హిందువులకు మాత్రమే ప్రవేశం కలదు.

Photo Courtesy: G.-U. Tolkiehn

ఉదయ గిరి అండ్ ఖండగిరి గుహలు

ఉదయ గిరి అండ్ ఖండగిరి గుహలు

ఉదయగిరి మరియు ఖండగిరి అనే ఈ రెండు కొండలు ఒక అద్భుత జైన ఆరామం కలిగి వున్నాయి. ఇక్కడ కల గుహలు అనేక అందమైన చెక్కడాలు కలిగి వున్నాయి. రాణి గుంఫా లేదా క్వీన్స్ కేవ్ అనేది అతి పెద్ద అలంకరించబడిన గుహ. ఎలిఫెంట్ కేవ్ లేదా హాథీ గుంఫా అనే ఒక గుహ కూడా కలదు. దీనిలో ఖారవేల రాజు పాలన లోని అనేక అంశాలు ప్రదర్శిస్తారు.

Photo Courtesy: Steve Browne & John Verkleir

ధౌళి

ధౌళి

చరిత్ర లో ధౌళి ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత కలదు. ఈ ప్రదేశంలోనే అశోక చక్రవర్తికి యుద్ధం అంటే విరక్తి కలిగి జ్ఞానోదయం కలిగి బౌద్ధ మతాన్ని ఆశ్రయించాడు. శాంతికి చిహ్నం ఐన శాంతి స్తూప ఇక్కడే కలదు.

Photo Courtesy: Sankara Subramanian

ముక్తేశ్వర టెంపుల్

ముక్తేశ్వర టెంపుల్

పదవ శతాబ్దం నాటి ముఖ్తేస్వర టెంపుల్ కళింగ యుద్ధం ముందర, తర్వాత కల శిల్ప విభాగాలను తెలుపుతాయి. ఇక్కడ కల అద్భుత తోరణం లేదా, ప్రవేశ ద్వార తోరణం ఓడిశా లో బౌద్ధ మత ప్రభావ అవసేషంగా నిలిచి పోయింది. ఓడిశా శిల్ప కళా విభాగానికి టెంపుల్ ఒక ఉదాహరణ. ముక్తేస్వరుడు అంటే ముక్తిని ప్రసాదించే వాడు అని అర్ధం.

Photo Courtesy: Thamizhpparithi Maari

నందన్కానన్ జంతు ప్రదర్శనశాల

నందన్కానన్ జంతు ప్రదర్శనశాల

నందన్ కానన్ జంతు ప్రదర్శనశాలలో అనేక వన్య జంతువులు చూడవచ్చు. తెల్లటి పులి ఇక్కడి ప్రత్యేకత. జంతు ప్రదర్శన శాల లోపల కల ఒక సరస్సులో బోటు విహారం కూడా చేయవచ్చు. ఒక రోప్ వే కూడా కలదు. జూ సమీపంలో బొటానికల్ గార్డెన్స్ కలవు.

Photo Courtesy: Dreamodisha

షాపింగ్

షాపింగ్

భువనేశ్వర్ అక్కడకు వచ్చిన పర్యాటకులకు కొన్ని ప్రత్యేక షాపింగ్ వస్తువులు కూడా అందిస్తుంది. చేతి అల్లిక కల బట్టలు, జగన్నాథ్ దేవుడి కొయ్య విగ్రహాలు రోడ్ సైడ్ దుకాణాలలో విరివిగా లభ్యం అవుతాయి.
Photo Courtesy: RubyGoes

 ఆహారాలు

ఆహారాలు

భువనేశ్వర్ లో అనేక హోటళ్ళు కలవు వీటిలో మీకు వివిధ రకాల వంటకాలు రుచికరమైనవి లభిస్తాయి. స్థానిక ఆహారాలు తప్పక రుచి చూడాలి. స్థానిక హోటళ్ళ లో ఆహారం, ఆకులతో చేసిన ప్లేట్ లలో వడ్డిస్తారు. రుచులు కల ఈ ఆహారాలను పర్యాటకులు తినటమే కాదు. మరింత కావాలని కూడా కోరుతారు.
అధిక ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X