» »నామ్చి - హిమాలయాల ఒడిలో విహారం !

నామ్చి - హిమాలయాల ఒడిలో విహారం !

Written By:

అన్వేషించని ప్రదేశాలను చూస్తే ఎవరికైనా పట్టరాని ఆనందం కలుగుతుంది. హిమాలయాల పరివాహక ప్రాంతాల వద్ద ఈ సందడి అధికం. ఎందుకంటే హిమాలయ పర్వతాలలో ఇప్పటికీ పర్యాటకులు టచ్ చేయని ప్రదేశాలు అనేకం ఉన్నాయి.

హిమాలయ పర్వతాలు, దాని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలలో విహరించాలని ఎవరికి ఉండదు చెప్పండీ ..! అద్భుతమైన ప్రదేశాలు, మంచు కిరీటాన్ని ధరించిన పర్వతాలు, పూలపాన్పు వలె సుతిమెత్తని మైదానాలు, దివ్య నీటి ధారలు ఇలా ఎన్నో ఉండి, దాదాపు స్వర్గాన్నితలపిస్తాయి హిమాలయ పర్వతాలు.

ఇది కూడా చదవండి : సిక్కిం రాష్ట్ర సంక్షిప్త సందర్శన !

హిమాలయాలతో పాటు మంచుదుప్పటి కప్పిన పర్వతాలకు ప్రసిద్ధి సిక్కిం. సిక్కిం సంస్కృతి వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం నామ్చి. గాంగ్టక్ పట్టణం నుండి 92 కిలోమీటర్ల దూరంలో, సిలిగురి నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సుందరమైన ప్రదేశం మంచుతో కప్పబడిన పర్వతాలు, డార్జీలింగ్, కాలింపోంగ్ కొండల అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. భౌగోళిక స్థితి సముద్ర మట్టానికి పైన 1675 మీటర్ల ఎత్తున ఉన్న ఒక పట్టణం నామ్చి. ఈ ప్రాంతం సిక్కిం మత గురువు, ప్రపంచంలోనే ఎత్తైన పద్మసంభవ గురు విగ్రహం ఇటీవలే ప్రజాదరణ పొందింది. నామ్చి బౌద్ధ ఆరామాలకు, ఎత్తైన పర్వత శిఖరాలకు, పోలికలేని దృశ్య స్థలాలకు పేరుగాంచింది.

ఇది కూడా చదవండి : లచెన్ - ఒత్తిడిని తగ్గించుకోండి ... సేదతీరండి !

డాక్ బంగ్లా

డాక్ బంగ్లా

అరి బంగ్లా అని కూడా పిలువబడే డాక్ బంగ్లా ను సిక్కింలో బ్రిటిష్ కాలపు మొదటి రాజకీయ అధికారి సర్ జేమ్స్ క్లాడ్ వైట్ నిర్మించారు. బ్రిటిష్ నిర్మాణ శైలికి ఈ బంగ్లా సుప్రసిద్ధం.

చిత్ర కృప :Kulungshailesh

సంద్రుప్త్సే పర్వతం

సంద్రుప్త్సే పర్వతం

సిక్కిం లోని సంద్రుప్త్సే చాలా ఆసక్తిని కలిగించే పర్యాటక కేంద్రం. భూటియా భాషలో సంద్రుప్త్సే అంటే ‘కోరికలు తీర్చే కొండ' అని అర్ధం. ఈ ప్రదేశం సిక్కింలోని ప్రసిద్ధ యాత్రా స్థలం. సిక్కిం భూభాగాన్ని ఆశీర్వదించిన యోగి, గురు రింపోచే గా పిలువబడే గురు పద్మసంభవుడి పెద్ద విగ్రహం వల్ల ఈ కొండ ప్రాంతానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. ప్రపంచంలోనే 135 అడుగుల ఎత్తున్న పద్మసంభవుడి ఏకైక విగ్రహం ఇక్కడ వుంది.

చిత్ర కృప : Syamantaksen92

సోలోఫోక్ చార్ ధామ్

సోలోఫోక్ చార్ ధామ్

ఆసక్తి కరమైన చరిత్ర వున్న చార్ ధామ్ సిక్కిం లోని ప్రసిద్ద తీర్థ యాత్రా స్థలం. ఇక్కడి ప్రధాన దైవం మహాశివుడు. చార్ ధామ్ నామ్చి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సోలోఫోక్ పర్వతాల వద్ద వుంది. చార్ ధామ్ 7 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది. ఇక్కడ 16 అడుగుల ఎత్తున్న పరమశివుడి భారీ విగ్రహం వుంది.

చిత్ర కృప : Yasho99

సోలోఫోక్ చార్ ధామ్

సోలోఫోక్ చార్ ధామ్

రామేశ్వరం ప్రతీకగా నిర్మించిన శివాలయంలో శివలింగం వుండగా, చార్ ధామ్ సముదాయంలో విష్ణు భగవానుని విగ్రహాలున్న బద్రీ నాథ్, జగన్నాథ్, ద్వారక ల ప్రతిరూపాలు కూడా చార్ ధామ్ లో వున్నాయి.ఈ ఆలయ ప్రాంగణం 4 భాగాలుగా విభజించారు - 12 జ్యోతిర్లింగాలతో పాటు శివుడి విగ్రహం, నాలుగు ధామ్ లు, సాయి బాబా మందిరం, కిరాతేశ్వర విగ్రహం, నంది విగ్రహం కూడా వున్నాయి.

చిత్ర కృప : Ankit Darsi

టేమి టీ గార్డెన్

టేమి టీ గార్డెన్

ప్రపంచం లోని తేయాకు ప్రేమికుల్లో "టేమీ టీ" బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని సిక్కిం లోని టేమీ తేయాకు తోటల్లో పెంచుతారు, ఇక్కడి తేయాకు తోట ఇదొక్కటే. బహుశా ప్రపంచం లోని ఉత్తమ తేయాకు తోటల్లో ఒకటి ఇది.టేమీ తేయాకు తోటను 1969 లో సిక్కిం ప్రభుత్వం స్థాపించింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే అత్యుత్తమ టీ ని "టేమీ టీ" అంటారు, తరువాతి రకాలు వరుసగా సిక్కిం సోల్జా, మిస్టిక్, కాంచేన్ జంగా రకాలు.మీరు తేయాకు ప్రేమికులైతే, ఇక్కడికి తప్పకుండా వెళ్ళాలి.

చిత్ర కృప : Syamantaksen92

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్ నామ్చి, సంద్రుప్త్సే మధ్య ఉంది. ఇక్కడ అనేక మొక్కలు, పూలు, చెట్లు ఉన్నాయి. ఈ తోటలో అనేక వేచిఉండే గదులు, అందమైన దృశ్యాల ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ యాత్రా సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగిన పర్యాటకులకు కాఫీ, టీ అందించే రెస్టారెంట్ కూడా ఉంది.

చిత్ర కృప : Nishankur Chawale

హెలిపాడ్

హెలిపాడ్

ఈ హెలిపాడ్ సముద్రమట్టానికి షుమారు 5000 అడుగుల ఎత్తు వద్ద నామ్చి పట్టణం నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కంచన్జుంగా, దాని పరిసరాల అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. బెంగాల్ లోని పచ్చిక మైదానాలను కూడా ఇక్కడ నుండి చూడవచ్చు. ఈ దృశ్యకేంద్రం నుండి టేమి టీ తోటను కూడా చూడవచ్చు.

చిత్ర కృప : Stefan Krasowski

టెన్డొంగ్ హిల్

టెన్డొంగ్ హిల్

లామాలు ఏళ్లతరబడి ధ్యానం చేసిన ప్రదేశం టెన్డొంగ్ హిల్. సుమారు ఆరు కిలోమీటర్ల ట్రెక్కింగ్ మార్గంలో వివిధ జాతుల పుష్పాలు కానవస్తాయి. ఇది సముద్రమట్టానికి 8350 అడుగుల ఎత్తులో ఉంటుంది. టెన్ డొంగ్ హిల్ అంటే మొలిచిన కొమ్ము పర్వతం అని అర్థం.

చిత్ర కృప : Abhishek Paul

రవాణా వ్యవస్థ

రవాణా వ్యవస్థ

నామ్చి ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం : నామ్చి కి సమీపాన బాగ్డోగ్ర విమానాశ్రయం కలదు. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, కోల్కత్త, పాట్న తదితర ప్రాంతాల నుండి విమానాలు వస్తుంటాయి.
రైలు మార్గం : న్యూ జల్పైగురి నామ్చి కి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ (100 km).
రోడ్డు మార్గం : గాంగ్టక్, డార్జీలింగ్, న్యూ జల్పైగురి ప్రాంతాల నుండి నామ్చి కి పలు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Appra Singh

Please Wait while comments are loading...