Search
  • Follow NativePlanet
Share
» »గోవా లో బీచ్ ప్రాంతాలను చూసి విసుగెత్తిపోయారా ?

గోవా లో బీచ్ ప్రాంతాలను చూసి విసుగెత్తిపోయారా ?

By Mohammad

గోవా లో బీచ్ ప్రాంతాలను చూసి విసుగెత్తిపోయిన వారికి మహారాష్ట్ర - గోవాల సరిహద్దులో కల పేర్నెమ్ సందర్శన హాయినిస్తుంది. ఛపోరా మరియు టిరకోల్ నదులు అద్బుత దృశ్యాల నందిస్తాయి. ఈ ప్రాంతంలో స్ధానికుల జీవన విధానాలు తెలుసుకుంటూ ముచ్చటించవచ్చు లేదా వారి చేపల వేటలో పాల్గొనవచ్చు. అనేక సంవత్సరాల క్రిందట గోవా ఎలా ఉండేది అనే దానికి పేర్నెమ్ ఉదాహరణగా నిలుస్తుంది. ముంబై, పూనే ల నుండి గోవా వెళ్ళే వారికి పేర్నెం కొద్దిసేపు గడపటానికి కూడా బాగుంటుంది.

చేపల వేటలో స్థానికుడు

చేపల వేటలో స్థానికుడు

చిత్రకృప : Joel's Goa Pics

పేర్నెం లో చూడవలసినవి రెండే ప్రదేశాలు. అవి ఒకటి శ్రీ భగవతి దేవాలయం కాగా రెండవది దేశ్ ప్రభు హౌస్ అనబడే ఒక పెద్ద విల్లా. సాధారణంగా పాశ్చాత్యులు ఈ నిర్మాణాలకు బాగా ఆకర్షితులవుతారు. భగవతి దేవాలయంలో కల ఏనుగుల కట్టడాలు ఆకర్షణీయంగా ఉంటాయి.

భగవతి దేవాలయం

భగవతి దేవాలయం

ఉత్తరం నుండి గోవా కు ప్రయాణించేవారికి పేర్నెం చూడటం తేలిక. రాష్ట్రంలోకి ప్రవేశిస్తే చాలు మీరు చూసే మొదటి ప్రదేశం అదే. పానాజిమ్ నుండి ఇది 32 కి.మీ.ల దూరం మాత్రమే కనుక క్యాబ్ లో ప్రయాణించవచ్చు. అయితే, ఛార్జీల విషయంలో జాగ్రత్త. అధిక ఛార్జీలకు మోసపోకండి. ప్రత్యామ్నాయంగా, వాతావరణం అనుకూలిస్తే ఒక బైక్ అద్దెకు తీసుకొని కూడా ప్రయాణించవచ్చు.

పురాతన గోవా - ఆకర్షణీయ ప్రదేశాలు !పురాతన గోవా - ఆకర్షణీయ ప్రదేశాలు !

టిరాకోల్ కోట

టిరాకోల్ కోట

చిత్రకృప : Goaholidayhomes

టిరాకోల్ కోట

టిరాకోల్ కోట చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న ప్రదేశం. ఇది గోవా- మహారాష్ట్ర సరిహద్దు భూభాగంలో ఉంటుంది. మహారాష్ట్ర కు చివరిది, గోవా కు మొదటిది ఈ ప్రాంతం.

గోవా లో ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల అభయారణ్యాలు !గోవా లో ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల అభయారణ్యాలు !

గోవాలో ఏదైనా తెలియని ప్రదేశం ఉందంటే అది టిరాకోల్. ఈ ప్రాంతం ఎంతో సహజంగా ఉంటుంది. చాలా మంది ఫారెనర్స్ టిరాకోల్ ను ఒక పిక్నిక్ స్పాట్ గా ఎంచుకొని ఓక రోజంతా అక్కడే ఉండటానికి ఇష్టపడతారు. ఇక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయనటంలో సందేహం లేదు.

ఫ్రీడమ్ ఫైటర్స్ స్మారకం

ఫ్రీడమ్ ఫైటర్స్ స్మారకం

చిత్రకృప : Mvkulkarni23

టిరాకోల్ కోట ఎలా చేరుకోవాలి ?

పనాజిం, వాస్కో లేదా గోవాలోని ఇతర భాగాలలో బసచేసే పర్యాటకులకు కొద్దిగా దూరంగా ఉంటుంది కనుక వారు టాక్సీ అద్దెకు తీసుకుని రావలసినదే. అయితే, కండోలిం, బాగా మరియు కాలన్ గూటే బేగేటర్ మరియు బర్డేజ్ లలో వసతి పొందిన పర్యాటకులు మాపూసా మార్గంలో చిన్నపాటి డ్రైవింగ్ లో చేరుకోవచ్చు. ఈ ప్రదేశాలలో ఉన్నవారు బైక్ అద్దెకు తీసుకుని అయినా ఒక రోజులో పర్యటించేయవచ్చు. అయితే రోడ్లు అనేక వంపులుగాను, కొండ ప్రాంతంగాను ఉంటుంది కనుక మీరు డ్రైవింగ్ లో అతి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.

అందమైన ప్రకృతి దృశ్యాలు, బీచ్

అందమైన ప్రకృతి దృశ్యాలు, బీచ్

చిత్రకృప : Nichalp

పెర్నమ్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : దక్షిణ గోవాలోని డబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపాన కలదు. ఇక్కడి నుండి 54 కి. మీ ల దూరంలో ఉన్న పెర్నమ్ వరకు క్యాబ్ లేదా టాక్సీ లలో చేరుకోవచ్చు.

రైలు మార్గం : పెర్నమ్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇది కొంకణ్ రైలు మార్గంలో కలదు. ముంబై - గోవా మధ్య నడిచే రైళ్లని ఇక్కడ ఆగుతాయి.

రోడ్డు మార్గం : పనాజీ, ముంబై, కొల్లాపూర్, మరియు గోవా లోని వివిధ బీచ్ ప్రాంతాల నుండి పెర్నమ్ వరకు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X