Search
  • Follow NativePlanet
Share
» »సతారాలో ఈ అద్భుత ప్రదేశాలను చూసారా ?

సతారాలో ఈ అద్భుత ప్రదేశాలను చూసారా ?

మహారాష్ట్ర లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం 'సతారా'. ఈ జిల్లా ఏడు వైపులా కొండలతో చుట్టుకుని వుండడం వల్ల దీన్ని సతారా అంటారు. సతారా జిల్లాలో ఆశ్చర్య పరిచే గుళ్ళు, కోటలూ వున్నాయి.

By Mohammad

మహారాష్ట్ర లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం 'సతారా'. దీనికి పడమటి వైపున రత్నగిరి, తూర్పున సోలాపూర్, దక్షిణాన సాంగ్లి వున్నాయి. ఈ జిల్లా ఏడు వైపులా కొండలతో చుట్టుకుని వుండడం వల్ల దీన్ని సతారా అంటారు. అంటే సుమారుగా ఏడు కొండలు అని అర్ధం. జరందేశ్వర్, యవతేశ్వర్, అజింక్యతర, కిట్లిచా దొంగార్, సజ్జనగడ, పెధ్యాచా భైరోబా, నడ్కిచా దొంగార్ ఆ ఏడు కొండల పేర్లు.

ఇది కూడా చదవండి : సాజన్ - మాన్సూన్ ట్రెక్కింగ్ స్థావరం !

మీరిక్కడ వున్నప్పుడు మర్చిపోకూడనివి ఏమిటి?

సతారా జిల్లాలో ఆశ్చర్య పరిచే గుళ్ళు, కోటలూ వున్నాయి. భోజ రాజు నిర్మించిన అజింక్యతార కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ. 3000 అడుగుల ఎత్తున్న ఈ కోట దండెత్తి వచ్చే శత్రువుల నుంచి రక్షణ కల్పించేది. ఈ కొండ పై నుంచి సతారా నగరం మొత్తాన్ని చక్కగా చూడవచ్చు. ఈ కోట లో మంగళా దేవి అద్భుతమైన గుడి చూడవచ్చు. సతారా జిల్లాలో చూడవలసిన మరికొన్ని ఆకర్షణలు ఒకసారి గమనిస్తే ..

అజింక్యతారా ఫోర్ట్

అజింక్యతారా ఫోర్ట్

అజింక్యతారా కొండ పైన నిర్మించిన అజింక్యతారా కోట సముద్ర మట్టానికి 1006 మీటర్ల ఎత్తున వుంది. ఈ కోటను సప్తర్షి కోట అని కూడా పిలుస్తారు.ఈ కోటను శిలార్ వంశానికి చెందిన భోజ రాజు నిర్మించాడు. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వున్న యతేశ్వర్ కొండను చూడవచ్చు. కొండ పైనుంచి కనపడే దృశ్యం చాలా మనోహరంగా వుండి, సతారా నగరాన్ని మొత్తాన్ని చూపిస్తుంది.

కాస్ తలావ్

కాస్ తలావ్

సతారా జిల్లా నుంచి 22 కిలోమీటర్ల దూరంలో వున్న కాస్ మైదానం, సరస్సు అన్ని రకాల యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. పూల మైదానంగా కూడా పిలువబడే ఈ ప్రాంతం ప్రఖ్యాత విహార కేంద్రం. ఇది 3500 అడుగుల ఎత్తులో కలదు. ఇక్కడ 400 కన్నా ఎక్కువ రకాలా ఫల పుష్ప జాతులు వున్నాయి.

చిత్ర కృప : Parabsachin

సజ్జనగడ కోట

సజ్జనగడ కోట

సజ్జనగడ కోట సతారా నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో వుంది. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట ప్రాంతంలోనే సమర్ధ రామదాస స్వామి సమాధి చెందారు. ఆయన శివాజీ మహారాజుకు గురువు. 312 మీటర్ల ఎత్తున, 1525 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వుంది ఈ కోట.

చిత్ర కృప : Himanshu Sarpotdar

తోసేఘర్ జలపాతం

తోసేఘర్ జలపాతం

తోసే ఘర్ జలపాతం ప్రఖ్యాత యాత్రికుల విహార కేంద్రం. సతారా నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రాంతం వర్షాకాలం లో అందమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ఇక్కడి జలపాతం చాలా రమణీయంగా వుంటుంది. ఈ ప్రదేశంలో వుండే చల్లని వాతావరణం కోసం, నీటి జల్లుల కోసం యాత్రికులు ఇక్కడికి విరివిగా వస్తారు.

చిత్ర కృప : Hasnain Ali

మాయని పక్షుల అభయారణ్యం

మాయని పక్షుల అభయారణ్యం

ప్రకృతి ప్రేమికులేవరికైనా మాయని పక్షుల కేంద్రం చాలా ఆనందం కలిగిస్తుంది. ఇది సతారా నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వుంది. భారత దేశంలోని ప్రముఖ పక్షుల కేంద్రమైన ఈ ప్రాంతం చాలా వలస పక్షులకు ప్రతి ఏటా నిలయంగా మారుతోంది. బ్రాహ్మిణి బాతులు, నల్ల ఇబిస్, ఫ్లేమింగోలు, రంగుల కొంగలు ఇక్కడ కనపడే పక్షులలో కొన్ని.

చిత్ర కృప : amrishwadekar

కొయినా డ్యామ్

కొయినా డ్యామ్

సాంగ్లి జిల్లాలోని కొయినా డ్యాం మహరాష్త్రలోని పెద్ద డ్యాం లలో ఒకటి. కొయినా నది మీద ఈ ఆనకట్ట ను నిర్మించారు. ఈ డ్యాం మీ కుటుంబంతో సాయంకాలం గడపడానికి చాలా బాగుంటుంది. దగ్గరలోని నెహ్రూ గార్డెన్ చక్కని విహార కేంద్రం.

చిత్ర కృప : Kundansonuj

జయగడ్ కోటలు

జయగడ్ కోటలు

శివసాగర్ సరస్సు దగ్గర కొయినా అభయారణ్యం లోని హరిత వనాల లోపల నెలకొని వుంది వసోతా కోట. దీన్ని శిలాహర రాజు రెండో భోజరాజు నిర్మించగా తర్వాత శివాజీ మహారాజు చేతికి వచ్చింది. సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తున వున్న ఈ కోటకు నాలుగింట మూడు వైపులా నీరు వుంటుంది.

చిత్ర కృప : rohit gowaikar

సతారా ఎలా చేరుకోవాలి ?

సతారా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : సతారా కు సమీపాన 107 కి. మీ ల దూరంలో పూణే దేశీయ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : సతారా లో రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

బస్సు/ రోడ్డు మార్గం : పూణే, షిర్డీ, ఔరంగాబాద్, ముంబై తదితర ప్రాంతాల నుండి సతారా కు బస్సులు వస్తుంటాయి.

చిత్ర కృప : Apoorva Karlekar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X