Search
  • Follow NativePlanet
Share
» »విజయదుర్గ్ - మంత్రముగ్ధుల్ని చేసే ఒక చిన్న పట్టణం !

విజయదుర్గ్ - మంత్రముగ్ధుల్ని చేసే ఒక చిన్న పట్టణం !

By Mohammad

విజయదుర్గ్ .. మహారాష్ట్ర తీరం వెంబడి ఉండే ఒక చిన్న పట్టణం. ముంబై మహా నగరం నుండి 485 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పట్టణం సింధుదుర్గ్ జిల్లాలో కలదు. ఒక వైపు అరేబియా సముద్రం, మరో వైపు సహ్యాద్రి పర్వతాలు, పశ్చిమ కనుమలకు మధ్యలో ఉండే ఈ పట్టణం ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిందే ..!

విజయదుర్గ్ ని పూర్వం గేరియా అని పిలిచేవారు. క్రీ.శ. 17 వ శతాబ్ధంలో మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ ఇష్టపడి కట్టించుకొన్న విజయదుర్గ్ కోట ఇక్కడ ప్రసిద్ధి చెందినది. దీన్నే 'ఫోర్ట్ విక్టర్' అని పిలుస్తారు. కోటకి నాలుగు దిక్కుల్లో మూడు దిక్కులూ అరేబియా సముద్రంతో కప్పబడి ఉంటుంది కనుక దీనిని ఘేరియా అని పిలుస్తారు.

'శివాజీ' విక్టరీల కోట !

విజయదుర్గ్ కోట

చిత్ర కృప : Rajesh Deshpande

సుమారు 17 ఎకరాల్లో నిర్మించిన విజయదుర్గ్ కోట చుట్టూ మూడు అంచెలుగా గోడలు కట్టారు. సమీపంలోనే భవనాలు కూడా కట్టడంతో కోట దుర్భేధ్యంగా మారిపోయింది.

విజయదుర్గ్ లో చూడవలసిన స్థలాలలో జీబ్రాల్టర్ ఒకటి. మరాఠా సైన్యం యుద్ధ నౌకలను ఉంచటానికి ఈ ప్రాంతాన్ని వాడేవారు. అలాగే కోటకు అనుబంధంగా ఉన్న ఖర్పెతాన్ వాగు కూడా చూడవలసినదే. ఇది ఉండటం వల్ల శత్రువులు లోనికి కూడా ప్రవేశించలేరు. అరేబియా సముద్రంలో నిఘా కోసం కట్టిన వేదిక చూడవలసిన మరో అద్భుతం.

'శివాజీ' విక్టరీల కోట !

విజయదుర్గ్ నౌకాశ్రయం

చిత్ర కృప : Rajesh Deshpande

మారుతి, మహాపురుష్, మహాదేవ్ వంటి దేవుళ్ళ విగ్రహాలతో కూడిన ఆలయాలు కోట పరిసరాల్లో చూడవచ్చు. పురాతన, శిధిలమైన రామేశ్వరాలయం కూడా దర్శించవచ్చు. కోట సమీపంలోని బీచ్ కూడా సందర్శించదగినదే.

విజయదుర్గ్ లో చేయవలసినవి

విజయదుర్గ్ లో స్థానిక రుచులు చూడకుండా ఊరుకోలేరు. ఇక్కడ రుచి చూడవలసిన వాటిలో మాల్వణీ కూర ముందుంటుంది. ఇక్కడ దొరికే సోల్ ఖడీ, చేపల వంటకాల రుచులు ఆస్వాదించక ఉండలేరు. రసాలూరే మామిడి పండ్లు, పనస పండ్లు తినటం మర్చిపోకండి.

'శివాజీ' విక్టరీల కోట !

విజయదుర్గ్ రుచులు

చిత్ర కృప : Ankur P

విజయదుర్గ్ ఎలా చేరుకోవాలి ?

విజయదుర్గ్ చేరుకోవటానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

విజయదుర్గ్ పట్టణానికి సమీపాన ఉన్న విమానాశ్రయం పనాజి విమానాశ్రయం. ఇది 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి నుండి ట్యాక్సీ లేదా క్యాబ్ వంటి వాహనాలను ఆద్దెకు తీసుకొని విజయదుర్గ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

విజయదుర్గ్ సమీపాన రెండు రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. అవి కుడాల్, రాజాపూర్. ఈ రెండు రైల్వే స్టేషన్ లు దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో, ముంబై వంటి సమీప నగరాలతో చకక్‌గా అనుసంధానించబడింది. ప్రభుత్వ బస్సుల్లో / ట్యాక్సీ లలో ప్రయాణించి విజయదుర్గ్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

ముంబై, రాజాపూర్ వంటి ప్రధాన నగరాల నుండి విజయదుర్గ్ కు చాలా బస్సులు ఉన్నాయి. ఏసీ, నాన్ - ఏసీ, లగ్జరీ, సూపర్ లగ్జరీ ఇలా అన్ని తరగతులకు చెందిన బస్సులు విజయదుర్గ్ కు తిరుగుతుంటాయి.

'శివాజీ' విక్టరీల కోట !

విజయదుర్గ్ ఎలా చేరుకోవాలి ?

చిత్ర కృప : yogesh ratnagiri

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X