» »మంగన్ - విభిన్న పర్యాటక అనుభవం !

మంగన్ - విభిన్న పర్యాటక అనుభవం !

Written By:

రెండు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతమది. ఒక వైపు వెళితే నేపాల్, మరో వైపు వెళితే భూటాన్, ఇంకాస్త ముందుకు వెళితే టిబెట్ (స్వయం ప్రతిపత్తి) దేశాలు స్వాగతం పలుకుతాయి. అర్థమయ్యింది అనుకుంటా ఎ ప్రాంతం గురించి చెబుతున్నానో ...!

సిక్కిం ... పర్వత రాష్ట్రం. ఇక్కడ అన్వేషించవలసిన ప్రదేశాలు అనేకం. ఈ అద్భుతమైన రాష్ట్రం జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన సుందర ప్రదేశాల మంచు కిరీటం. ఏటా దేశంలో మంచు కురిసే అతి కొద్ది రాష్ట్రాలలో ఇది కూడా ఒకటి.

ఇది కూడా చదవండి : సిక్కిం రాష్ట్ర సంక్షిప్త సందర్శన !

మంగన్ సిక్కిం లో ఒక పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి 3136 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పట్టణం గ్యాంగ్టక్ నుండి 67 కి. మీ దూరంలో ఉండి ఆసక్తికరమైన ప్రదేశాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇక్కడి ప్రదేశాలను ఒకసారి గమనిస్తే ...

లబ్రంగ్ మొనాస్టరీ

లబ్రంగ్ మొనాస్టరీ

లబ్రంగ్ మొనాస్టరీ అంటే 'లామా యొక్క నివాస స్థలం' అని అర్థం. ఇదొక ఆశ్రమం. ఈ ఆశ్రమంను టిబెట్ లో కొంగ్పు యొక్క లత్సున్ చెంబో గౌరవార్ధం నిర్మించారు. ఉత్తర సిక్కిం రహదారిపై ఫోడోంగ్ నుండి 2 కి. మీ దూరంలో లబ్రంగ్ మొనాస్టరీ ఉన్నది.

చిత్ర కృప : Pranav Bhasin

లబ్రంగ్ మొనాస్టరీ

లబ్రంగ్ మొనాస్టరీ

ఏమి చూడవచ్చు ?

ఆశ్రమం యొక్క ప్రార్థనా మందిరం వద్ద ప్రదర్శించిన కుడ్యచిత్రాలు ప్రసిద్ధ పద్మశాంభవ్ 1022 సార్లు పునరావృతం కాని భంగిమలో ఉన్నాయి. మేడ మీద తల లేకుండా నెక్లెస్ ధరించిన ఒక విగ్రహం ఉంది.

చిత్ర కృప : retlaw snellac

నమ్ప్రిక్దంగ్

నమ్ప్రిక్దంగ్

నమ్ప్రిక్దంగ్ కనక మరియు తీస్తా అనే రెండు నదుల సంగమం వద్ద ఉంది. ఇక్కడ ఉన్న వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క అందానికి మంత్రముగ్దులవుతారు. ఇది పర్యాటకులకు సూచించదగినది.

చిత్ర కృప : sanlap biswas

రాంగ్ లున్గ్తెన్ లీ

రాంగ్ లున్గ్తెన్ లీ

నమ్ప్రిక్దంగ్ వద్ద, సంప్రదాయ హౌస్ ను పోలి ఉండే 'రాంగ్ లున్గ్తెన్ లీ' ఉన్నది. ఇది మంగన్ పట్టణం నుండి 8 కి.మీ దూరంలో ఉంది. లెప్చా ప్రజల యొక్క కళాఖండాల అరుదైన సేకరణలు ఈ ఇంట్లో ప్రదర్శించబడతాయి. పర్యాటకుల సందర్శనార్థం సంవత్సరం లో ప్రతి రోజూ తెరిచే ఉంచుతారు.

చిత్ర కృప : anbans

సిరిజోన్గా యుమ మంగ్హీం

సిరిజోన్గా యుమ మంగ్హీం

సిరిజోన్గా యుమ మంగ్హీం వాస్తురీత్యా వెస్ట్ బెంగాల్ లో మార్టం యొక్క సిరిజోన్గా యుమ మంగ్హీం ను పోలి నిర్మింపబడింది. దీనిని 1983 లో నిర్మించారు. ఈ ప్రదేశము జనవరి నెలలో జరుపుకునే మఘేయ్ సంక్రాంతి పండుగ సమయంలో పర్యాటకులు మరియు భక్తులతో నిండిపోయి ఉంటుంది.

చిత్ర కృప : Weekend Destinations

సిన్ఘిక్

సిన్ఘిక్

సిన్ఘిక్ అనే గ్రామం మంగన్ పట్టణం నుండి 12 కి.మీ. దూరంలో కలదు. ఇది 5200 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుంచి కంచనగంగా పర్వతాన్ని మరియు మౌంట్ సినిఒల్చు యొక్క అద్భుతమైన వీక్షణలను చూస్తూ ఆస్వాదించవచ్చు.

చిత్ర కృప : Maria Helga Gudmundsdotti

సిన్ఘిక్

సిన్ఘిక్

సిన్ఘిక్ చుట్టుముట్టి ఉన్న ఆకుపచ్చ ప్రకృతి మరియు క్రింద ప్రవహించే నిర్మలమైన తీస్తా నది, బిజీగా ఉండే తమ జీవితాల నుండి ఒంటరితనం కోరుకునే వారికి ఒక స్వర్గం అని చెప్పవచ్చు. మీరు కాసేపు ఈ ప్రాంత సౌందర్యాన్ని ఆనందించే ఆసక్తి ఉంటే ఒక రాత్రి ఉండటానికి సౌకర్యాలు అందిస్తుంది.

చిత్ర కృప : Samar Kamat

మంగన్ లో ఏమి చేయవచ్చు ?

మంగన్ లో ఏమి చేయవచ్చు ?

మంగన్ ప్రదేశంలో అనేక సాహస క్రీడలను చేయవచ్చు. పర్వత ప్రవాహాలు, ఫారెస్ట్ హిల్స్ మరియు ప్రసిద్ధి చెందిన కాలిబాటలు ఉన్నాయి.

చిత్ర కృప : Phil Calvin

పండుగలు, సంస్కృతి

పండుగలు, సంస్కృతి

'మఘేయ్ సంక్రాంతి' సిక్కిం లో ఒక వెచ్చని వాతావరణం ప్రారంభమవడానికి సూచనగా పరిగణిస్తున్నారు. ఇది ఒక పండుగ. ఈ పండుగ రోజు వివిధ మేళాలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 3 రోజులపాటు నిర్వహించే సంగీత ఉత్సవాలకు కూడా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : zofia baranska

షాపింగ్, ఆహారం

షాపింగ్, ఆహారం

షాపింగ్ విషయానికి వస్తే, స్థానిక కళాకారులు చేతి తో అల్లిన వస్తువులు విక్రయానికి ఉంచుతారు. సంగీత పరికరాలను, సంప్రదాయ దుస్తులను కొనుగోలు చేయవచ్చు. పిల్లలకు ఆటవస్తువులు కూడా లభ్యమవుతాయి. ఇక్కడి వంటకాలలో ప్రసిద్ధి చెందింది మోమోస్. వెజ్, నాన్ - వెజ్ లలో ఇవి దొరుకుతాయి.

చిత్ర కృప : wribs

మంగన్ ఎలా చేరుకోవాలి ?

మంగన్ ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - అగ్దోగ్ర విమానాశ్రయం(124 కి.మీ)

సమీప రైల్వే స్టేషన్ - న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ (179 కి.మీ)

రోడ్డు మార్గం / బస్సు మార్గం - వివిధ రకాల ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు ప్రతి రోజూ గ్యాంగ్టక్ నుండి అందుబాటులో ఉంటాయి. క్యాబ్, టాక్సీ లలో కూడా ప్రయాణించి మంగన్ కు చేరుకోవచ్చు.

చిత్ర కృప : Pallab Singha

Please Wait while comments are loading...