Search
  • Follow NativePlanet
Share
» »అమరావతి ... ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని !!

అమరావతి ... ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని !!

దక్షిణ భారత దేశంలోని గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున కల ఒక చిన్న పట్టణం అమరావతి. ఇక్కడ కల అమరేశ్వర టెంపుల్ కారణంగా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ప్రాచీన శాసనాల ప్రకారం దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు.

బౌద్ధ మతం పట్ల ఆసక్తి కలవారు ఇక్కడ కల అనేక బౌద్ధ ఆరామాలు, శిల్పాలను చూడవచ్చు. ప్రస్తుతం ఈ నిర్మాణాలు శిధిలమై ఉన్నప్పటికీ, అంతటి బృహత్తర నిర్మాణాల పట్ల ఆశ్చర్యపడక మానరు. బుద్ధుడి జీవన విశేషాలు గురించిన చెక్కడాలు సాధారణం. మరి కొన్ని నిర్మాణాలు బౌద్ధ మత ప్రచారంలో ప్రధాన పాత్ర వహించిన పాలకులవి కూడా కలవు. నానాటికి శిదిలమైపోతున్న ఈ బౌద్ధ మత అవశేషాలు ఇంకనూ ప్రకృతి నియంత్రణలో వుండటం మన దేశ అదృష్టం.

ఒక్క మాటలో స్థల చరిత్ర

ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది. గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతిలోనే బోధించాడు. అందువలన అమరావతి బుద్ధునికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ ఔతున్నది. నేడు ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.

అమరావతి స్తూపం

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కల అమరావతిలో అమరావతి స్తూపం లేదా మహా చైత్య ఒక గొప్ప ఆకర్షణ. ఈ స్తూపాలు అశోక చక్రవర్తి కాలంలో నిర్మించబడ్డాయి.ఈ స్తూపం , దానిపై చెక్కడాలు బుద్ధుడి జీవిత కధను మరియు అతని బోధనలను తెలియ చేస్తుంది. పర్యాటకులు ఇక్కడికి వచ్చి బుద్ధుని స్థూపాలను దర్శించి ఆయన మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తుంటారు. ఇక్కడికి చాలా మంది బౌద్ధ భిక్షులు ప్రతి సంవత్సరం వస్తుంటారు.

అమరావతి ... ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని !!

బౌద్ధ స్తూపం

Photo Courtesy: Nandign

కృష్ణా నది

కృష్ణా నది ఎంతో ఆహ్లాదకరమైన నదీ తీరం. ఇక్కడికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇది అక్కడ ఉన్న ప్రజలకే కాక పర్యాటకులకు కూడా సేదతీరే ప్రదేశం. ఇక్కడ కృష్ణా నదీ తీరంలో హిందువులు చాలా వరకు వచ్చి ప్రత్యేక స్నానాలు ఆచరిస్తుంటారు. ఇది ఎంతో విలువైన ఆస్తిగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఎంత కాలం గడిచినప్పటికీ ఈ నది విలువలని తగ్గించలేము ఎందుకంటే ఇది ఒక జీవ నది.

అమరావతి ... ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని !!

కృష్ణా నది ఒడ్డున స్నానం ఆచరిస్తున్న భక్తులు

Photo Courtesy: Rammohan65

ఆర్కియోలాజికాల్ మ్యూజియం

అమరావతిలో కృష్ణా నదికి కుడి వైపున ఆర్కియోలాజికాల్ మ్యూజియం కలదు. అమరావతి చరిత్ర, దాని సంస్కృతి, ఆనాటి ప్రాంత సాంప్రదాయాలు వంటివి తెలియ జేసే వస్తువులు ఈ మ్యూజియం లో కలవు. అమరావతిలో పుట్టిన కళలకు , మరియు భారతీయ కళలకు చారిత్రక ఆధారాలు ఇస్తోంది. సుమారు 3వ శతాబ్దం లో విలసిల్లిన బౌద్ధ మత శిల్పాలు సైతం ఈ మ్యూజియం లో కలవు. ఇది అమరావతిలో తప్పక చూడవలసిన ప్రదేశంగా ప్రసిద్ది చెందింది. అమరావతి పట్టణ చరిత్ర ఆది నుండీ తెలుస్తోంది. అనేక చరిత్ర పుస్తకాలు చది వేకంటే , ఒక్కసారి మ్యూజియం సందర్శిస్తే చాలు, ఎంతో చరిత్ర తెలిసిపోతుంది.

అమరావతి ... ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని !!

మ్యూజియం లోపలి భాగం

Photo Courtesy: guntur.nic

అమరావతి చేరుకోవడం ఎలా??

ఈ పట్టణానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలనుంచి చేరుకోవచ్చు.

వాయు మార్గం

అమరావతికి సమీపంలో ఉన్న విమానాశ్రయం విజయవాడలో గల గన్నవరం విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుంచి బస్సు ద్వారా అమరావతికి రావాలంటే సుమారుగా గంట సమయం పడుతుంది.

రైలు మార్గం

అమరావతికి రైలు మార్గం ద్వారా రావాలంటే గుంటూరు దగ్గర గాని లేకుంటే విజయవాడ దగ్గర గాని దిగి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం సాగించవచ్చు. ఈ రెండు రైల్వే స్టేషన్ లు జంక్షన్ లుగా కలిగి ఉన్నాయి. కనుక రైలు మార్గం ద్వారా సులభంగా ప్రయాణించవచ్చు. దేశం నలుమూలల నుంచి ఈ ప్రాంతాలకు రైళ్లు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటాయి కనుక ఇవి చాలా రద్దీగా ఉంటాయి.

రోడ్డు మార్గం

ఈ పట్టణానికి రోడ్డు, విజయవాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి చేరుకోవడానికి విజయవాడ నుండి నేరుగా బస్సులున్నాయి. గుంటూరు నుండి 32 కిలోమీటర్ల దూరం ఉన్న అమరావతి చేరుకోవడానికి గుంటూరు నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బస్సు లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అమరావతికి నడుస్తాయి.

అమరావతి ... ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని !!

కృష్ణా నదిలో విహరిస్తున్న పడవ

Photo Courtesy: Kalyan Kanuri

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X