• Follow NativePlanet
Share
» »టాలీవూడ్ షూటింగ్ ల ప్రదేశం !

టాలీవూడ్ షూటింగ్ ల ప్రదేశం !

కన్నూర్ లో సందర్శించవలసిన వాటిలో ముఖ్యమైనది కన్నూర్ కోట. ఇది నగరం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి, పర్యాటకులను కనువిందు చేస్తున్నది. ఈ ఫోర్ట్ కి అతి చేరువలో అరేబియా సముద్రం ఉండటంతో పరిసరాలన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. సుందరేశ్వర ఆలయం, రాఘవాపురం ఆలయం, సుబ్రమణ్య ఆలయం లు ఇక్కడ బాగా ప్రాచూర్యం పొందిన ఆలయాలు. వీటితో పాటు ఇక్కడ బీచ్ లు కూడా సందర్శించదగినవే .. !

కన్నూర్ .. కేరళ రాష్ట్రంలో ఉత్తర దిక్కున గల జిల్లా. అరేబియా సముద్రంతో సరిహద్దు పంచుకుంటున్న కన్నూర్ విశిష్ట వారసత్వానికి, సంస్కృతి - సంప్రదాయాలకు, సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతం జానపద కళలకి, వస్త్రాల తయారీ కి పుట్టినిల్లు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ మరియు ఇతర భాషల సినిమా షూటింగ్ లు ఇక్కడ నిత్యం జరుగుతుంటాయి. ప్రస్తుతం బాహుబలి -2, సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమా చిత్రీకరనలు స్థానిక కన్నూర్ ఫోర్ట్ లో జరిగినాయి.

కన్నూర్ ఎలా చేరుకోవాలి ?

కన్నూర్ ఎలా చేరుకోవాలి ?

ముందుగా కన్నూర్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ..! కన్నూర్ కు వెళ్ళటానికి రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

కన్నూర్ కు 25 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉన్నది. ప్రస్తుతానికైతే 121 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలికాట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గాని, 142 కి. మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం లో కానీ దిగి క్యాబ్ లేదా ట్యాక్సీ ల ను అద్దెకు తీసుకొని కన్నూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

కన్నూర్ నగరానికి నడిబొడ్డున రైల్వే స్టేషన్ ఉన్నది. బెంగళూరు, తిరువనంతపురం, న్యూఢిల్లీ, చెన్నై, ముంబై వంటి నగరాలకు ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించవచ్చు. నగరంలో వెళ్ళటానికి ఆటో రిక్షాల సదుపాయం, ట్యాక్సీ మరియు సిటీ బస్సుల సదుపాయం కలదు.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం ద్వారా కన్నూర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటుగా , దేశంలోని ప్రధాన నగరాలకు చక్కగా అనుసంధానమై ఉన్నది. తిరువనంతపురం, తలసెరి, కొచ్చి, కాలికాట్, మున్నార్, మంగళూరు నుండి తరచూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.

చిత్ర కృప : Anoopan

తాలిపరంబ

తాలిపరంబ

సర్పిలాకార కొండలను చుట్టూ కలిగిన తాలిపరంబ కన్నూర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇక్కడి ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకోవటానికి కేరళ నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయం, త్రి చాంబరాం ఆలయం, ముతప్పాన్ ఆలయం లు ఇక్కడి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు.

చిత్ర కృప : Radhakrishnan.K.K. Ramanthali

సుందరేశ్వర ఆలయం

సుందరేశ్వర ఆలయం

సుందరేశ్వర ఆలయం కన్నూర్ పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ మహా శివుడు, సుందరేశ్వర స్వామి రూపంలో కొలువై ఉంటాడు. ఏప్రిల్ - మే నెలల మధ్యలో జరిగే ఆలయ ప్రధాన ఉత్సవాలకు కేరళలోని భక్తులు హాజరై, స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలు సుమారు ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు.

చిత్ర కృప : C K SIVANKUTTY

శ్రీ మావిలయిక్కవు ఆలయం

శ్రీ మావిలయిక్కవు ఆలయం

ప్రత్యేకమైన ఆచారాలకు, సాంస్కృతిక ప్రదర్శన లకు ప్రసిద్ధి శ్రీ మావిలయిక్కవు ఆలయం. కన్నూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో కన్నూర్ - కులతుపుజ్హ మార్గంలోని మావిలయి గ్రామంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయంలో వినాయకుడు, భగవతి దేవి, దైవత్తర్ స్వామి, వేత్త కరుమన్కన్ స్వామి వారు కొలువై ఉంటారు.

చిత్ర కృప : Siddhartha Tippireddy

శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం

శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం

పయ్యన్నుర్ లోని శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం కన్నూర్ లో ప్రఖ్యాతి గాంచినది మరియు ఇతిహాసాలకు సంబంధించినది. పర్యాటకులని మరియు భక్తులని ఆకర్షించడంలో ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రముఖమైనది. ఆలయంయొక్క గర్భగుడి రెండు అంతస్తులు కలిగి ఏనుగు వెనుకభాగాన్ని పోలి ఉంటుంది.

చిత్ర కృప : Ratheesh

శ్రీ రాఘవాపురం ఆలయం

శ్రీ రాఘవాపురం ఆలయం

కన్నూర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేరుతజ్హం అనే చిన్న గ్రామంలో శ్రీ రాఘవాపురం ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీ.శ. 8 వ శతాబ్దానికి చెందినది. ఈ గుడిలో ఉన్న విగ్రహాలని తల మీద పెట్టుకుని ఇక్కడ బ్రాహ్మణ పూజారులు నృత్యం చేస్తారు. ఈ ఆచారాన్ని తిడంబు నృత్యం అని పిలుస్తారు. ఆ విశేష ఘట్టాన్ని తిలకించేందుకు అశేష భక్తులు హాజరవుతారు.

చిత్ర కృప : STV

పప్పినిస్సేరి

పప్పినిస్సేరి

కన్నూర్ నుండి కేవలం 10 కి.మీ. దూరంలో ఉన్న పప్పినిస్సేరి అను చిన్న గ్రామం ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలకి, ఆలయాలకి ప్రసిద్ది. బలియపటం నది, చుట్టు పక్కల చిన్న పర్వతాలు ఈ గ్రామాన్ని సందర్శించే పర్యాటకులకి కనువిందుచేస్తాయి. పంపురుతి (నది లో ఉన్న అందమైన ప్రదేశం), వాదేశ్వరం హిల్ (కేరళ కైలసంగా స్థానికంగా ప్రసిద్ది) పప్పినిస్సేరి లో ఉన్న ప్రధాన ఆకర్షణలు.

చిత్ర కృప : STV

పల్లిక్కున్ను

పల్లిక్కున్ను

పల్లిక్కున్ను కన్నూర్ పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ మూకాంబికా ఆలయం. ప్రతి సంవత్సరం జరిగే నవరాత్రి వేడుకలకి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.

చిత్ర కృప : vivek nair

ఊర్పజ్హస్సి కావు టెంపుల్

ఊర్పజ్హస్సి కావు టెంపుల్

కన్నూర్ సమీపంలో ఉన్న ఎదక్కాద్ లో ఉన్న ప్రసిద్దమైన ఆధ్యాత్మిక కేంద్రం ఊర్పజ్హస్సి కావు టెంపుల్. ఈ ఆలయలో భగవతీ, శ్రీ ఊర్పజ్హస్సి దైవతార్ మైర్యు వెట్టక్కోరుమకకన్ లు కొలువై ఉంటారు. ఈ గుడులలో భక్తులు తమలపాకు, వక్క మరియు ఎండిన వరిని నైవేద్యంగా ఇస్తారు.

చిత్ర కృప : Sandeep Gangadharan

కిజ్హక్కేకర ఆలయం

కిజ్హక్కేకర ఆలయం

కన్నూర్ లో ప్రాచీన దేవాలయం ఏదైనా ఉన్నదా ? అంటే అది కిజ్హక్కేకర దేవాలయం. ఈ ఆలయం, కన్నూర్ పట్టణానికి 7 కి.మీ. దూరంలో ఉన్న చిరరక్కల్ ప్రాంతంలో ఉంది. ఈ కిజ్హక్కేకర శ్రీ కృష్ణ టెంపుల్ లో అరుదుగా పూజింపబడే బాల గోపాలుడి రూపంలో శ్రీ కృష్ణ భగవానుడు కొలువై ఉన్నాడు. ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రశాంతతని అందించే ఈ ఆలయం పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : sree

కొట్టియూర్ శివ ఆలయం

కొట్టియూర్ శివ ఆలయం

దక్షిణ కాశీ గా పిలువబడే కొట్టియూర్ శివాలయం, కన్నూర్ సమీపంలోని కొట్టియూర్ గ్రామంలో కలదు. మే - జూన్ మాసాల మధ్యన జరిగే వైశాఖ పండుగ ని ఈ ఆలయంలో ప్రధానంగా జరుపుతారు. కొబ్బరికాయ లని కొట్టి, ఆ నీళ్ళతో స్వామి వారిని అభిషేకించటం ఈ పండుగ ప్రత్యేకత.

చిత్ర కృప : Praharsh RJ

చేరుకున్ను

చేరుకున్ను

కన్నూర్ పట్టణానికి 20 కి. మీ. దూరంలో ఉన్న చిన్న ఆధ్యాత్మిక గ్రామం చేరుకున్ను. అన్నపూర్ణేశ్వరి టెంపుల్, చేరుకున్నిలమ్మ ఆలయం, చిన్న చిన్న ద్వీపాలు, తావం చర్చి, ఒలియంకర జూమా మసీదు లు ఇతర ఆకర్షణ లుగా ఉన్నాయి.

చిత్ర కృప : Shareef Taliparamba

ప్యాథల్ మల

ప్యాథల్ మల

ప్యాథల్ మల కన్నూర్ పట్టణానికి 60 కి. మీ. దూరంలో సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్నది. ప్రకృతి ప్రేమికులకు, వన్య మృగ ప్రేమికులకు ఈ ప్రదేశం ఎంతగానో ఆకర్షిస్తున్నది. ట్రెక్కింగ్ చేయటానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. దారి పొడవునా ఫోటో లతో ఇక్కడి దృశ్యాలను తీసి ఆనందించవచ్చు.

చిత్ర కృప : Bobinson K B

పరిస్సినిక్కడవు స్నేక్ పార్క్

పరిస్సినిక్కడవు స్నేక్ పార్క్

భారతదేశంలో సరీశృపాలను పరిరక్షించే అతి ముఖ్యమైన కేంద్రాలలో పరిస్సినిక్కడవు స్నేక్ పార్క్ ఒకటి. కేరళ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఏకైక స్నేక్ పార్క్ కూడా ఇదే ..! కన్నూర్ కు 16 కి. మీ. దూరంలో ఉన్న పరిస్సినిక్కడవు అనే గ్రామంలో ఈ పార్క్ ఉన్నది. పరిస్సిని క్కడవు ముతప్పాన్ ఆలయం ఇక్కడి మరొక ప్రధాన ఆకర్షణ.

చిత్ర కృప : Junaid

ఎజ్హిమల

ఎజ్హిమల

ఎజ్హిమల పచ్చని ప్రదేశాలతో,290 మీటర్ల ఎత్తున ఉండి పర్యాటకులని విశేషం గా ఆకర్షిస్తున్నది. ఇక్కడి ముఖ్య ఆకర్షణలలో హనుమంతుడి గుడి మరియు మౌంట్ డెలి లైట్ హౌస్. ఇది కన్నూర్ నుంచి 55 కిలోమీటర్ల దూరం లో ఉన్నది.

చిత్ర కృప : Sujith

కన్నూర్ కోట

కన్నూర్ కోట

కన్నూర్ కోట, కన్నూర్ పట్టణం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ అనేక సినిమా షూటింగ్ లు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. మొన్నీమధ్యనే బాహుబలి పార్ట్ 2, బ్రహ్మోత్సవం మరియు సర్దార్ గబ్బర్ సింగ్ లు చిత్రీకరణ లు జరుపుకున్నాయి. ఇది పోర్చుగీసు వారు ఇండియాలో కట్టిన తొట్టతొలి కోట.

చిత్ర కృప : Rahul Sadagopan

ముజుప్పిలన్గడ్ బీచ్

ముజుప్పిలన్గడ్ బీచ్

పర్యాటకులు కన్నూర్ కు 16 కి. మీ. దూరంలో ఉన్న ముజుప్పిలన్గడ్ బీచ్ తీరం పొడవున నడుస్తూ అద్భుతమైన బీచ్ అందాలను ఆస్వాదించవచ్చు. ఏప్రిల్ లో జరిగే బీచ్ పండుగలో ఈ ప్రాంతం అంతా యువతరంతో సాహస విన్యాసాల ప్రేమికులతో నిండిపోతుంది.

చిత్ర కృప : sumila.s

పయ్యమ్బలమ్ బీచ్

పయ్యమ్బలమ్ బీచ్

కన్నూర్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పయ్యమ్బలమ్ బీచ్ లో సూర్యాస్తమ దృశ్యాలను చూడటానికి, విశ్రాంతిని పొందటానికి పర్యాటకులు వస్తుంటారు. తల్లి బిడ్డల అద్భుతమైన శిల్పం ఈ బీచ్ లో మరొక ప్రధాన ఆకర్షణ.

చిత్ర కృప : Sibi John

అరక్కల్ కెట్టు

అరక్కల్ కెట్టు

కన్నూర్ కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కల్ కెట్టు ఇదివరకు రాజుల నివాస స్థలం గా (ప్యాలెస్) ఉండేది ప్రస్తుతం మ్యూజియం గా మార్చబడినది. ఈ ప్యాలెస్ లో కోర్ట్ యార్డ్, వరండాలు, దర్బార్ హాల్స్, చెక్క నేలలు, రంగు రంగుల అద్దాల కిటికీలు కనువిందు చేస్తాయి.

చిత్ర కృప : telugu native planet

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి