Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకుల మజిలీ ... 'వయనాడ్' !!

పర్యాటకుల మజిలీ ... 'వయనాడ్' !!

దక్షిణ భారతదేశాన ఉన్న కేరళ రాష్ట్రంలో ఈశాన్య మూలాన బాగా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం వయనాడ్. ఇది కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ జిల్లాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న ఎన్నో ప్రత్యేకతల వలన ఈ ప్రదేశం పర్యాటకులకు ఒక పిక్నిక్ స్పాట్ గా మారింది. పశ్చిమ కనుమల మధ్య అడవులలోని చెట్ల మధ్యలో నెలకొని ఉన్న ఈ ప్రదేశం తన సహజ సిద్ద అందాలతో ఉత్తెజపరుస్తున్నది. దైనందిత రొటీన్ జీవన విధానాల నుండి కోల్పోతున్న విశ్రాంతి, విరామం, సంతృప్తిని పొందటానికి కార్పొరేట్ జనాలు వారి కుటుంబీకులతో , స్నేహితులతో ఎక్కువగా తరలివస్తుంటారు.

వయనాడ్ సందర్శనకు ఉత్తమమైన సమయం వర్షాకాలమే..! ఈ సమయంలో సందర్శకులకు ఈ ప్రాంతం సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. దుమ్ము, ధూళి, ఆకులు వర్షానికి కొట్టుకొనిపోయి ఈ ప్రాంతాన్ని కడిగిన ముత్యంలా తయారుచేస్తుంది.

మరింతగా చదవండి : వయనాడ్ లో మురిపించే పర్యాటక ఆకర్షణలు !!

అడవులకి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి అనేక రిసార్ట్ లు ఉన్నాయి. ఈ రిసార్ట్ లలో అలసిపోయిన పర్యాటకులకి ఉత్తేజం కలిగించడానికి ఆయుర్వేదిక్ మసాజ్ లు, స్పా వంటి సౌలభ్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంతటి విశేషాలు ఉన్న ఈ ప్రదేశంలో మరి చూడటానికి ఏమైనా ఉన్నాయా అంటే ... బోలెడు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయనే చెప్పవచ్చు. ఇక్కడ చూడవలసిన ఆకర్షణలను ఒకసారి సందర్శిస్తే ...

సుల్తాన్ బతేరి

సుల్తాన్ బతేరి

సుల్తాన్ బతేరి వయనాడ్ కి 23 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రశాంతమైన ఈ ప్రదేశం పూర్వం టిప్పూసుల్తాన్ హయాంలో దండయాత్రకి గురైనది. ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఏలకుల తోటలు ఇక్కడ ప్రసిద్ధి చెందినది.

Photo Courtesy: Sandeep Gangadharan

ఎడక్కల్ గుహలు

ఎడక్కల్ గుహలు

ఎడక్కల్ గుహలు నవీన యుగం కాలం నాటివి. ఇవి సుల్తాన్ బతేరి కి 12 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ పూర్వం కొంతమంది ఆది మానవులు నివసించారని లిఖిత పూర్వక ఆధారాలను కనుగొన్నారు. ఇవి అంబుకుతి పర్వతాల మీద 1000 మీటర్ల ఎత్తున పర్యాటకులను అన్ని కాలాలలో ఆకర్షిస్తున్నది. ఈ ప్రదేశం ట్రెక్కర్లకు, ప్రకృతి ప్రియులకు ఆనందం కలిగిస్తుంది. ఉదయాన్నే లేచి చేసే ట్రెక్కింగ్ శరీరానికి మనసుకి ఉత్సాహాన్ని ఇస్తుంది.

Photo Courtesy: gordontour

కురువా ద్వీప్

కురువా ద్వీప్

కాబిని నది వద్ద ఏర్పడిన డెల్టా (నదీ ముఖ ద్వారము వద్ద ఏర్పడే రెండు నదీ పాయల మధ్య ప్రదేశము) ప్రాంతం ఈ కురువ ద్వీపం. వయనాడ్ జిల్లాలో ఇది ముఖ్యమైన నది. ఎల్లప్పుడూ పచ్చగా ఉండే వివిధ రకాల వృక్ష జాతులతో , జంతుజాలంతో ఈ ప్రదేశం కలకళలాడుతుంది.

Photo Courtesy: indiawaterportal.org

కురువా ద్వీపం

కురువా ద్వీపం

అరుదైన కొన్ని పక్షులకి కురువా ద్వీపం నివాస స్థలం. ప్రకృతిలోని అందాలని తనివి తీరాచూడాలనుకునే పర్యాటకులకు ఈ ప్రదేశం గొప్ప విహార స్థలం. ఈ ద్వీపం లో నున్న సహజ సిద్దమైన ప్రకృతి సౌందర్యాన్ని కాపాడేందుకు సంవత్సరంలో కొన్ని సమయాలలో మాత్రమే ఇక్కడికి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తారు. అందుచేత ఈ ద్వీపం లో కి ప్రవేశించడానికి అటవీ శాఖ అనుమతి తప్పనిసరి.

Photo Courtesy: Bobinson K B

తిరునెల్లి ఆలయం

తిరునెల్లి ఆలయం

వయనాడ్ లో ఉన్న బ్రహ్మగిరి కొండపై ఈ తిరునెల్లి అనే పురాతన విష్ణుమూర్తి గుడి ఉంది. నలు వైపులా పర్వతాలు ఉండే లోయలో ఈ టెంపుల్ ఉంది. ఈ గుడి చుట్టుపక్కల ఉండే అడవులు చాలా దట్టమైనవి కావడం వల్ల ఇక్కడికి చేరుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఇన్ని శతాబ్దాల తరువాత కూడా అద్భుతంగా ఉన్న ఈ గుడి నిర్మాణాన్ని గమనిస్తే ఆశ్చర్యపోకమానరు.

Photo Courtesy: -Reji

మీన్ ముట్టి జలపాతాలు

మీన్ ముట్టి జలపాతాలు

వయనాడు జిల్లాలో మీన్ ముట్టి జలపాతాలు చాల అందమైనవి మరియు కేరళ లో రెండవ అతి పెద్ద జలపాతాలు. మీన్ ముట్టి అంటే అడ్డు పడిన చేపలు అని మలయాళం లో అర్థం చెపుతారు. ఈ జలపాతాలు సుమారు 300 మీ. ఎత్తు నుండి మూడు దశల్లో కిందకు పడతాయి. ఈ ప్రదేశం కలపెట్ట నుండి 29 కి.మీ. ఉంటుంది. ఊటీ వెళ్ళే మార్గం లో కలదు. వెళ్ళే దోవలో కొన్ని పురాతన గుహలు కూడా చూడవచ్చు.

Photo Courtesy: Aravind NC

పూకోట్ లేక్

పూకోట్ లేక్

కేరళ రాష్ట్రంలో ఉన్న పూకోట్ సరస్సు మంచి నీటి సరస్సు. చుట్టూదట్టమైన అడవులు ఉండటం వల్ల ఈ ప్రదేశం ఒక అందమైన పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది. ఈ సరస్సు ఒడ్డుకి పర్యాటకులు వచ్చి కూర్చొని, నీటి అందాలను చూస్తూ కొన్ని గంటలు అలానే ఉండిపోతారు. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం అద్భుతంగా ఉంటాయి.

Photo Courtesy: Vijayakumarblathur

నారాయణ ఆశ్రమం

నారాయణ ఆశ్రమం

పూకోట్ సరస్సుకు సమీపంలో నారాయణ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో కొద్దిసేపు గడిపితే చాలు మనస్సుకు మరియు శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, చుట్టూ ఉన్న అందమైన పూల తోటలు, పచ్చని బయలు పై నడక, అందంగా కదలాడే సరస్సులతో ఈ ఆశ్రమం మురిపిస్తుంది.

Photo Courtesy: SAIKAT SARKAR

ఫాంటమ్ రాక్

ఫాంటమ్ రాక్

వయనాడ్ వచ్చే పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఫాంటమ్ రాక్. ఇక్కడ ఒక కపాలం ఆకారంలో రాయి ఉంటుంది. ట్రెక్కింగ్ కి, క్యాంప్ లకి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్ కి అవసరమైన దుస్తులు, కెమరాలను వెంటబెట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ ఉండే ప్రకృతి ఆకర్షణలు మిమ్మాలను ఎంతగానో ఆకట్టుకుంటాయి అనటంలో సందేశం లేదు ...!

Photo Courtesy: Arindam Thokder

సూచిప్పర జలాపాతాలు

సూచిప్పర జలాపాతాలు

సూచిప్పర జలపాతాలు - సెంటినెల్ రాక్ వాటర్ ఫాల్స్ గా ప్రసిద్ధి చెందాయి. ఇవి 100 నుండి 300 అడుగుల ఎత్తులో నుండి కిందకు పడుతూంటాయి. ఈ ప్రదేశం కలపెట్ట నుండి 22 కి.మీ. ల దూరం లో కలదు. ఈ జలపాతం కూడా మూడు దశలలో కిందకు పడుతుంది.

Photo Courtesy: Shijoy Athiparambath

సూచిప్పర జలాపాతాలు

సూచిప్పర జలాపాతాలు

సూచిప్పర జలాపాతాల ప్రదేశంలో కల నీటి ప్రాంతం లో నీటి ఆటలు అంటే రాఫ్టింగ్, స్విమ్మింగ్, బాతింగ్ వంటివి ఆచరిస్తారు. మీరు ఇక్కడ చెట్ల పై కల గుడిసెలలో వసతి పొంది ప్రకృతిని చూస్తూ ఆనందించవచ్చు. ఫోటోగ్రాఫర్లకు ఇది ఒక స్వర్గం వలె ఉంటుంది.

Photo Courtesy: రామ ShastriX

వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి కేరళలో ఒక ప్రధాన ఆకర్షణ. ఇది కేరళలో రెండవ స్థానాన్ని పొందగా, దక్షిణ భారత దేశంలోని శాంక్చురీలలో ఇది ప్రసిద్ధి గాంచిన వాటిలో ఒకటి. ప్రతి సంవత్సరం దీనికి వేలాది పర్యాటకులు వస్తారు.

Photo Courtesy: RobertSteed

వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

జింకలు, ఏనుగులు, ఇండియన్ బైసన్, పులి, చిరుత మరియు అనేక పక్షులని కూడా చూడవచ్చు. ఈ శాంక్చురి ఎంతో పచ్చటి మరియు అందమైన పరిసరాలను కలిగి ఉంది. టేకు చెట్లు అధికంగా కలవు. పిల్లలతో పర్యటించేటపుడు మీరు తప్పక ఈ ప్రదేశాన్ని చూసి ఆనందించాలి.

Photo Courtesy: Kerala Tourism

బనసుర సాగర్ డ్యాం

బనసుర సాగర్ డ్యాం

కాబిని నది ఉప నది పైన ఉన్న బనసుర సాగర్ డ్యాం కలపెట్ట పట్టణం నుండి 21 కి. మీ దూరం లో ఉంది. ఈ డ్యాం భారత దేశం లో ఉన్న అతి పెద్ద ఆనకట్టగా మరియు ఆసియా లో నే రెండవ పెద్ద ఆనకట్టగా ఘనత సాధించింది. ఇక్కడ ఉండే చిన్న చిన్న ద్వీపాలు నుండి కనిపించే బనసుర కొండలు అత్యద్భుతంగా కనిపిస్తాయి.

Photo Courtesy: Challiyan

బనసుర సాగర్ డ్యాం

బనసుర సాగర్ డ్యాం

పశ్చిమ కనుమల లో ఉండే అందమైన పర్వతాల్ని చూసేందుకు ఈ డ్యాం నుండే పర్యాటకులు ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. ఏంతో మంది పర్యాటకులకి ప్రత్యేకించి విదేశీ పర్యాటకులకి ఈ ప్రాంతం అమితంగా ఆకర్షిస్తుంది.

Photo Courtesy: Joe Vadassery

చెంబర శిఖరం

చెంబర శిఖరం

చెంబర శిఖరం కలపెట్ట లో మాత్రమే ఎత్తైనది కాక, వయనాడ్ జిల్లాలోనే ఎత్తైనది గా ముద్రపడింది. ఇది సముద్ర మట్టానికి సుమారు 2100 ఎత్తు లో ఉంటుంది. ట్రెక్కర్ల కు ఇది చాలా ఇష్టమైన ప్రదేశం. శిఖరం పై భాగంలో వసతి కొరకు శిబిరాలు కూడా గలవు. శిఖరం పై ఒక అందమైన హృదయాకారంలో సరస్సు కలదు.

Photo Courtesy: Tanuja R Y

నీలిమల వ్యూ పాయంట్

నీలిమల వ్యూ పాయంట్

వయనాడ్ జిల్లాలో ఉన్న నీలిమల వ్యూ పాయింట్ పర్యాటకులచే తరచూ సందర్శించబడే పర్యాటక మజిలీ. క్రీడలు మరియు సాహసాలని ఇష్టపడే పర్యాటకులని ఈ ప్రాంతం అమితంగా ఆకట్టుకుంటుంది. ఇది ట్రెక్కింగ్ కి సురక్షితమైన ప్రదేశం. వ్యూ పాయింట్ ని చేరుకునే మార్గ మద్యం లో అందమైన ప్రకృతి దృశ్యాలు కనుల విందు కలిగిస్తాయి.

Photo Courtesy: Vivek Sheel Singh

నీలిమల వ్యూ పాయంట్

నీలిమల వ్యూ పాయంట్

సమయం ఉన్నట్లయితే క్యాంపు లకి కుడా నీలిమల వ్యూ పాయంట్ అనువైన ప్రదేశం. సాహస క్రీడల పట్ల ఆసక్తి కల పర్యాటకులని సంతృప్తి పరిచే విధంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. వాటిలో పైకి ఎక్కుతూ వెళ్లి కాఫీ ప్లాంటేషన్స్ ని చూస్తూ నడవడం వంటివి ముఖ్యమైనవి. పైకి వెళ్ళే కొద్ది తీవ్రమైన అల్లం మరియు పోక వక్క ల సువాసనలు కాఫీ సువాసనలు పర్యాటకులని పలకరిస్తాయి.

Photo Courtesy: Vivek Sheel Singh

నీలిమల వ్యూ పాయంట్

నీలిమల వ్యూ పాయంట్

పుష్కలంగా ఉండే జలపాతాలు, అందమైన కొండలు, మృదువైన గాలితో చేతులు కలిపే పచ్చిక బయర్లు, అందమైన లోయలు, దట్టమైన అడవులు ఈ నీలిమల వ్యూ పాయింట్ లో ఉండే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు.

Photo Courtesy: dare nature

చైన్ ట్రీ

చైన్ ట్రీ

ఆకర్షించే కథతో ముడిపడి ఉన్న వయనాడ్ లోని చైన్ ట్రీ పర్యాటకులని ఆకర్షించే ప్రధాన పర్యాటక ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఏంతో మంది పర్యాటకులని ఇక్కడున్న అతిపెద్ద మర్రి చెట్టు ఆకర్షిస్తుంది. ఇప్పటికీ, వేలాడుతున్న ఒక చైన్ ఇక్కడ కనిపిస్తుంది. వేల మంది పర్యాటకులని ఆకర్షించే చైన్ ఇది.

Photo Courtesy: Jayachandra Menon

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

వయనాడ్ సమీపంలో ఉన్న బ్రహ్మగిరి కొండలు

Photo Courtesy: Jaseem Hamza Photography

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

బనసుర సాగర్ డ్యాం వద్ద సూర్యాస్తమ సమయంలో ..

Photo Courtesy: v_2shaib

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

అంబలవయల్ డ్యామ్ వద్ద పర్యాటకులు

Photo Courtesy: Shareef Taliparamba

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

ఎడక్కల్ గుహల కి ట్రెక్కింగ్ ద్వారా చేరుకుంటున్న సాహసికులు

Photo Courtesy: Shareef Taliparamba

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

వయనాడ్ రోడ్ల మీద సైక్లింగ్ చేస్తున్న యాత్రికులు

Photo Courtesy: Arun Katiyar

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

వైల్డ్ లైఫ్ శాంక్చురి లో రోడ్డు దాటుతున్న ఏనుగు

Photo Courtesy: kolappan

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

పచ్చని ఆకు మీద వాలిన సీతాకోకచిలుక

Photo Courtesy: Ajith U

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

వైల్డ్ లైఫ్ శాంక్చురి లో జింకల సమూహం

Photo Courtesy: faisy5c

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

కెమరాకు చిక్కిన అందమైన గులాబీ పూల మొక్కల సమూహం

Photo Courtesy: Dhruvaraj S

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

బనసుర హిల్ రిసార్ట్

Photo Courtesy: Babish VB

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

ఏపి నెంబర్ ప్లేట్ తో వాయనాడు లో ప్రత్యెక్షమైన లారీ

Photo Courtesy: Siva Subramanian Vasanth

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

ఎడక్కల్ గుహల వద్ద ప్రకాశవంతమైన సూర్యరశ్మి

Photo Courtesy: Aswin Pai

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

సుల్తాన్ బతేరి వద్ద గల జైన ఆలయం

Photo Courtesy: Viewfindr_Kerala

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

వయనాడ్ లో గల సీతాదేవి ఆలయం

Photo Courtesy: Manu Rackenchath

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

వయనాడ్ లో అందాలను తనివితీర చూసేందుకు ఏర్పాటు చేసిన అందమైన వాచ్ టవర్

Photo Courtesy: Prasanth N G

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

ముతంగా వైల్డ్ లైఫ్ శాంక్చురి లో చెట్టుకొమ్మల మీద సేద తీరేందుకు, జంతువులను తిలకించేందుకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన అందమైన గడ్డి పాకలు

Photo Courtesy: Siva Subramanian Vasanth

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

వైల్డ్ లైఫ్ శాంక్చురి లో ఉరకలేస్తున్న సెలయేరు

Photo Courtesy: Pete Schnell

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

వయనాడ్ లో గల అందమైన రెస్టారెంట్

Photo Courtesy: Infinite Possibilities

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

కాసింత శరీరానికి వ్యాయామం కలిగించేందుకు రిసార్ట్ వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్

Photo Courtesy: Infinite Possibilities

మరిన్ని ఫొటోలతో ...

మరిన్ని ఫొటోలతో ...

కొండ మీద గల ఒక చిన్న ఆలయం

Photo Courtesy: Jagadeesh SJ

వయనాడ్ ఎలా చేరుకోవాలి ??

వయనాడ్ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

కోజ్హికోడ్ విమానాశ్రయం వయనాడ్ కి సమీపంలో ఉన్న విమానాశ్రయం. కలపెట్ట నుండి 75 కి. మీ .దూరంలో, వయనాడ్ నుండి 100 కి. మీ. దూరంలో ఈ విమానాశ్రయం ఉన్నది. విమానాశ్రయం బయటకు రాగానే మీకు అద్దె టాక్సీలు కనిపిస్తాయి. వీరు 1000 - 1500 రూపాయల వరకు వయనాడ్ కు చార్జీ వసూలు చేస్తారు. మీకు రేట్ కుదరకపోతే ప్రభుత్వ వాహనాల మీద కానీ, లేదా ఇతర ప్రేవేట్ బస్సుల ద్వారా కానీ చేరుకోవచ్చు.

రైలు మార్గం

వయనాడ్ కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కోజ్హికోడ్ లో ఉంది. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసందానమై ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి టాక్సీ లు అద్దెకి లభిస్తాయి లేదా రాష్ట్ర బస్సు ల లో కూడా వాయనాడు కి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

జాతీయ రహదారుల ద్వారా వయనాడ్ చక్కని అనుసంధానం కలిగి ఉంది. కోజ్హికోడ్, కన్నూర్, ఊటీ తదితర నగరాల నుండి వెళ్లే రోడ్డు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్కరోజు పర్యటన నిమిత్తం వెళ్ళేవారు ఆహార పదార్థాలు వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళడం ఉత్తమం ఎందుకంటే వయనాడ్ కి 100 కి. మీ. మేర ఎటువంటి రెస్టారెంట్ లు లేవు. పెట్రోల్ కూడా సమృద్ధిగా పోయించుకోవడం మంచిది.

Photo Courtesy: Sandeep Gangadharan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X