Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో భగవద్గీత మహాభారతం జరిగిన ప్రదేశాలు !

భారతదేశంలో భగవద్గీత మహాభారతం జరిగిన ప్రదేశాలు !

By Staff

"తింటే గారాలే తినాలి ... వింటే భారతమే వినాలి" అన్న సూక్తి ఊరికనే చెప్పలేదు. మహాభారతం హిందువులకు ఒక పెద్ద గ్రంధమే కాదు .. కాదు ఒక మహా కావ్యం, ఇతిహాసం కూడానూ. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి(వినాయకుడు) వ్ర్రాసాడని హిందువుల ప్రగాఢ నమ్మకం.

మహాభారతం అంటే ముందుగా గుర్తొచ్చేది పాండవులు ... కౌరవులు ... శ్రీకృష్ణుడు ... ఇంకా యుద్ధం. ఇంతేనా .... ఇంతకంటే ఇక ఎక్కువ గుర్తురాదులెండి. అసలు భారతం అంటే ఏమిటి ??

మహాభారతం జరిగిందని కొందరు చెబుతుంటే, మరికొందరు ఆది ఒట్టి సృష్టే అని కొట్టిపాడేస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా సింధూ, గంగా నది పరివాహ ప్రాంతాల్లో మహాభారతం జరిగినట్లు ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఎక్కువగా మహాభారతం జరిగింది ఉత్తర భారతదేశంలోనే. దక్షిణ భారత దేశంలో చాలా తక్కువగా జరిగింది మహాభారతం. ఇందులో ఉచ్చస్థితి గా చెప్పుకోవాల్సినది మహాభారత ఆఖరి యుద్ధం. దీనినే కురుక్షేత్ర సంగ్రామం అంటారు.

ఇది కూడా చదవండి : రామాయణం జరిగిన ప్రదేశాలు !

మహాభారత కావ్యంలో పేర్కొన్న కొన్ని ప్రదేశాలు అదేనండి మహాభారతం జరిగినట్లు చెప్పబడే ప్రదేశాలు గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. పనిలో పనిగా శ్రీకృషుని కావ్యం(భగవద్గీత) లోని ప్రదేశాలను చూద్దాం. ఆ ప్రదేశాలు దేనికి ప్రసిద్ధి? ఎక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకుంటే ...

కైకేయ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఉత్తర సరిహద్దు ప్రదేశం

కైకేయ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఉత్తర సరిహద్దు ప్రదేశం

కైకేయ ప్రదేశ్ గురించి మహాభారత కావ్యంలో వర్ణించబడింది. పూర్యం ఇది జయ్‌సెన్ రాజు రాజ్యంగా ఉండేది. ఈయన భార్య వాసుదేవుని యొక్క చెల్లలు రాధాదేవి. ఈ ప్రదేశంలో మహాభారత యుద్ధం జరిగినట్లు పేర్కొన్నారు. జయసేన్ కుమారుడు విండ్ జరాసంధునికి మరియు దుర్యోధనుడికి స్నేహితుడు. ఇతను తన చెల్లల్ని దుర్యోధనుడికి ఇచ్చి వివాహం జరపాలని అనుకున్నాడు. కానీ తన చెల్లలు కృష్ణుడిని ప్రేమించి, వివాహం చేసుకుంటుంది.

చిత్ర కృప : Trey Ratcliff

ఉజ్జనక్ : నైనిటాల్, ఉత్తర ప్రదేశ్

ఉజ్జనక్ : నైనిటాల్, ఉత్తర ప్రదేశ్

ఉజ్జనక్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నైనిటాల్ జిల్లాలోని కాశీపూర్ సమీపాన ఉన్నది. ద్రోణాచార్యుడు ఇక్కడే పాండవులకి, కౌరవులకి విలువిద్య నేర్పించాడు. ద్రోణాచార్యుని అభీష్టం మేరకు, కుంతి పుత్రుడు భీముడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు. దాంతో ఈ ప్రదేశానికి భీమ్ శంకర్ అన్న పేరొచ్చింది.

చిత్ర కృప : Dilip Rane

అంగదేష్(మనాలినగరి) : గొండ, ఉత్తర ప్రదేశ్

అంగదేష్(మనాలినగరి) : గొండ, ఉత్తర ప్రదేశ్

మనాలినగరి పూర్వం, పురాతన రాజ్యాలకి రాజధానిగా ఉండేది. ఇక్కడే దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని కర్ణుడికి బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రదేశం శక్తిపీఠాల్లో ప్రసిద్ధికెక్కింది. సతీదేవి కుడిచేయి ఇక్కడే పడిపోయింది.

చిత్ర కృప : suRANTo dwisaputra

కౌశంబీ: ఉత్తర ప్రదేశ్

కౌశంబీ: ఉత్తర ప్రదేశ్

ప్రస్తుత అలహాబాద్ నగరంలో, గంగానది కి దక్షిణం వైపున మహాభారత సమయంలో వత్సదేశ్ కి రాజధానిగా కౌశంబీ నగరం ఉండేది. వీరు కౌరవుల పక్షాన ఉండి, మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు.

చిత్ర కృప : Manfred Sommer

కాశి, ఉత్తర ప్రదేశ్

కాశి, ఉత్తర ప్రదేశ్

కాశి నగరం మహాభారత కాలంలో, ప్రధాన విద్యా కేంద్రంగా ఉండేది. భీష్మ పితామహుడు కాశి రాజు మీద యుద్ధం చేసి గెలిచాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు. వారు అంబ, అంబిక,అంబాలిక. భీష్ముడు ముగ్గురినీ విచిత్రవీర్య కిచ్చి వివాహం జరిపించాలని అనుకుంటాడు. ఇక్కడ కూడా లవ్ స్టోరీ దాపరిస్తుంది. అంబ శిశుపాలుని తమ్ముడు శల్య ని ప్రేమిస్తుంది. దీంతో విచిత్రవీర్య ని వివాహం చేసుకోనని చెబుతుంది. మిగిలిన ఇద్దరు అంబిక, అంబాలిక గతిలేక విచిత్రవీర్య ని వివాహం చేసుకుంటారు. దృతరాష్ట్రుడు అంబిక కొడుకు, పాండు అంబాలిక కొడుకు. దృతరాష్ట్రుని కుమారులను కౌరవులని, పాండురాజు కొడుకులను పాండవులని అంటారు. వీరి మధ్యనే మహాభారత యుద్ధం జరుగుతుంది.

చిత్ర కృప : Steve Browne & John Verkleir

ఏకచక్ర నగరి : ఆరహ్, బీహార్

ఏకచక్ర నగరి : ఆరహ్, బీహార్

మహాభారత కాలంలో ఆరహ్ ను ఏకచక్ర నగరి అనేవారు. పాండవులకు వనవాస సమయంలో కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నారు. వారికి ఒక బ్రాహ్మాణుడు ఆశ్రయం కల్పించాడు. బకాసురుడు అనే రక్షసుడిని భీముడు ఇక్కడే వధించాడు.

చిత్ర కృప : Nagarjun Kandukuru

మగధ : దక్షిణ బీహార్

మగధ : దక్షిణ బీహార్

ప్రస్తుత దక్షిణ బీహార్ పురాతన నామం మగధ. జరాసంధుడు ఈ రాజ్యాన్ని పాలించేవాడు. ఈ ప్రదేశంలోనే భీముడు జరాసంధున్ని కుస్తీ పోటీలో చంపుతాడు. వీికి మగధ ప్రజలు సహాయం చేస్తారు.

చిత్ర కృప : Raja Ravi Varma

కామాఖ్య : అస్సాం

కామాఖ్య : అస్సాం

కామాఖ్య అస్సాంలో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ నరకాసురుడు మహాభారత సమయంలో కామాఖ్యదేవి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.

చిత్ర కృప : Far Horizon India Tours

మణిపూర్, తూర్పు భారత దేశం

మణిపూర్, తూర్పు భారత దేశం

మహాభారత సమయంలో మణిపూర్ ని చిత్రవహన్ అనే రాజు పరిపాలించేవాడు. ఇతనికి చిత్రగండ అనే కూతురు ఉండేది. ఆమె అర్జునున్ని వివాహం చేసుకొని బభ్రువహన్ అనే కుమారునికి జన్మనిస్తుంది. ఇతను పెరిగి పెద్దాయాక మణిపూర్ రాజ్యాన్ని పాలిస్తాడు మరియు పాండవులకు యుద్ధంలో సహాయపడతాడు.

చిత్ర కృప : b-OBBY Bhardwaj

మత్స్య రాజ్యం : ఉత్తర రాజస్థాన్

మత్స్య రాజ్యం : ఉత్తర రాజస్థాన్

మత్స్య దేశాన్ని విరాటుడు అనే రాజు పరిపాలించే వాడు. ఈ రాజ్యానికి రాజధాని విరాట్ నగర్. పాండవులు వనవాస సమయంలో సంవత్సరం పాటు ఇక్కడే నివసించారు. ఒకనాడు విరాటుని బావ, కమాండర్ అయిన కీచక కన్ను ద్రౌపది మీద పడుతుంది. ఇది గమనించిన భీముడు అతన్ని ఛంపేస్తాడు. అర్జునుని కుమారుడు అభిమన్యుడు వి రాటు ని కుమార్తె అయిన ఉత్తర ను పెళ్ళిచేసుకుంటాడు.

చిత్ర కృప : David Cooley

ముచ్చకండ్ తిర్థ్ : ధోల్పూర్, రాజస్థాన్

ముచ్చకండ్ తిర్థ్ : ధోల్పూర్, రాజస్థాన్

ప్రస్తుతం ఆరావళి పర్వతాలు రాజస్థాన్ రాష్ట్రంలో ఎలా ఉన్నాయో, అలాగే ధోల్పూర్ ప్రాంతంలో కూడా ప్రమాదకరమైన పర్వతాలు ఉండేవి. కాళ్యవణ్ రాజు మథుర రాజ్యాన్ని జయించిన పిమ్మట, శ్రీకృషుడిని వెంబడించాడు. అప్పుడు కృష్ణుడు ముచ్చకండ్ చేత కప్పబడిన ఈ పర్వతాలలోని గుహలో దాపెట్టుకున్నాడు.

చిత్ర కృప : Woudloper

పటాన్, మెహ్సన, గుజరాత్

పటాన్, మెహ్సన, గుజరాత్

పటాన్, గుజరాత్ రాష్ట్రంలోని మెహ్సన కి సమీపంలో ఉండేది. మహాభారత కాలంలో ఇది వాణిజ్య నగరంగా ఉండేది. వనవాస సమయంలో భారతదేశ మొత్తం సంచరిస్తున్న పాండవులు ఒకనాడు ఇక్కడకు కూడా వచ్చాడు. వారొచ్చే సమయానికి పటాన్ ను హిడింబ్వన్ అనే రాజు పలిపాలనలో ఉండేది. ఇక్కడ జరిగిన ఒకేఒక సంఘటన భీముడు డీమన్ అనబడే హిడింబ్ ను చంపి వేసి అతని చెల్లలిని వివాహం చేసుకుంటాడు.

చిత్ర కృప : Nagarjun Kandukuru

వర్ణవట్ : మీరట్ కి సమీపంలో, ఉత్తర ప్రదేశ్

వర్ణవట్ : మీరట్ కి సమీపంలో, ఉత్తర ప్రదేశ్

వర్ణవట్, మహాభారత కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీరట్ సమీపంలోని గల పట్టణం. ఇక్కడ దుర్యోధనుడు లక్ష్ గృహ అనే నిర్మాణాన్ని పాండవులను చంపడానికి కట్టించాడు. ఇది గంగా నది ఒడ్డున ఉన్నది.

చిత్ర కృప : Ramanarayanadatta astri

మహేశ్వర్,మధ్యప్రదేశ్

మహేశ్వర్,మధ్యప్రదేశ్

మహీష్మతి, కార్తవీర్యార్జునుని రాజధాని. ఓరోజు కార్తవీర్యార్జునుడు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరగా, మహర్షి ఆయనకు, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. మహర్షి ఆర్భాటానికి కారణం గ్రహించిన కార్తవీర్యార్జునుడు కామధేనువు సంతానానికి చెందిన గోవుని బలవంతంగా తీసుకొనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు, మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు.

చిత్ర కృప : Amit Rawat

శమంత పంచకం , కురుక్షేత్ర, హర్యానా

శమంత పంచకం , కురుక్షేత్ర, హర్యానా

శమంత పంచకం ప్రదేశంలో పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పాడు. అంతేకాదు మహాభారతంలో దుర్యోధనుని చంపిన చోటుగా పేర్కొనబడింది.

చిత్ర కృప : oronuevo1

కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతాన్ని 'పరశురామక్షేత్రం' అంటారు. పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి, సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం ఇది.

చిత్ర కృప : The San Diego Museum of Art Collection

మన, ఉత్తరాంచల్

మన, ఉత్తరాంచల్

మన, ఉత్తరాంచల్ రాష్ట్రంలోని చమొలి జిల్లాలో ఉన్నది. ఇక్కడున్న గుహలో వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసినట్లు ప్రచారంలో ఉన్నది.

చిత్ర కృప : Sandeep Gangadharan

ఝున్సి,అలహాబాద్

ఝున్సి,అలహాబాద్

ప్రస్తుతం ఉన్న ఝాన్సీ ని మహాభారతంలో 'ప్రతిష్టానపురం' గా పేర్కొన్నారు. ఇది పురూరవుని రాజధాని గా ఖ్యాతి గడించింది. చంద్రుని కుమారుడు బుధుడు కి, ఇళకి( స్తీ రూపం ధరించిన సుధుమ్నుడు) జన్మించిన కుమారుడు పురూరవుడు. ఇతను అందగాడే కాదు మంచి రాజు కూడా .

చిత్ర కృప : Rajan Kinkhede

సాళ్వ రాజ్యం, కురుక్షేత్ర దగ్గర, హర్యానా

సాళ్వ రాజ్యం, కురుక్షేత్ర దగ్గర, హర్యానా

ప్రస్తుతం హర్యానా లో ఉన్న కురుక్షేత్ర దగ్గర, ఒకప్పుడు సాళ్వ రాజ్యం ఉండేది. దీనికి రాజు సత్యవంతుడు. సావిత్రీ, సత్యవంతుల కథలో ఉన్న సత్యవంతుడే ఈ రాజ్యానికి అధిపతి.

చిత్ర కృప : Arun

హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్

హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్

హస్తినాపురం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఉన్న పట్టణం మరియు గ్రామ పంచాయతి. ఈ స్థలం మహాభారతంలో కౌరవుల రాజధాని గా ఉండేది.

చిత్ర కృప : amitk227

పశ్చిమ ఒరిస్సా

పశ్చిమ ఒరిస్సా

ప్రస్తుతం ఉన్న పశ్చిమఒరిస్సా ప్రాంతంలో మహేంద్ర పర్వతం ఉన్నది. ఈ స్థలంలో పరశురాముడు తపస్సు చేసినట్లుగా భావిస్తారు.

చిత్ర కృప : palliath1

రాజస్థాన్

రాజస్థాన్

ఆల్వార్, గూర్గాన్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, మహాభారత కాలంలో మత్స్య దేశం గా ఉండేది. ఈ రాజ్యాన్ని విరాట మహారాజు ఏలినాడు.

చిత్ర కృప : Raja Ravi Varma

గౌహతి, అస్సాం

గౌహతి, అస్సాం

ప్రాగ్జ్యోతిష్యంపూర్ మహాభారత కాలంలో నరకాసురుని రాజ్యంలో రాజధానిగా ఉండేది. ఇతను 16000 మంది ఆడవాళ్ళను బంధిస్తాడు. శ్రీ కృష్ణుడు అతన్ని వధించి ఆ 16000 ఆడవాళ్ళను ద్వారకా కు తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు.

చిత్ర కృప : azad singh parihar

ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర

ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర

ఖండవవనం నాశనం అయిన తర్వాత పాండవులు స్థాపించిన ప్రదేశం ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం. ఈ పట్టణం పాండవుల రాజధాని.

చిత్ర కృప : Sujit Kumar Lucky

పోర్ బందర్, గుజరాత్

పోర్ బందర్, గుజరాత్

గుజరాత్ లోని పోర్ బందర్ ని శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు కుచేలుడు నివసించినట్లు గా ఇతిహాసాల్లో పేర్కొన్నారు.

చిత్ర కృప : aryasamaj_porbandar

ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్

ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్

మహాభారత కాలంలో ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలను కలిపి పాంచాల దేశంగా పిలిచేవారు. ఇది ద్రుపద మహారాజు ఏలిన రాజ్యం గా ఇతిహాసంలో పేర్కొన్నారు.

చిత్ర కృప : Ramnadayandatta Shastri Pandey

కంపిల్, ఉత్తర ప్రదేశ్

కంపిల్, ఉత్తర ప్రదేశ్

కంప్లి / కంపిల్ ద్రౌపది పుట్టినిల్లుగా, మత్స్యయంత్ర బేధన స్థలం గా మహాభారతంలో పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫర్రుఖబాద్ జిల్లాలో ఒక నగర పంచాయతిగా ఉన్నది.

చిత్ర కృప : farrukhabad.nic.in

గోకుల్, మధుర దగ్గర, ఉత్తర్ ప్రదేశ్

గోకుల్, మధుర దగ్గర, ఉత్తర్ ప్రదేశ్

వ్రేపల్లె లేదా గోకులం అని పిలువబడే గోకుల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర సమీపంలో ఉన్నది. ఈ ప్రదేశంలో శ్రీ కృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు.

చిత్ర కృప : amitk227

గ్వాలియర్, మధ్యప్రదేశ్

గ్వాలియర్, మధ్యప్రదేశ్

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ రాజ్యంలో కుంతిపురి అనే పట్టణం ఉండేది. ఇది పాండురాజు మొదటి భార్య కుంతి దేవి పుట్టినిల్లు.

చిత్ర కృప : Nikhil solanki

జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

జలాన్ జిల్లాలో హిడింబవనం ఉన్నది. ఈ స్థలంలో హిడింబాసురుడిని భీముడు చంపినట్లు మహాభారతంలో పేర్కొన్నారు.

చిత్ర కృప : Vijay Panjiar

విదర్భ, మహరాష్ట్ర

విదర్భ, మహరాష్ట్ర

ప్రస్తుతం మహారాష్ట్ర లోని విదర్భ ప్రాంతాన్ని దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం గా మహాభారతంలో ఉన్నది.

చిత్ర కృప : Jean-Pierre Dalbéra

అహోబిలం, ఆంధ్ర ప్రదేశ్

అహోబిలం, ఆంధ్ర ప్రదేశ్

నృసింహస్వామి (నరసింహస్వామి) హిరణ్యకశిపుని వధించిన స్థలం

చిత్ర కృప : Karunakanth Bathula

జమానియా, ఉత్తర్ ప్రదేశ్

జమానియా, ఉత్తర్ ప్రదేశ్

జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉన్న చోటు. ఈయన పరుశురాముని తండ్రి.

చిత్ర కృప : Manfred Sommer

గ్వాలియర్ జిల్లా , మధ్యప్రదేశ్

గ్వాలియర్ జిల్లా , మధ్యప్రదేశ్

నిషాద రాజ్యం ప్రస్తుతం ఉన్న గ్వాలియర్ జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇది నల మహారాజు రాజ్యం.

చిత్ర కృప : Ramanarayanadatta astri

సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

ప్రస్తుతం యూపీ లో ఉన్న సీతాపూర్ జిల్లాను, మహాభారతంలో నైమిశారణ్యం గా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు, పురాణాలు బోధించారు.

చిత్ర కృప : Ramanarayanadatta astri

మధుర, ఉత్తర్ ప్రదేశ్

మధుర, ఉత్తర్ ప్రదేశ్

మధుపురం లేదా మధువనం కంసుని రాజధాని గా ఉండేది. ఇది యూపీలోని మధుర సమీపంలో ఉన్నది.

చిత్ర కృప : Gopal Ganesh

డెహ్రాడూన్, ఉత్తరాఖండ్

డెహ్రాడూన్, ఉత్తరాఖండ్

డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని మరియు ప్రసిద్ధ హిల్ స్టేషన్. పాండవులకు, కౌరవులకు విద్య నేర్పిన ద్రోణాచార్యుడు ఈ ప్రాంతంలోని ద్రోణగిరి లో నివసించాడు.

చిత్ర కృప : Parshotam Lal Tandon

గూర్గాన్, హర్యానా

గూర్గాన్, హర్యానా

మహాభారత కాలంలో గూర్గాన్ లో గురు గ్రామం ఉండేది. ఈ స్థలంలో కౌరవులు, పాండవులు విద్యాభ్యాసం చేసినారు.

చిత్ర కృప : Ramanarayanadatta astri

వర్నాల్, హస్తినాపూర్

వర్నాల్, హస్తినాపూర్

హస్తినాపూర్ పట్టణం మహాభారతం జరిగినట్లుగా భావించే చోటు. ఈ పట్టణంలోని వర్నాల్ ని కౌరవులు పాండవుల లాక్షగృహ దహనం చేసిన ప్రదేశంగా పేర్కొన్నారు.

చిత్ర కృప : Girishchavare

గిర్నార్, గుజరాత్

గిర్నార్, గుజరాత్

కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం.

చిత్ర కృప : Amre

ద్వారక,గుజరాత్

ద్వారక,గుజరాత్

శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం.

చిత్ర కృప : SUMERU PARVAT

కుండినపుర, మహరాష్ట్ర

కుండినపుర, మహరాష్ట్ర

మహారాష్ట్ర లోని కుండినపుర రుక్మిణిదేవి జన్మస్థలం.

చిత్ర కృప : Amit Rawat

బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్

బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్

బుందేల్ ఖండ్ ని మహాభారత కాలంలో చేది రాజ్యం అనే వారు. ఈ రాజ్యాన్ని శిశుపాలుడు పరిపాలించాడు.

చిత్ర కృప : Amit Rawat

దాతియ జిల్లా, మధ్యప్రదేశ్

దాతియ జిల్లా, మధ్యప్రదేశ్

దాతియా ను మహాభారత కాలంలో కారుష రాజ్యం అనేవారు. ఈ రాజ్యానికి రాజు దంతవక్రుడు.

చిత్ర కృప : Don't just "click" pictures; S

రణ్ భూమి, బీహార్

రణ్ భూమి, బీహార్

జరాసంధుని భీముడు చంపిన చోటు.

చిత్ర కృప : Raja Ravi Varma

పశ్చిమ హర్యానా

పశ్చిమ హర్యానా

కామ్యక వనం, దైత్య వనం అనేవి పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు

చిత్ర కృప : Raja Ravi Varma

విరాట్ నగర్,రాజస్థాన్

విరాట్ నగర్,రాజస్థాన్

విరాటనగరం పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం.

చిత్ర కృప : Raja Ravi Varma

సోనిత్ పూర్, అస్సాం

సోనిత్ పూర్, అస్సాం

శోణపురం బాణాసురుడి రాజధాని.

చిత్ర కృప : Wikirapra

ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్

ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్

నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం.

చిత్ర కృప : wikicommons

పర్హాం,ఉత్తర్ ప్రదేశ్

పర్హాం,ఉత్తర్ ప్రదేశ్

జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం.

చిత్ర కృప : Bob K

బోధ్ గయ, బీహార్

బోధ్ గయ, బీహార్

బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం

ఇది కూడా చదవండి : బుద్ధుడు జీవితంలో ఎదుర్కొన్న ఘట్టాలు

చిత్ర కృప : ~zipporah~

కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్

కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్

గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు.

ఇది కూడా చదవండి : కుశినగర్ - బౌద్ధ యాత్రా స్థలం !

చిత్ర కృప : Akiyoshi Terashima

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more