Search
  • Follow NativePlanet
Share
» »సుర్గుజా - పురాతన ప్రదేశంలో అన్వేషణ !!

సుర్గుజా - పురాతన ప్రదేశంలో అన్వేషణ !!

సుర్గుజా (సుర్ గూజా) ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఒక జిల్లా పేరు. ఈ జిల్లా ముఖ్య కేంద్రం అంబికాపూర్. ఈ జిల్లాకు సరిహద్దులుగా ఉత్తరప్రదేశ్, జార్ఖాండ్ మరియు వింద్యా పర్వత శ్రేణులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 50 శాతానికి పైగా అటవీ ప్రాంతం ఉంది కనుక ఎక్కువ సంఖ్యలో ఆటవిక తెగ ప్రజలు నివసిస్తున్నారు.

ఇది కూడా చదవండి : జగదల్పూర్ - అడవి తల్లికి కేరాఫ్ అడ్రస్ !

సుర్గుజా ప్రదేశం గురించి పురాణ గ్రంథాలలో ప్రస్తావించబడింది. శ్రీరాముడు తన వనవాస సమయంలో కొంత కాలం పాటు ఈ ప్రాంతంలో నివసించాడని అందువల్ల చుట్టుప్రక్కల ప్రదేశాలకు రాముడు, సీత, లక్ష్మణుడు అనే పేర్లు ఉన్నాయని కథనం.

ఇది కూడా చదవండి : రామాయణ ఘట్టాలు జరిగిన ప్రదేశాలు !

సుర్గుజాలో చాలా ప్రదేశాల వలె పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సుర్గుజా ప్రదేశ ప్రకృతి అందాలకు ముగ్ధులై ఇక్కడ సినిమా లు తీసిన చిత్రాలు ఆన్ని సూపర్ డూపర్ హిట్లు సాధించినవే. అంతెందుకు ఇక్కడ సినిమా తీసిన హాలీవూడ్ చిత్రం "ది లాస్ట్ మైగ్రేషన్" కు సినిమా పురస్కారాలలో అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డ్ వరించింది. మరి ఇక్కడున్న పర్యాటక ఆకర్షణలను ఒకసారి గమనిస్తే ...

ఇది కూడా చదవండి : స్వర్గం లాంటి జలపాతాల నగరం ... కొరియా !

అంబికాపూర్

అంబికాపూర్

అంబికాపూర్ పూర్వం బ్రిటీష్ వారి హయాంలో గుజరాత్ రాష్ట్రానికి రాజధాని గా ఉండేది ప్రస్తుతం సుర్గుజా జిల్లాకు హెడ్ క్వార్టర్స్ గా ఉన్నది.

Photo Courtesy: telugu native planet

అంబికాపూర్

అంబికాపూర్

అంబికాపూర్ కు ఆ పేరు రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న అంబికా లేదా మహామాయ దేవి అనే దేవత కారణంగా వచ్చింది. ఈ ఆలయాన్ని ఒక కొండమీద నిర్మించినారు.

Photo Courtesy: telugu native planet

మెయిన్ పాత్

మెయిన్ పాత్

మెయిన్ పాత్ అనేది ఒక సుందర పర్వత ప్రాంతం. దీనిని ఛత్తీస్ గడ్ సిమ్లా గా అభివర్ణిస్తారు. ఈ పర్వత ప్రాంతం అంబికాపూర్ కు 45 కి. మీ. దూరంలో ఉన్నది.

Photo Courtesy: telugu native planet

టైగర్ పాయింట్ వాటర్ ఫాల్

టైగర్ పాయింట్ వాటర్ ఫాల్

మునిపాత లో గల టైగర్ పాయింట్ వాటర్ ఫాల్ చాలా అందమైనది. ఈ వాటర్ ఫాల్ ను చూడటానికి చుట్టుప్రక్కల ప్రజలు, విదేశీ పర్యాటకులు తరచూ వస్తుంటారు.

Photo Courtesy: Ice Cubes

బుద్ధ ఆలయం

బుద్ధ ఆలయం

అంబికాపూర్ లో మరొక ప్రసిద్ధ ఆకర్షణ బుద్ధ ఆలయం. ఇక్కడి టిబెటన్ లు కార్పేట్ లు, ఉలెన్ దుస్తులు తయారు చేసే పరిశ్రమలను నడుపుతారు.

Photo Courtesy: chaitan singh

శివాలయం

శివాలయం

అంబికాపూర్ కి 49 కి. మీ. దూరంలో ప్రసిద్ధి చెందిన శివాలయం ఉన్నది. ఇక్కడ శివరాత్రి, బసంత్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడికి వచ్చే భక్తులు పక్కనే ఉన్న రిహంద్ నదిలో స్నానాలు ఆచరించి శివ భగవానున్ని దర్శించుకొని ఆశీస్సులు పొందుతారు.

Photo Courtesy: telugu native planet

కైలాష్ గుహలు

కైలాష్ గుహలు

అంబికాపూర్ కి 60 కి. మీ. దూరంలో కైలాష్ గుహలు ఉన్నాయి. ఈ గుహలను సెయింట్ రామేశ్వర్ గహిరా గురూజీ నిర్మించారు. ఇక్కడ ఒక శివ పార్వతుల టెంపుల్ కూడా కలదు. కైలాష్ కేవ్ ల వద్ద యజ్ఞ మండపం, సంస్కృతం స్కూల్, గహిరా గురు ఆశ్రమం లు ఇతర ఆకర్షణలు.

Photo Courtesy: carol mitchell

దీపదిహ్

దీపదిహ్

దీపదిహ్ అనే ప్రదేశం అంబికా పూర్ కి 70 కి. మీ. దూరంలో కలదు. ఇక్కడ ఒక శంకర్ ఆలయం ఉన్నది. ఈ ఆలయం చుట్టుప్రక్కల విష్ణు, కార్తికేయ, వినాయక మరియు దుర్గా దేవి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ శిధిలమైన ఆలయాల్లో మహిష మర్ధిని ఆలయం ప్రముఖమైనది. ఇక్కడి స్థంబాల మీద దేవుళ్ళు, దేవతల రూపాలను అద్భుతంగా చెక్కారు.

Photo Courtesy: telugu native planet

దేవ్ ఘర్

దేవ్ ఘర్

అంబికాపూర్ కి 51 కి. మీ. దూరంలో ఉన్న దేవ్ ఘర్ యాత్రా స్థలంగానే కాక, అనేక ప్రకృతి దృశ్యాలను కలిగి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. దేవ్ ఘర్ లో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుట్ట పై ఒక్కో ఆలయం ఉన్నది. గౌరి శంకర్ ఆలయం శిల్ప శైలి పర్యాటకులను ముగ్ధులనుచేస్తుంది.

Photo Courtesy: telugu native planet

మహామాయ ఆలయం

మహామాయ ఆలయం

సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ పట్టణానికి కూతవేటు దూరంలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రాచీన, యాత్రా స్థలం మహామాయ ఆలయం. ఈ ఆలయంలోని దుర్గా దేవి మాత ను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. ఇక్కడ నవరాత్రి(దసరా) ఉత్సవాలను దేవస్థానం వారు ఘనంగా జరుపుతారు. ఆ సమయంలో భక్తులకు ఉచిత బస్సు సదుపాయం ఏర్పాటుచేస్తారు.

Photo Courtesy: chaitan singh

కుదర్ ఘర్

కుదర్ ఘర్

సుర్గుజా జిల్లా, అంబికాపూర్ కు 82 కి. మీ. ల దూరం లో కల కుదర్ ఘర్ ఒక పవిత్ర యాత్రా స్థలం. ఇక్కడి ప్రధాన దేవత కుదర ఘరి. ఇక్కడ చిత్ర నవరత్న ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయ ప్రత్యేకత ఏమంటే, సుమారు ఆరు అంగుళాలు వ్యాసం కల చిన్న రంధ్రం, వెయ్యి మేకలను బలి ఇచ్చినప్పటికీ పూడిపోదు.

Photo Courtesy: telugu native planet

సేమర్సాట్ వైల్డ్ లైఫ్ సంక్చురి

సేమర్సాట్ వైల్డ్ లైఫ్ సంక్చురి

సేమర్సాట్ వైల్డ్ లైఫ్ సంక్సురి అంబికాపూర్ నుండి 50 కి. మీ. ల దూరంలో కలదు. ఇది 430 చ.కి. మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి వుంది. ఈ సంక్చురి దట్టమైన వృక్షాలతో నిండి వుంటుంది. అధికంగా సాల్ వృక్షాలు కలవు. నీలగి చితాల్, సాంబార్, చింకారా, వైల్డ్ బొర్ ఫాక్స్, లున్గ్లె కాట్ వ్బంతి జంతువులు ఇక్కడ చూడవచ్చు.

Photo Courtesy: telugu native planet

తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి

తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి

తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి, అంబికాపూర్ నుండి 100 కి. మీ. ల దూరంలో సుమారు 600 చ. కి. మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ సంక్చురి లో వివిధ రకాల మొక్కలు, జంతువులు కలవు ఇక్కడ సాల్, బంబూ అడవులు కూడా కలవు. టైగర్ , చిరుత, ఎలుగుబంటి సాంబార్ లేడి, బ్లూ బుల్ చితాల్, బైసన్ వంటి జంతువులు , వివిధ రకాల పక్షులు కూడా ఇక్కడ కలవు.

Photo Courtesy: telugu native planet

సుర్గుజా ఎలా చేరుకోవాలి ??

సుర్గుజా ఎలా చేరుకోవాలి ??

విమాన ప్రయాణం

సుర్ గూజా కు 375 కి. మీ. ల దూరం లో కల రాయ్ పూర్ విమానాశ్రయం సమీపం. ఇక్కడ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు సేవలు కలవు.

రైలు ప్రయాణం

బిలాస్ పూర్ కు 230 కి. మీ. లు, రాయ్ పూర్ కు 336 కి. మీ. ల దూరంలో వుంటుంది. రాత్రి వేల ట్రైన్ లు దుర్గ మరియు అంబికాపూర్ ల మధ్య నడుస్తాయి.

రోడ్డు ప్రయాణం

దుర్గ, బిలాస్ పూర్ మరియు రాయ్ పూర్ ల నుండి బస్సు లు కలవు, ప్రైవేటు టాక్సీ లు కూడా దొరుకుతాయి.

Photo Courtesy: Pankaj Oudhia

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X