» »దక్షిణాది చలనచిత్రాల షూటింగ్ కేరాఫ్ ఈ పర్యటాక ప్రాంతం

దక్షిణాది చలనచిత్రాల షూటింగ్ కేరాఫ్ ఈ పర్యటాక ప్రాంతం

Written By: Beldaru Sajjendrakishore

కనుచూపుమేర పచ్చటి పొలాలు. పల్లెవాతావరణానికి తగ్గట్టు వెదురు, కర్ర దూళాలతో చేసిన భవనాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో పల్లె వనితల జానపదాలు ఇంతకంటే మనసుకు ఆహ్లాదాన్ని తెచ్చే ప్రాంతం ఏదైనా ఉందా అంటే లేదనే సమాధానమే వస్తుంది. కేవలం మనసుకే కాదు ఇటువంటి ప్రాంతం సినీలోకానికి కూడా కల్పతరువుగా మారిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. సినిమావాళ్ళను అంతగా ఆకర్షితున్న ఆ ప్రదేశం పేరు పొల్లాచి.

పల్లె బ్యాక్ డ్రాప్ లో కథనం ఉండే సినిమాల కేరాఫ్ పొల్లాచి. గడిచిన ఏడాది కాలం నుండి వీటి సంఖ్య మరీ ఎక్కువైపోయింది. మరి ఇంతగా డైరెక్టర్లను, హీరో హీరోయిన్లను మరియు చిత్ర యూనిట్ ను ఆకర్షితున్న ఆ ప్రదేశం ఏది ? ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదండి ! అన్నట్టు ఈ పల్లె షూటింగ్ స్పాట్ మాత్రమే కాదు ... పర్యాటకంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది.

1.2000 సినిమాలకు పై మాటే

1.2000 సినిమాలకు పై మాటే

Image source:

పొల్లాచిలో ఇప్పటివరకు అన్ని భాషలలో కలిపి 2000 కు పైగా సినిమా చిత్రీకరణలు జరిగాయి. వీటికి ఎక్కువ భాగం తెలుగు, తమిళ ఇండస్ట్రీకు చెందిన సినిమాలు తీయటం గమనార్హం. సంవత్సరం పొడవునా పొల్లాచి ప్రాంతం వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పటికి వర్షాకాలం, వింటర్ సీజన్ పర్యాటకులకు సూచించదగినది. అందువల్లే ఇక్కడ ఆ సమయంలోనే షూటింగ్ లు కూడా ఎక్కవగా జరుగుతాయి.

2. ఏఏ తెలుగు సినిమాలు

2. ఏఏ తెలుగు సినిమాలు

Image source:


పొల్లాచి లో షూటింగ్ జరుపుకున్న కొన్ని తెలుగు సినిమా వివరాలు ఇలా ఉన్నాయి - మిస్టర్ పర్ఫెక్ట్, గోవిందుడు అందరివాడేలే, అ ..ఆ..., కెవ్వు కేక, గబ్బర్ సింగ్, గౌరవం, దమ్ము, రెబెల్, బృందావనం ఇలా ఎన్నో సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు. కేవలం పొల్లాచే కాకుండా దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా సినీ పరిశ్రమకు కావాల్సిన అన్ని హంగులూ సమకూరుస్తున్నాయి. దీంతో మన వాళ్లు అక్కడకు వాలిపోతున్నారు.

3. దగ్గరగా ఉన్న పట్టణాలు కూడా

3. దగ్గరగా ఉన్న పట్టణాలు కూడా

Image source:


ముఖ్యంగా నేగమం అనే కుగ్రామం. పొల్లాచి కి 14 కి. మీ ల దూరంలో ఉన్న చిన్న పట్టణం. చుట్టూ కొబ్బరి తోటలు, పశ్చిమ కనుమలు, సుందరమైన దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. పట్టణ ప్రాంతమయినందు వల్ల సినిమాహాల్లు, కిరాణాషాపులు తదితర లొకేషన్లకు ఈ పట్టణాన్ని మన దర్శకులు, నిర్మాతలు ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టే స్థానికులు కూడా సహకరిస్తున్నారు.

4. పశ్చిమ కనుమలకు అతి సమీపం

4. పశ్చిమ కనుమలకు అతి సమీపం

Image source:


పొల్లాచి ప్రదేశం పశ్చిమ కనుమలకు అతి సమీపంలో ఉండటంతో సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే సినిమా షూటింగ్ కు సంవత్సరం పొడవునా ఇక్కడ జరుగుతాయి.ప్రకృతి స్వర్గం గా అలరారుతున్న పొల్లాచి ప్రాంతం చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు, సెలయేర్లు, డ్యామ్ లు, దేవాలయాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురి తో పాటు మరికొన్ని పర్యాటక కేంద్రాలు, వినోద కేంద్రాలు ఉన్నాయి.

5. అనేక అభయారణ్యాలు

5. అనేక అభయారణ్యాలు

Image source:


ఈ శాంక్చురి అన్నామలై కొండల శ్రేణిలో కలదు. ఇది 958 చ.కి.మీ. ల మేర విస్తరించి ఉన్నది. సముద్రమట్టానికి 1400 మీటర్ల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పార్క్ లో వివిధ రకాల మొక్కలు, వన్యజంతువులు మరియు పక్షులు కలవు. వన్య జంతువులు : చిరుత, లేళ్ళు, ఏనుగులు, పులులు మొదలుగునవి. దీనితో పాటు చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి పొల్లాచి పట్టణానికి 60 కి. మీ ల దూరంలో కలదు. ఇక్కడ కూడా వన్యజంతవునులను, పక్షులను చూడవచ్చు.

6. జలాశయాలు

6. జలాశయాలు

Image source:

అజియార్ డ్యాం అజియార్ డ్యాం ఇక్కడ చూడవలసిన డ్యాం లలో మొదటిది మరియు పొల్లాచి ఆకర్షణలో ప్రధానమైనది. ఈ డ్యాం పొల్లాచ్చి కి 24 కి.మీ ల దూరంలో కలదు. డ్యాం ఎత్తు సుమారు 81 మీటర్లు. డ్యాం వద్ద బోటు షికారు సౌకర్యం ఉన్నది. ఇతర డ్యాంలు పొల్లాచి లో చూడవలసిన ఇతర డ్యాం లు : నిరార్ డ్యాం, మీన్కర డ్యాం, శోలైయార్ డ్యాం, త్రిమూర్తి డ్యాం మరియు పెరువారిపల్లం డ్యాం లు. జలశయాల బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు ఇక్కడ పరిస్థితులు చాలా బాగుంటాయి.

7. దేవాలయాలు.

7. దేవాలయాలు.

Image source:


ఆలగునాచి అమ్మన్ ఆలయం ఆలగునాచి అమ్మన్ ఆలయం పొల్లాచ్చికి 80 కి. మీ ల దూరంలో కలదు. దీనిని క్రీ.శ. 16 వ శతాబ్దంలో నాటి కోయంబత్తూర్ పరిపాలనాధికారులు నిర్మించారు. దేవాలయంలో ప్రధాన దేవత ఆలగునాచి అమ్మవారు. అదే విధంగా మరియమ్మన్ ఆలయం పొల్లాచి పట్టణానికి మధ్యలో మరియమ్మన్ ఆలయం కలదు. ఈ దేవాలయం 300 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు. టెంపుల్ లో మాసి రధోత్సవం ఉత్సవం ఘనంగా జరుపుతారు.

8. రాముడు దర్శించిన దేవాలయం

8. రాముడు దర్శించిన దేవాలయం

Image source:


ఆరవు తిరుకొయిల్ పొల్లాచి కి 25 కి. మీ ల దూరంలో ఆరవు తిరుకొయిల్ ఆలయం కలదు. దీనినే 'మనసాక్షి' ఆలయం అని కూడా పిలుస్తారు. దీనిని యోగిరాజ్ వేథతిరి మహర్షి ఒక ధ్యాన కేంద్రం గా నిర్మించారు. మాసాని అమ్మన్ తిరుకొయిల్ ఈ టెంపుల్ ను రాజు మాసాన్ ఒక బాలిక పేరుమీద నిర్మించాడు. దేవాలయానికి వచ్చే భక్తులకు సరిగ్గా మూడు వారాలలో కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉన్నది. సీతను అన్వేషిస్తూ రాముడు ఈ టెంపుల్ ను సందర్శించి ధ్యానం చేశారని చెబుతారు.

9. చోళుల కాలం నాటివి కూడా

9. చోళుల కాలం నాటివి కూడా

Image source:


సుబ్రమణ్యస్వామి తిరుకొయిల్ ఈ టెంపుల్ ను కొంగు చోళులు 700 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇందులో ప్రధాన దైవం సుబ్రమణ్యస్వామి లేదా మురుగన్. మహాశివుని విగ్రహం కూడా దేవాలయంలో కలదు. పురాతన శైలి శిల్పాలను, దేవాలయాలను అభిమానించే భక్తులకు ఇది ప్రసిద్ధి. అదే విధంగా సులక్కల్ మరియమ్మన్ ఆలయం ఈ టెంపుల్ పొల్లాచి కి 15 కి. మీ ల దూరంలో కలదు. ఈ దేవాలయల్లోనే ఎక్కవ శాతం షూటింగ్ లు జరుగుతుంటాయి.

10. శబరిమలకు దగ్గరి పోలిక

10. శబరిమలకు దగ్గరి పోలిక

Image source:


పొల్లాచి అయ్యప్పన్ ఆలయం పొల్లాచి అయ్యప్పన్ ఆలయానికి శబరిమల అయ్యప్ప ఆలయానికి దగ్గరి పోలికలు ఉంటాయి. దీనిని 1970 లో నిర్మించారు. భక్తులు ప్రతిరోజూ గుడికి వచ్చి హోమాలు, పూజలు జరుపుతుంటారు. ఇందులో అనేక దేవతల విగ్రహాలు కలవు. అయినా అయ్యప్ప ప్రత్యేకం. ఇక్కడకు వెళితే కోరిన కోర్కెలు తీరుతాయని చెబుతారు. అంతే కాకుండా టెంకాలయను భక్తులు ఎక్కువగా మొక్కులుగా చెల్లిస్తుంటారు.

11. త్రిమూర్తి హిల్స్

11. త్రిమూర్తి హిల్స్

Image source:


త్రిమూర్తి హిల్స్ దీనికి ఒక పురాణగాథ ఉంది. అదేమిటంటే, అథారి మహర్షి, అయన భార్య అనసూయ ఈ కొండపై నివశించేవారు. ఒకనాడు మహర్షి తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు అయన ముందు ప్రత్యక్షమై, అనసూయను నగ్నంగా తమకు ఆహారం ఇవ్వమని కోరగా, ఆమె వారికి పసిపిల్లలను చేసి నగ్నంగా పాలను అందించింది. అమరలింగేశ్వర దేవాలయం, త్రిమూర్తి జలపాతం మరియు త్రిమూర్తి డ్యాం. మంకీ ఫాల్స్ ఈ జలపాతాలు పొల్లాచి కి 30 కి.మీ ల దూరంలో ఉన్నాయి.

12 దర్గాలు కూడా

12 దర్గాలు కూడా

Image source:


అంబరంపాలయం దర్గా పొల్లాచి కి 5 కిలోమీటర్ల దూరంలో అంబరంపాలయం దర్గా కలదు. దీనినే చాంద్ షా వలి అల్లాహ్ దర్గా అని కూడా పిలుస్తారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు మతసామరస్యానికి అతీతంగా దర్గా ను సందర్శిస్తారు. దీనికి దగ్గరగానే రంబికుళం టైగర్ రిజర్వ్ పరంబికుళం నేషనల్ పార్క్ తమిళనాడులోని అన్నామలై పర్వతాలు, కేరళలోని నెల్లియంపతి శ్రేణుల మధ్య లోయలో విస్తరించి ఉన్నది. అభయారణ్యంలో అద్భుతమైన ట్రెక్కింగ్ ట్రయల్స్ కలవు.

13. ఎక్కడ ఉండాలి

13. ఎక్కడ ఉండాలి

Image source:


పొల్లాచి లో బస చేయటానికి పర్యాటకులకు చక్కటి హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఇక దగ్గర్లో కూడా అనేక పట్టణాలు కూడా ఉన్నాయి. కోయంబత్తూర్ - 44 కి. మీ, వాల్పరై - 64 కి.మీ, తిరుపూర్ - 65 కి.మీ, తింగలూర్ - 103 కి.మీ, ఈరోడ్ - 127 కి.మీ, కోటగిరి - 128 కి.మీ.

14. ఎలా చేరుకోవాలి ?

14. ఎలా చేరుకోవాలి ?

Image source:


వాయు మార్గం : పొల్లాచి కి సమీపాన 40 కి. మీ ల దూరంలో కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ కలదు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని పొల్లాచి చేరుకోవచ్చు.

రైలు మార్గం : పొల్లాచి లో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళు స్టేషన్ లో ఆగుతాయి.

రోడ్డు మార్గం : కోయంబత్తూర్ నుండి చక్కటి రోడ్డు వ్యవస్థ కలిగి ఉంటుంది పొల్లాచి. చెన్నై, వాల్పరై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుండి పొల్లాచికి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.