Search
  • Follow NativePlanet
Share
» »పొన్ముడి - గుర్తుండిపోయే పర్వత ప్రాంతం !

పొన్ముడి - గుర్తుండిపోయే పర్వత ప్రాంతం !

By Mohammad

పొన్ముడి కేరళ రాష్ట్రంలోని అందమైన శిఖరం. ఇది సముద్రమట్టానికి 1100 మీటర్ల ఎత్తులో కలదు. రాజధానైన తిరువనంతపురం నగరం నుండి 55 కిలోమీటర్ల దూరంలో, పడమటి కనుమల శ్రేణిలో కలదు. ఆహ్లాదకరమైన వాతావరణం, సుందరమైన ప్రదేశాలు పొన్ముడి ని ఒక హిల్ స్టేషన్ గా మార్చాయి.

కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పక్షి అభయారణ్యాలు !

ఈ పర్వత ప్రాంతంలోని విహారంలో మీకు ఎన్నో లోయలు, సరస్సులు, సుగంధ ద్రవ్యల తోటలు కనపడతాయి. త్రివేండ్రం నుండి పొన్ముడి హిల్ స్టేషన్ కు వెళ్లే మార్గం సుందరమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంటుంది. వ్యూ పాయింట్లు అద్దిరిపోతాయి. రోడ్డు మార్గం కూడా మెలికలు తిరిగి ఉంటుంది. కొద్దిపాటి సాహసాలు చేసేవారికి ట్రెక్కింగ్, హైకింగ్ ప్రదేశాలు కూడా కలవు. ఇక్కడి వ్యూ పాయింట్లు ఒకసారి గమనిస్తే ..

సుల్తాన్ బతేరి - కొండల మధ్యలో పరవశం !

ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు

మలయాళంలో 'పోనా' అంటే బంగారం అని, 'ముడి' అంటే శిఖరం అని అర్థం. ఇక్కడి ప్రకృతి అందాలు బంగారంతో కూడా వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తాయట. అందుకే ఈ శిఖరానికి ఆ పేరు.

చిత్రకృప : Thejas Panarkandy

మలుపులు

మలుపులు

త్రివేండ్రం నుండి పొన్ముడి చేరుకోవాలంటే మొత్తం 22 మార్గాలు ఉంటాయి. మార్గం కూడా సన్నగా ఉంటుంది. బైక్ పై వెళితే థ్రిల్లింగ్ గా ఉంటుంది. దారి పొడవునా సుందర దృశ్యాలు చూడవచ్చు.

చిత్రకృప : Thejas Panarkandy

సహజ అందాలు

సహజ అందాలు

పొన్ముడి చుట్టుపక్కల అనేక సరస్సులు, అందమైన కొండలు, తేయాకు కొండలు కలవు. ఫోటో గ్రాఫర్లకు ఇదొక అద్భుత ప్రదేశం. ఎకో పాయింట్లు, అభయారణ్యం, ట్రెక్కింగ్ మార్గాలు పొన్ముడి ఇతర ఆకర్షణలు.

చిత్రకృప : Satish Somasundaram

గోల్డెన్ వాలీ

గోల్డెన్ వాలీ

విశ్రాంతి కోరి వచ్చే పిక్నిక్ ప్రియులకు గోల్డెన్ వాలీ సరైన ప్రదేశం. చిన్న చిన్న నీటి ప్రవాహాలు, చల్లని నీరు, పచ్చని చెట్లతో ఈ వ్యాలీ ప్రశాంతత చేకూరుస్తుంది.

చిత్రకృప : Thejas Panarkandy

క్రీడలు

క్రీడలు

వ్యాలీ గుండా ప్రవహించే నది అద్భుతంగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు నీటి క్రీడలు ఆచరించవచ్చు. హనీమూన్ జంటలకు కూడా ఈ వ్యాలీ అనుకూలంగా ఉంటుంది. సమీపంలో ఎటువంటి షాప్ లు ఉండవు. కనుక మీరే ఆహారాలు, త్రాగు నీరు వెంట తీసుకొని వెళ్ళాలి.

చిత్రకృప : Satish Somasundaram

పెప్పర వన్య ప్రాణుల అభయారణ్యం

పెప్పర వన్య ప్రాణుల అభయారణ్యం

ఈ శాంక్చురి త్రివేండ్రం - పొన్ముడి రోడ్డుపై కలదు. ఈ ప్రదేశం కొండలమయం. చూడటానికి చుట్టూ కొండలు, శిఖరాలు మాత్రమే కనిపిస్తాయి.

చిత్రకృప : Shishirdasika

వన్య జంతువులు

వన్య జంతువులు

శాంక్చురి లో చూదగినవి : పులి, చిరుత, ఏనుగు, ఎలుగుబంటి, కొండముచ్చు కోతులు, నీలగిరి ధార్ మొదలైనవి కలవు. డ్యాం కూడా పర్యాటక ప్రేమికులను ఆకర్షిస్తుంది.

చిత్రకృప : http://www.kseb.in/

డీర్ పార్క్

డీర్ పార్క్

మినీ జూ, పొన్ముడి శిఖరానికి సమీపంలో ఉంటుంది. ట్రెక్కింగ్ మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. బారాసింఘా అనే అరుదైన జింక ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పక్కనే అడవి ఉండటంతో అడపా దడపా జంతువులు వచ్చి వెళుతుంటాయి. సంవత్సరం పొడవునా జూ తెరిచే ఉంటారు.

చిత్రకృప : Jebin Daniel Varghese

పక్షులు

పక్షులు

పొన్ముడి శిఖరం ట్రెక్కింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. అయినా వర్షాకాలం సూచించదగినది కాదు. పొన్ముడి లో అరుదైన పక్షులు విహరిస్తుంటాయి. మీ వద్ద కెమెరా ఉంటె వెంటనే బంధించండి.

చిత్రకృప : Thejas Panarkandy

 అగస్త్య కూడం

అగస్త్య కూడం

పడమటి కనుమల శ్రేణిలో అతి పొడవైన శిఖరం అగస్త్య కూడం. పొన్ముడి వెళ్లే సాహసికులు ఇది తప్పక చూడాలి. ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ సౌకర్యాలు కలవు. అయితే, ట్రెక్కింగ్ కు అటవీ శాఖ ముందస్తు అనుమతి తీసుకోవాలి.

చిత్రకృప : Unbound Rover

ఎప్పడు వెళ్ళాలి ?

ఎప్పడు వెళ్ళాలి ?

పొన్ముడి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ హిల్ స్టేషన్ కు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాలంటే త్రివేండ్రం బేస్ క్యాంపు గా వ్యవహరిస్తోంది.

చిత్రకృప : Maheshsudhakar

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

పొన్ముడి చేరాలంటే, త్రివేండ్రం లేదా తిరువనంతపురం లోని తంపనూరు బస్ స్టాండ్ నుండి, నడుమంగడ మరియు వితురా పట్టణాల నుండి నిర్దేశిత వేళలలో బస్సులు దొరుకుతాయి. పొన్ముడి సమీపాన తిరువనంతపురం రైల్వే స్టేషన్, తిరువనంతపురం విమానాశ్రయం కలవు.

చిత్రకృప : Easa Shamih

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X