Search
  • Follow NativePlanet
Share
» »అందాల పాలక్కాడ్ - అపురూప ప్రదేశాలు !!

అందాల పాలక్కాడ్ - అపురూప ప్రదేశాలు !!

అందం అనేది చూసే వారి కన్నులను బట్టి ఉంటుందనేది పాలక్కాడ్ పర్యటనలో నిరూపణ అయ్యే అంశం. కేరళ - తమిళనాడు సరిహద్దులలో కల ఈ పాలక్కాడ్ జిల్లా అద్వితీయమైన ప్రకృతి ఆకర్షణలు కలిగి వుంది.

పాలక్కాడ్ పెద్ద నగరం ఏమీ కాదు. కాని ఒకసారి అక్కడ పర్యటిస్తే చాలు ఆ ప్రదేశ అందాలకు ముగ్దులవుతారు. స్థానికుల ఆత్మీయతలకు పొంగిపోతారు. ప్రశాంతమైన వాతావరణంలో సేద దీరాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రదేశం. టూరిస్ట్ లు పాలక్కాడ్ కోటలో తిరగవచ్చు.

లేదా సాహసికులైతే , పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాన్క్చురి లేదా సైలెంట్ వాలీ నేషనల్ పార్క్ లకు వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ ల తో పాటు వన్య జంతువులను కూడా చూడవచ్చు. ఇక్కడ అనేక దేవాలయాలు కలవు. కల్పతి టెంపుల్, జైన్ టెంపుల్ లు తప్పక చూడదగినవి.

పాలక్కాడ్ ఎలా చేరాలి ?

పాలక్కాడ్ ఎలా చేరాలి ?

పాలక్కాడ్ రైల్వే కూడలి ప్రధాన నగరాలైన మద్రాస్, కోల్కతా వంటి నగరాలకు కలుపబడి వుంది. సేలం - కన్యాకుమారి నేషనల్ హై వే 47 మరియు పాలక్కాడ్ - కోజికోడ్ నేషనల్ హై వే 213 లు ఇక్కడ కలుస్తాయి. కోయంబత్తోర్ నుండి బస్సు లు కలవు. సుమారు 60 కి. మీ. ల దూరం వుంటుంది.

Photo Courtesy: Dhruvaraj S

పాలక్కాడ్ కోట

పాలక్కాడ్ కోట

పాలక్కాడ్ కోటను టిప్పు కోట అని కూడా పిలుస్తారు. పాలక్కాడ్ జిల్లాలో ఇది ఒక ప్రసిద్ధ హెరిటేజ్ భవనం. మైసూరు పాలకులకు ఈ కోట ఒక ప్రధాన మిలిటరీ కేంద్రంగా వుండేది. ఈ కోట లో ఒక హనుమాన్ టెంపుల్ , యుద్ధ మృత వీరుల స్మారకం జిల్లా సబ్ జైలు మరియు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లు కలవు.

Photo Courtesy: Me haridas

పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాన్క్చురి

పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాన్క్చురి

పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సంక్చురి ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షనలలో ఒకటి. ఇది పడమటి కనుమలలోని దక్షిణ శ్రేణు లలో కలదు. పర్యాటకులు ఇక్కడ అరుదైన వృక్షాలను, జంతువులను చూడవచ్చు. సాన్క్చురి లో అద్భుత ట్రెక్కింగ్ రూట్లు కలవు. పర్యాటకులు అధికారులనుండి ముందస్తు అనుమతులు పొంది, ఈ ప్రదేశంలో సంచరించవచ్చు.

Photo Courtesy: Suriyakumars

జైన్ టెంపుల్

జైన్ టెంపుల్

జైన్ టెంపుల్ ఒక చారిత్రక స్మారకం. ఇది పాలక్కాడ్ యొక్క సాంస్కృతిక భిన్నత్వం తెలుపుతుంది. దీనినే చంద్రనాథ టెంపుల్ అంటారు. ఇది దేశంలోని ప్రసిద్ధ జైన టెంపుల్స్ లో ఒకటి. ఈ దేవాలయ శిల్ప శైలి అద్వితీయంగా వుంటుంది. జైన తీర్థంకరుల చిత్రాలు, యక్షునుల చిత్రాలు, చంద్రనాతాన్, విజయలక్ష్మి నాథన్ , రిషభ మరియు పద్మావతి దేవుళ్ళ విగ్రహాలను టెంపుల్ లోపల చూడవచ్చు.

Photo Courtesy: Shijualex

కన్జీరపూజ

కన్జీరపూజ

కన్జీరపూజ పట్టణంలో ఒక ప్రధాన ఆకర్షణ. ఇక్కడే డాం వెనుక అందమైన పడమటి కనుమలు చూడవచ్చు. ఈ డాం మరియు రిజర్వాయర్ లు శిరువాని నది పై నిర్మించారు. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కంజిర పూజ డాం కుటుంబ విహార యాత్రలకు, ఒక రోజు పిక్నిక్ లకు, స్టడి టూర్లకు అనువైనదిగా వుంటుంది. ఈ ప్రదేశ సుందర దృశ్యాలు ప్రకృతి ప్రియులను మరల మరల వచ్చేలా చేస్తాయి.

Photo Courtesy: Shijualex

కల్పతి టెంపుల్

కల్పతి టెంపుల్

కల్పతి దేవాలయాన్ని కల్పతి విశ్వనాథ స్వామి గుడి అని కూడా అంటారు. ఇది కేరళలోని పురాతన శివ టెంపుల్స్ లో ఒకటి. కేరళ లోని ప్రసిద్ధ టెంపుల్స్ లో చేసే ఉత్సవాలలో కల్పతి రథోత్సవం ఒకటి. దీఇని ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో చేస్తారు. ఈ రదోత్సవానికి లక్షలాది యాత్రికులు పాలక్కాడ్ వస్తారు.
Photo Courtesy: Shahinmusthafa

పోతుండి డాం

పోతుండి డాం

పోతుండి డాం ఒక సాగునీటి ఆనకట్ట. ఇది పాలక్కాడ్ జిల్లా లో ఒక చిన్న గ్రామం సమీపంలో కలదు. ఇది అసాధారణ రీతిలో బెల్లం మరియు సున్నం లతో నిర్మించబడినది. ఇది ఇండియా లో రెండవ మట్టి ఆనకట్ట.

Photo Courtesy: Veera.sj

సైలెంట్ వాలీ నేషనల్ పార్క్

సైలెంట్ వాలీ నేషనల్ పార్క్

సైలెంట్ వాలీ నేషనల్ పార్క్ ఒక దట్టమైన వర్షపు అడవి. ఎన్నో అరుదైన వృక్ష జాతులు, వన్య జీవులు చూడవచ్చు. ఇది పాలక్కాడ్ నుండి 80 కి. మీ. ల దూరం వుంటుంది. దీనిని ఎల్లపుడూ పచ్చగా వుండే అడవి అని కూడా అంటారు. ఇది పడమటి కనుమలో ఒక ప్రధాన రక్షిత ప్రదేశం. అటవీ తెగల ప్రజలకు నివాసం.

Photo Courtesy: Kalyanvarma

ఒట్ట పాలం

ఒట్ట పాలం

ఒట్ట పాలెం పాలక్కాడ్ జిల్లాలో ఒక పెద్ద పట్టణం. భరతపూజ నది ఒడ్డున కలదు. ఈ చుట్టపట్ల కల ప్రధాన ఆకర్షనలలో కిల్లిక్కురుస్సిమంగళం ఒకటి. ఇది కుంజన్ నంబియార్ యొక్క జన్మస్థలం. ఈయన ఒక ప్రసిద్ధ కవి. ఒత్తంతుల్లాల్ అనే ఒక నూతన నృత్య రూపకం ఈయన కనిపెట్టారు. పర్యాటకులు ఇక్కడ కేరళ లోని నృత్యాలైన కథాకళి, భరతనాట్యం, కూడియాట్టం, మోహినియాట్టం వంటి వాటిలో శిక్షణ నిచ్చే నృత్య శాలను చూడవచ్చు. ఈ నృత్య శిక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది.

Photo Courtesy: Adams Homestay Cochin

కోయంబత్తూర్ హోటల్స్ కు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X