Search
  • Follow NativePlanet
Share
» »యూ ఆకారపు హవేలి ఎక్కడ ఉందో తెలుసా?

యూ ఆకారపు హవేలి ఎక్కడ ఉందో తెలుసా?

హైదరాబాద్‌లోని పురాని హవేలి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం.

పురాణి హవేలి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఓ ప్రముఖ ప్యాలెస్. ఇది నిజాం నవాబుల అధికారిక నివాసమని చెబుతారు. దీనిని హవేలి ఖడిమ్ అని కూడా పిలుస్తారని చెబుతారు. ఈ మహల్‌ నిర్మాణాన్ని క్రీస్తుశకం 1803లో ప్రారంభించి క్రీస్తుశకం 1829లో ముగించారని చరిత్ర చెబుతోంది. ఎంతో అందమైన ఈ ప్యాలెస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం...

పురాని హవేలి, హైదరాబాద్

పురాని హవేలి, హైదరాబాద్

P.C: You Tube

మోమిన్ రాజవంశానికి చెందిన ఈ భవనాన్ని రెండవ నిజామ్ మీర్ నిజామ్ ఆలిఖాన్ తన వశం చేసుకొన్నాడు. ఈ భవనం వాస్తుశైలి యురోపియన్ వాస్తుశైలిని పోలి ఉంటుంది. సికిందర్ ఝూ అనే వ్యక్తి ఈ భవనం రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించారని చెబుతారు.

పురాని హవేలి, హైదరాబాద్

పురాని హవేలి, హైదరాబాద్

P.C: You Tube

చాలా పాతకాలానికి చెందిన బంగ్లా కావడం వల్ల దీనిని పురాణి హవేలి అని పిలుస్తారు. ఈ కట్టడం చట్టూ అనేక చిన్న కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాలు కూడా పురాణి హవేలిని నిర్మించే సమయంలోనే నిర్మించారని చెబుతారు. ప్రస్తుతం దక్షిణ వలయ జిల్లా ఎస్పీ (హైదరాబాద్)తో పాటు దక్షిణ వలయం టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయాలు ఈ భవనంలో ఉన్నాయి.

పురాని హవేలి, హైదరాబాద్

పురాని హవేలి, హైదరాబాద్

P.C: You Tube

దీనితో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనం చూడటానికి ఆంగ్ల అక్షరమాల యు ఆకారంలో ఉంటుంది. అదే విధంగా పై నుంచి చూస్తే ఒక పక్షి రెండు రెక్కలను చాచుకుని ముందుకువ వెలుతున్న ఆకారంలో ఈ భవనం కనిపిస్తుంది.

పురాని హవేలి, హైదరాబాద్

పురాని హవేలి, హైదరాబాద్

P.C: You Tube

ఈ భవనంలో ప్రపంచంలోనే అతి విశాలమైన వాడ్రోబ్ ఈ భవనంలో ఉంది. అదే విధంగా చేతితో ఆపరేట్ చేసే ఎలివేటర్ ఈ భవనంలో ఉంది. అందువల్లే ఈ భవనాన్ని చూడటానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

పురాని హవేలి, హైదరాబాద్

పురాని హవేలి, హైదరాబాద్

P.C: You Tube

హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన చివరి నిజాంకు చెందిన వస్తుసంగ్రహాలయం కూడా ఈ ప్యాలెస్‌లోనే ఉంది. అంతేకాకుండా ఈ ప్యాలెస్‌ను ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేరు రంగాల్లో ఉద్యోగాలు అశిస్తున్నవారికి శిక్షణ ఇవ్వడానికి కూడా వినియోగిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X