Search
  • Follow NativePlanet
Share
» »ఈ కోటను చూస్తే తెలంగాణవాసుల రక్తం మరుగుతుంది?

ఈ కోటను చూస్తే తెలంగాణవాసుల రక్తం మరుగుతుంది?

రాచకొండ కోట గురించి కథనం.

తెలంగాణాలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. అందుల్లో ధార్మిక, చారిత్రక ప్రాంతాలతో పాటు వీకెండ్ సమయంలో సరదాగా గడపడానికి వీలయ్యేవి కూడా ఎన్నో. అందులో తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే రాచకొండ కోటకు సంబంధించిన వివరాలు మీ కోసం....

రాచకొండ కోట, తెలంగాణ

రాచకొండ కోట, తెలంగాణ

P.C: You Tube

రాచకొండ కోట తెలంగాణ చరిత్రకు నిలువుటద్దం. ఇది తెలంగాణలోని రాచకొండలో ఉంది. ఈ రాచకొండ కోటను 14వ శతాబ్దంలో పద్మనాయక వెలమ అనే రాజు నిర్మించారు. ఈ రాచకొండ నిర్మాణం ఆనాటి యుద్ధ తంత్రానికి ప్రత్యక్ష నిదర్శనం.

రాచకొండ కోట, తెలంగాణ

రాచకొండ కోట, తెలంగాణ

P.C: You Tube

ఈ రాచకొండను రాజధానిగా చేసుకొని రేచర్ల నాయకులు క్రీస్తుశకం 1325 నుంచి 1474 వరకూ మొత్తం తెలంగాణాను పరిపాలించాడు. రాచకొండ పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

రాచకొండ కోట, తెలంగాణ

రాచకొండ కోట, తెలంగాణ

P.C: You Tube

రాత కనిపెట్టడానికి ముందు నుంచే ఇక్కడ గుహల్లో ఆదిమ మానవులు ఉండేవారన్నదానికి నిదర్శనంగా ఎన్నో వస్తువులు ఇక్కడ బయటపడ్డాయి. ఈ రాచకొండ ఉన్న గొట్ట మీ చాళుక్య యుగం నాటి వైష్ణవాలయం ఉంది.

రాచకొండ కోట, తెలంగాణ

రాచకొండ కోట, తెలంగాణ

P.C: You Tube

దీనికి సమీపంలోనే అతి పెద్ద రాతి గుడ్ల మధ్య సహజసిద్ధమైన గుహ ఉంది. త్రిభుజాకారంలో ఈగుహ ముఖ ద్వారం ఉంటుంది. ఈ గుహలో సుమారు 200 మంది కుర్చొనడానికి వీలవుతుంది.

రాచకొండ కోట, తెలంగాణ

రాచకొండ కోట, తెలంగాణ

P.C: You Tube

అంతేకాకుండా ఈ గుహలో ఆనాటి ఆదిమ మానవులు చిత్రించిన ఎన్నో చిత్రాలను మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పటికీ పురావస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

రాచకొండ కోట, తెలంగాణ

రాచకొండ కోట, తెలంగాణ

P.C: You Tube

నిత్యం ఏదో ఒక కొత్త వస్తువు ఇక్కడ దొరుకుతూనే ఉంది. ఇదిలా ఉండగా నిజామ్ షా నేత`త్వంలోని బహమనీయులు ఓరుగల్లును క్రీస్తుశకం 1475 లో ఆక్రమించారు. ఈ నేపథ్యంలో రాచకొండ కూడా అదే సమయంలో బహమనీ సుల్తానుల వశం అయ్యింది.

రాచకొండ కోట, తెలంగాణ

రాచకొండ కోట, తెలంగాణ

P.C: You Tube

రాచకొండతో పాటు దేవరకొండ రాజులు అటు పై బహమనీ సుల్తానులకు సామంతులుగా ఉన్నారు. అటు పై విజయనగర రాజులతో పాటు ఒరిస్సా గజపతి రాజులకు వీరు సామంతులుగా ఉంటూ వచ్చారు.

రాచకొండ కోట, తెలంగాణ

రాచకొండ కోట, తెలంగాణ

P.C: You Tube

ఈ కోట హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి మొదట చౌటుప్పల్‌కు వెళితే అక్కడి నుంచి తిరిగి 28 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఈ రాచకొండ కోట వస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X