Search
  • Follow NativePlanet
Share
» »చిటపట చినుకులు పడే సమయంలో పర్యాటకమా? ఈ టిప్స్ మీ కోసం

చిటపట చినుకులు పడే సమయంలో పర్యాటకమా? ఈ టిప్స్ మీ కోసం

వర్షాకాలంలో పర్యాటకం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కథనం.

చిటపట చినుకులు పడే సమయంలో మనసుకు నచ్చిన వారితో కలిసి నచ్చిన ప్రదేశాలను చుట్టి రావాలని ఎవరికి ఉండదు చెప్పండి? అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఆహ్లాకరమైన ప్రయాణం కాస్తా ఆందోళకరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి పర్యాటకం మధ్యలోనే మీరు వెనుతిరిగి రావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే, పర్యటన మొత్తం సంతోషకరంగా సాగిపోవాలి. ఇందుకోసం కొన్ని చిట్కాలను పాటిస్తే పర్యటన మొత్తం హాయ్ హాయ్ గా జాలీ జాలీ జాలీగా సాగిపోతుంది. అటువంట చిట్కాల్లో ముఖ్యమైనవి మీ కోసం...

రెపెలెంట్

రెపెలెంట్

P.C: You Tube

వర్షాకాలంలో దోమల బెడద కొంత ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ సమయంలోపర్యాటకానికి వెళ్లేవారు తప్పక రెప్పలెంట్ దగ్గర ఉంచుకోండి. తప్పకుండా మంచి బ్రాండ్ కు సంబంధించిన మినరల్ వాటర్ ను తాగండి. అవకాశం ఉం్టే తప్పకుండా నీటిని బాగా వేడి చేసి వడగట్టి చల్లారిన తర్వాత తాగండి.

రెయిన్ కోట్, గొడుగు

రెయిన్ కోట్, గొడుగు

P.C: You Tube

రెయిన్ కోట్, గొడుగు తప్పక ఉండేలా చూసుకోండి. వర్షాకాలంలో చిరుతిళ్లు ఎక్కువగా తినాలని మన మనస్సుతో పాటు పొట్ట కూడా చెబుతూ ఉంటుంది. అయితే వర్షాకాలంలో చిరుతిళ్లు కంటే సూప్ లు మేలు. శుభ్రంగా ఉండే హోటల్స్ లోనే సుమా.

వాతావరణ వివరాలు

వాతావరణ వివరాలు

P.C: You Tube

వాతావరణ పరిస్థితులు, వర్షపాతం వివరాలు తప్పక తెలుసుకొంటూ ఉండాలి. ఆన్ లైన్ లో ఈ సమాచారం ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ప్రయాణ ప్రణాళికను మార్చుకొంటూ ఉండటం మంచిది.

స్లీపింగ్ బ్యాగ్

స్లీపింగ్ బ్యాగ్

P.C: You Tube

ఈ వర్షాకాలంలో వారాంతాల్లో చాలా మంది ట్రెక్కింగ్ వెలుతూ ఉంటారు. కొన్ని సార్లు ఒక అరగంట లేదా గంట సేపు నిద్రపోవాలనిపిస్తుంది. ఆ సమయంలో స్లీపింగ్ బ్యాక్స్ ఉండేలా చూసుకోండి. ఈ స్లీసింగ్ బ్యాగులు ఆన్ లైన్ లో విరివిగా దొరుకుతున్నాయి.

యాప్

యాప్

P.C: You Tube

ప్రక`తి పురివిప్పి నాట్యమాడే ఈ వర్ష బుుతువు లో ఆ అందాలను ఆస్వాధించడానికి చాలా మంది ఒంటరి ప్రయాణాలను ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం వియ్ ట్రావెల్ సోలో (wetravelsolo) యాప్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అనేక సబ్ ఫీచర్లు ఉన్న ఈ యాప్ దగ్గర ఉంటే జర్నీ మరింత సౌకర్యవంతంగా సాగి పోతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X