• Follow NativePlanet
Share
» »రాముడు తాటకిని చంపినది...విష్ణువు చింత చెట్టులో దొరికినది ఇక్కడే

రాముడు తాటకిని చంపినది...విష్ణువు చింత చెట్టులో దొరికినది ఇక్కడే

Written By: Beldaru Sajjendrakishore

తాడిపత్రిని విజయనగర సామ్రాజ్యకాలంలో టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ, గండికోటసీమ గాను పిలిచేవారు. అటు పై తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ వుంది .దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రము అనే పేరు కూడావుంది. పూర్వం ఈ ప్రాంతములో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని,తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు. ఇక్కడే చింత చెట్టు తొర్రలో వెంకటరమణ స్వామి దొరికాడని ప్రతీతి. ఇన్ని విశిష్టతలు కలిగిన తాడిపత్రి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ఇందుకు సంబంధించిన కథానం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1.అనంతపురం జిల్లాలో

1.అనంతపురం జిల్లాలో

Image source

తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణము. అనంతపురం నుంచి 55 కి.మీ,కడపనుంచి 104 కి.మీ,బెంగుళూరు నగరంనుంచి 250కి.మీ దూరంలో ఉంది.

2.మొదట తాటిపల్లి

2.మొదట తాటిపల్లి

Image source

మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ వుంది.దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రము అనే పేరు కూడావుంది.

3. తాటకికి సంహరించడం వల్లే

3. తాటకికి సంహరించడం వల్లే

Image source

పూర్వం ఈ ప్రాంతములో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని,తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు.

4. చింత చెట్టు తొర్రలో

4. చింత చెట్టు తొర్రలో

Image source

ప్రస్తుతం చింతల వెంకట రమణస్వామి ఆలయం ఉన్న స్థలంలో చాలా ఏళ్ల క్రితం ఉన్న ఒక పెద్ద చింతచెట్టు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు వెళ్ళి చూడగా ఆ చెట్టు తొర్రలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది.

5. ఆయన కలలో కూడా

5. ఆయన కలలో కూడా

Image source

అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోట లో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కనబడి చింత చిట్ట తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు.

6. విజయనగర శైలి

6. విజయనగర శైలి

Image source

ఈ ఆలయాన్ని ప్రౌఢరాయల కాలంలో తాడిపత్రిని పాలిస్తున్న పెమ్మసాని రామలింగనాయుడు, తిమ్మనాయుడులు 1510- 1525 మధ్యలో నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో వున్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాశి నుండి శిల్పులను రప్పించారు.

7. చింత చెట్టు తొర్రలో దొరకడ వల్ల

7. చింత చెట్టు తొర్రలో దొరకడ వల్ల

Image source

ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం చింతచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, విగ్రహం చింతచెట్టు తొర్రలో దొరకడం వల్ల ఇక్కడి స్వామిని చింతల తిరువేంగళ నాథ స్వామి అని పిలిచే వారు. క్రమంగా చింతల వేంకటేశ్వర స్వామి లేదా చింతల వేంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు.

8. థామస్ మన్రో బాగు చేయించాడు

8. థామస్ మన్రో బాగు చేయించాడు

Image source

కొంత శిథిలమైన కళ్యాణమంటపాన్ని క్రీ.శ.1800 ప్రాంతంలో అప్పటి కలెక్టర్ థామస్ మన్రో మరమ్మత్తులు చేయించి ప్రభుత్వ నిధులతో ఆలయ నిత్యపూజాదికాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాడు.

9. సూర్య కిరణాలు స్వామి వారిని తాకుతాయి

9. సూర్య కిరణాలు స్వామి వారిని తాకుతాయి

Image source

గర్భగుడిలోని మూల మూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా మూడు రోజుల పాటు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.

10. రాతి రధం గుండా ప్రవేశించి

10. రాతి రధం గుండా ప్రవేశించి

Image source

ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథంలోని రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలా ఏర్పాటు చేశారు.

11. 40 స్థంభాల పై

11. 40 స్థంభాల పై

Image source

దేవాలయ మంటపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంది. గోడలపై, స్తంభాలపైన రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కి ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామ స్వామి ఆలయం, పద్మావతీ దేవి ఆలయం ఉన్నాయి.

12. మరో విశిష్ట ఆలయం

12. మరో విశిష్ట ఆలయం

Image source

తాడిపత్రిలో ఉన్న మరో విశిష్టత కలిగిన ఆలయం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువున్నాడు. ఇక్కడ శివుడు లింగ రూపంలో ఉన్నాడు.

13. నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంటుంది

13. నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంటుంది

Image source

లింగం కింద ఎల్లప్పుడు నీరు బుగ్గ రూపంలో ఉద్భవిస్తుండటం వల్ల ఈ దేవాలయానికి బుగ్గ రామేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది.

14. ఎలా వెళ్లాలి

14. ఎలా వెళ్లాలి

Image source

అనంతపురం నుంచి తాడిపత్రికి ప్రతి అరగంటకు ఒక బస్ ఉంది. అదే విధంగా తాడిపత్రిలో రైల్వేస్టేషన్ కూడా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి తదిర ప్రాంతాల నుంచి ఇక్కడకు నిత్యం రైళ్లు వెలుతుంటాయి.

15. మరిన్ని చూడదగిన ప్రాంతాలు

15. మరిన్ని చూడదగిన ప్రాంతాలు

Image source

తాడిపత్రితో పాటు అనంతపురం జిల్లాలో ఎన్నో చూడదగిన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నయి. వాటిలో పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం, బెలూం గుహలు తదితరాలు ఉన్నాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి