Search
  • Follow NativePlanet
Share
» »శ్రావణ మాసంలోనే ఈ ఖిల్లా అందమైన ద్వారాలు పర్యాటకుల కోసం తెరుచుకొంటాయి.

శ్రావణ మాసంలోనే ఈ ఖిల్లా అందమైన ద్వారాలు పర్యాటకుల కోసం తెరుచుకొంటాయి.

తెలంగాణలోని రామనగర ఖిల్లా గురించిన కథనం.

శ్రావణ మాసానికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. ఈ శ్రావణ మాసంలో అనేక ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకొంటాయి. అందులో రామగిరి ఖిల్లా కూడా ఒకటి. రామగిరి ఖిల్లా తెలంగాణలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ ఖిల్లా చారిత్రాత్మకంగా కూడా అంతే ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. శ్రావణ మాసంలో ఈ కోట పై కొన్ని ఔషద మొక్కలు మొలుస్తాయి. వీటి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయుర్వేద వైద్యలు ఆ సమయంలో ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఇక ట్రెక్కింగ్ ప్రియులకు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఆహ్లాదకరమైన శ్రావణమాసంలో ఈ రామగిరి ఖిల్లాకు ఎక్కువ సంఖ్యలో వస్తారు. అందువల్లే రామగిరి ఖిల్లా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే శ్రావణమాసంలో మరింత అందంగా పర్యాటక ప్రియుల కోసం ఖిల్లాను తెరుస్తుంది. మరెందుకు ఆలస్యం ఈ వీకెండ్ లో ఓ రామగిరి ఖిల్లా పై ఓ లుక్ వేయండి.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

రామగిరి ఖిల్లా తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పర్యాటక కేంద్రం. ఇది అప్పటి శిల్పకళా సందకు నిలువెత్తు నిదర్శనం. రామగిరి కోట గురిజాల కమ్మవంశీయులు ఈ కోటను పరిపాలించాయి.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

శ్రీరామ చంద్రుడు వనవాస సమయంలో సీతా, లక్ష్మణ సమేతుడై రామగిరి దుర్గం పై విడిది చేసినట్లు చెబుతారు. ఆ శ్రీరాముడు శివలింగం ప్రతిష్టించినట్లు చెబుతారు.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

ఈ కోట పై సీత సమేత శ్రీరామ చంద్ర విగ్రహం, హనుమాన్ విగ్రహం, నంది విగ్రహం కూడా ఉంది. అందువల్లే ఈ రామగిరి పర్యాటక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా బాసిల్లుతోంది.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

దాదాపు 200 రకాలకు పైగా వనమూలికలను కలిగి ఉన్న ఈ ఖిల్లా ఆయుర్వేద వైద్యానికి మూల కేంద్రంగా ఉంది. చారిత్రాత్మిక నేపథ్యంగా కూడా రామగిరి కోట ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్ధిపరిచారని పరిచారని ఇక్కడి దొరికిన చరిత్రకారులు చెబుతారు. క్రీస్తు శకం 1158లో చాళుక్య గుండ రాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనపరుచుకున్నారు.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

రామగిరి ఖిల్లాను ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1195 వరకూ పరిపాలించినట్లు ఓరుగల్లు, మంత్రకూటమిల శాసనాలు తెలియజేస్తాయి. అనంతరం గురిజాల కమ్మవంశీయులు ఈ కోటను శత్రుదుర్భేధ్యమైన కోటగా నిర్మించారు.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

కాకతీయుల కాలంలో రామగిరి పై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతోంది. ఇక్కడ నిర్మించిన రాతి కట్టడం అప్పటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటుతాయి.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

రాతి పై చెక్కిన సుందర శిల్పాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తాయి. వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడంతో ప్రతి శ్రావణమాసంలో రామగిరి ఖిల్లా పై పర్యాటకుల సందడితో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

రామగిరి దుర్గం పై ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచి పోతారు. ఆయుర్వేదమైద్యులు ఈ ఖిల్లా పై విలువైన వనమూలికలను సేకరిస్తారు. కొన్ని వనమూలికలు ఈ సమయంలో మాత్రమే ఇక్కడ పెరుగుతాయి.

రామగిరి ఖిల్లా

రామగిరి ఖిల్లా

P.C: You Tube

రామగిరి దర్గం అంతర్భాగంలో సలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల కోట, మొఘల్ శాల, గజశాల చెక్కరబావి, సీతమ్మబావి, పసరుబావి, సీతమ్మ కొలను తదితర ప్రాంతాలను ఇక్కడ తప్పకుండా చూడదగిన పర్యాటక కేంద్రాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X