» »దేవకన్యల నర్తనశాల చూశారా

దేవకన్యల నర్తనశాల చూశారా

Written By: Beldaru Sajjendrakishore

హిమాలయాల గుట్టు ఎంత చెప్పినా తక్కువే. ఈ దవళవర్ణ పర్వతాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఇక్కడి ప్రతి నదికీ, ప్రతి కట్టడానికి, ప్రతి దేవాలయానికి, ప్రతి మొక్కకూ ఒక కథ ఉంటుంది. ఆ కథలో సైన్సుకు కూడా అందని ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. ఇది ఈ మంచుపర్వాలకు సంబంధించి ఒక కోణమైతే మరో కోణం ప్రకృతి రమణీయత. ఇక్కడి ప్రకృతి అందాలను ఎంత వర్ణించినా తనివి తీరదు. ప్రపంచలోనే అరుదైన మొక్కలను, పుష్పాల నిలవు ఈ మంచు పర్వతాలు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆ రంగురంగు పుష్పాల పై సూర్యకిరణాలు పడే దృశ్యం చూడాల్సిందే కాని ఎంత చెప్పినా ఆ వర్ణనకు సార్థకత చేకూరదు. అందుకే హిమాలయాలు మనకే కాకుండా దేవతలకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైన పర్యాటక ప్రాతం. అటు వంటి ప్రదేశాలకు తలమానికం వ్యాలీ ఆఫ్ ప్లవర్స్. ఇక్కడకు దేవతలు రావడమే కాకుండా తమను తాము మరిచిపోయి నాట్యం కూడా చేస్తారని ప్రతీతి. మీరు కూడా ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ను చూస్తే ఇది అతిశయోక్తి కాదని చెబుతారు. మరెందుకు ఆలస్యం వచ్చే వేసవి టూర్ లో ఇక్కడికి వెళ్లివద్దం. అంతకు ముందు అక్కడి వివరాలు తెలుసుకుందాం...

1. వేల పుష్పజాతుల నిలయం

1. వేల పుష్పజాతుల నిలయం

Image source

ఇక్కడ ఇప్పటి వరకూ దాదాపు 650 జాతులకు చెందిన పుష్పాలను గుర్తించారు. అందులో బ్రహ్మకమలం, బ్లూ పాపిల్, నాగమల్లి తదితరాలు ఉన్నాయి. అదే విధంగా దాదాపు 45 ఔషద మూలికలు, లతల జాతులను కనుగొన్నారు. ఇక్కడ దొరికే అనేక మొక్కలను ఆయుర్వేద మందుల తయారిలో వినియోగిస్తున్నారు.

2. అందుకే వస్తున్నారు

2. అందుకే వస్తున్నారు

Image source

ఇన్నివేల మొక్కలు ఉండటంతో పాటు వాటి నుంచి వచ్చే సుగంధభరితమైన సువాసనలు ఎటువంటి వారినైనా మంత్రముగ్థులను చేస్తాయి. ఇక ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం ఎటువంటి వారినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక స్థానికుల కథనం ప్రకారం ఇక్కడి వాతావరణం దేవతలు కూడా ఇక్కడకు వస్తారని చెబుతారు. కొన్ని అరుదైన రోజుల్లో వారు ఇక్కడకు వచ్చి నాట్యం చేస్తారని ఆ సమయంలో తాము దివ్యమైన వెలుగులు చూస్తామని ఇక్కడి వారి కథనం.

3. లోయప్రాంతం

3. లోయప్రాంతం

Image source

ఫష్పావతి వ్యాలీ, హేమకుండ్ వ్యాలీ కలగలిసిన లోయ ప్రాంతమే ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ ప్రాతం. అనేక రంగురంగుల పుష్పాలు కలిసిన ప్రాంతం కాబట్టి దీనికి ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ అని పేరు వచ్చింది.

4. ఉద్యానవనం

4. ఉద్యానవనం

Image source

ఈ ప్రాంతంలో దాదాపు 8 కిలోమీటర్ల పొడవు, రెండు కిలోమీటర్ల మేర ప్రత్యేక ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు. నందాదేవి బయోస్పియర్ ఇక్కడకు దగ్గరగానే ఉంటుంది. అయితే అక్కడి వాతావరణానికి ఇక్కడి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది.

5. జీవవైద్యానికి నిలువుటద్దం

5. జీవవైద్యానికి నిలువుటద్దం

Image source

ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ జీవ వైవిద్యానికి నిలువుటద్దం. ఇక్కడి అనేక వేల పుష్ఫ, మొక్క జాతులు ఒకే చోట కనిపిస్తాయి. ఇక హిమాలయన్ జాతి గ్రద్ధలు ఇక్కడ ప్రత్యేకం. ఇక పుష్పావతి నదీ గలగలలు ఈ ప్రాంతానికి మరింత శోభను తీసుకువస్తున్నాయి.

6. ఆ పుష్పాలు ఇక్కడ మాత్రమే

6. ఆ పుష్పాలు ఇక్కడ మాత్రమే

Image source

ఆగస్టు మొదటి వారంలో మాత్రమే వికసించే పింక్ రంగులోని ఇంపాటైన్ సుల్ కాటైన్ అనే పువ్వులు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఆ సమయంలో ఈ వ్యాలి మొత్తం ఎంతో సుందర మనోహరంగా కనిపిస్తుంది. అందువల్లే ఎక్కువ మంది ఆగస్టులో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు.

7. అంతరించే దశలోని జంతువుల నిలయం

7. అంతరించే దశలోని జంతువుల నిలయం

Image source

ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ అనేక అంతరించబోయే జాబితాల్లో చేరిన జంతువులకు నిలయం. ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో సదరు జాతులు ఇంకా తమ ఉనికిని కాపాడు కొంటున్నాయి. ముఖ్యంగా ఆసియా ఎలుగుబంట్లు, మంచు చిరుతలు, బ్లూ షీప్ వంటివి మనం ఇక్కడ చూడగలం.
ఈ పక్షులను మరెక్కడా చూడలేము

8. బయటి పశువులకూ వీలు లేదు.

8. బయటి పశువులకూ వీలు లేదు.

Image source

ఇక్కడ ప్రక`తి రమణీయతను కాపాడటం కోసం స్థానిక ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కనీసం బయటి పశువులను మేపడానికి కూడా ఫ్లవర్ ఆఫ్ వ్యాలీలో అనుమతించరు. అందువల్లే ఇక్కడి పరిసర ప్రాంతాలు ఎంతో సందరంగా మనకు కనిపిస్తాయి.

9. ట్రెక్కింగ్ కు మాత్రమే అవకాశం

9. ట్రెక్కింగ్ కు మాత్రమే అవకాశం

Image source

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అందాలను మనం చూడాలంటే కాళ్లకు పని కల్పించక తప్పదు. ఈ వ్యాలీ ప్రాంతంలో ఒక్క వాహనాన్ని కూడా సంచరించడానికి అనుమతించరు. కనీసం 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే ఈ సుందరమైన ప్రాంతానికి చేరుకోవడానికి వీలవుతుంది. చిన్నపిల్లలు, మహిళలకు డోలీలు అందుబాటులో ఉంటాయి.

10. కాఫీ కూడా దొరకదు

10. కాఫీ కూడా దొరకదు

Image source

ఈ వ్యాలీలో రెస్లోరెంట్లు కాదు కదా కనీసం కాఫీ కూడ దొరకదు. అందువల్ల ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడటానికి వెళ్లేవారు తప్పకుండా తమతో పాటు స్నాక్స్ ను తప్పక తీసుకువెళ్లాలని ట్రావెల్ గైడ్ లు చెబుతన్నారు.

11. మూడు కిలోమీటర్ల దూరంలోనే

11. మూడు కిలోమీటర్ల దూరంలోనే

Image source

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చేరుకోవడానికి ముందు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో గంగోరియా అనే ప్రదేశం వస్తుంది. అక్కడ స్థానిక వంటకాలు దొరికే రెస్టోరెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ పంజాబి వంటకాలు ఎక్కువగా లభిస్తాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు వెళ్లే వారు ఇక్కడి నుంచే తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి వెళుతారు.

12. మూడు రోజుల పాటు అవకాశం

12. మూడు రోజుల పాటు అవకాశం

Image source:

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మొత్తాన్ని ఒక రోజులో చూడలేము. అందువల్ల ఇక్కడి అందాలను ఆస్వాధించడానికి మూడు రోజుల పాటు అవకాశం కల్పిస్తారు. ఈ మూడు రోజులు మనకు అవసరమైన సహకారం అందించడానికి సహయకులు కూడా దొరుకుతారు.

13. ఇంకా ఏమి చూడవచ్చు

13. ఇంకా ఏమి చూడవచ్చు

Image source

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నుంచి జ్యోషి మఠ్ దాదాపు 20 కిలోమీటర్లు. ఇక్కడ శంకరాచార్యమఠం, నరసింహ దేవాలయం తదితరాలను చూడవచ్చు. దగ్గరల్లోని గోవిందఘాట్ కూడా చూడదగిన ప్రదేశం. వివిధ రకాల స్థానిక కళాకృతులు ఇక్కడ దొరుకుతాయి.

14. ఎక్కడ ఉంది

14. ఎక్కడ ఉంది

Image source

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో పశ్చిమ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ వ్యాలి ఆఫ్ ఫ్లవర్స్ విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం 87.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.

15. విమానయానం ద్వార ఇలా...

15. విమానయానం ద్వార ఇలా...

Image source

వ్యాలి ఆఫ్ ఫ్లవర్స్ కు దగ్గరగా ఉన్న విమానాశ్రయం డెహ్రడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. ఇక్కడి నుంచి దాదాపు 292 కిలోమీటర్ల దూరం రోడ్డు ద్వారా ప్రయాణించి గోవిందఘాట్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి 16 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే వ్యాలి ఆఫ్ ఫ్లవర్స్ వస్తుంది.

16. రైలు మార్గం ద్వారా కూడా

16. రైలు మార్గం ద్వారా కూడా

Image source

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రుషికేష్ కు రైలు మార్గాలు ఉన్నాయి. రుషికేష్ కు రైలులో వచ్చి అక్కడి నుంచి గోవిందఘాట్ కు చేరుకోవాలి. సుమారు 10 గంటల ప్రయాణం. ఈ ఘాట్ నుంచి 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తో వ్యాలి ఆఫ్ ఫ్లవర్స్ ను చేరుకోవచ్చ.