» »ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు!

ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు!

Written By: Venkatakarunasri

తరాలు మారినా అంతే నమ్మకంగా నమ్మటం వెనుక బలమైన కథనాలూ వుంటాయి. అలా స్త్రీలు మాత్రమే వెళ్ళి పూజలు చేసే ఓ ఆలయం ఉంది.

పొరపాటున కూడా పురుషులు ఎవ్వరూ ఆ ఆలయంలోకి అడుగు పెట్టరు. పసుపు కుంకుమలతో తమని చల్లగా చూడమని స్త్రీలు పూజలు చేసే ఆ ఆలయం వెనుక, అక్కడి ఆచారం వెనుక ఓ కథ కూడా ఉంది.

ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో పూజలందుకునే దేవతా విగ్రహం అంటూ ఏదీ వుండదు. కాని రోజూ కొన్ని వందల మంది మహిళలు ఆ ఆలయంలో పూజలు చేస్తారు. నోములు, వ్రతాలు చేసుకుంటారు.

ఇది కూడా చదవండి: సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్ !

ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదానప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: తీపి వంటకాల రాజధాని : 'లక్నో' !

pc:youtube

ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్

ఉత్తర ప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము లక్నో. ఇంకా ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్ ముఖ్యమైన నగరాలు.

ఇది కూడా చదవండి: కదిలే లింగమయ్య ... చూసొద్దాం పదండి !

pc:youtube

అంతర్జాతీయ సరిహద్దు

అంతర్జాతీయ సరిహద్దు

ఉత్తరప్రదేశ్ పొరుగున ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

ఇది కూడా చదవండి: లఖింపూర్ ఖేరి : ప్రత్యేక ఆకర్షణలు !

pc:youtube

సాకాలేదిహ ప్రాంతం

సాకాలేదిహ ప్రాంతం

1870 ప్రాంతంలో సాకాలేదిహ ప్రాంతాన్ని పాలించే రాజు అతని కుమారులు ఒకసారి శ్రీ పాదుడు అనే ఓ నిరుపేద బ్రహ్మణుడుని బంధిస్తారు.

pc:youtube

శ్రీపాదుడు

శ్రీపాదుడు

శ్రీపాదుడు ఆవులు పొరపాటున రాజుగారి పొలంలోకి ప్రవేశించటమే అతను చేసిన నేరం. పొరపాటు జరిగిందని, క్షమించమని వేడుకుంటాడు శ్రీపాదుడు.

pc:youtube

శ్రీపాదుడు

శ్రీపాదుడు

కాని అధికార గర్వంతో రాజు అతని మాటలని వినిపించుకోడు.... పైగా బ్రహ్మాణుడికి గోవులెందుకు అంటూ అవహేళన చేస్తాడు.

pc:youtube

నిరుపేద బ్రహ్మాణుడు

నిరుపేద బ్రహ్మాణుడు

కేవలం ఓ నిరుపేద బ్రహ్మాణుడి ఆవులు తమ పొలంలోకి వచ్చాయన్న ఒకే ఒక్క ఆరోపణతో అతనిని బంధించి కారాగారంలో పడేస్తాడు రాజు.

pc:youtube

చిత్రహింసలు

చిత్రహింసలు

శ్రీపాదుడుని చిత్రహింసలు పెడతారు భటులు. దాంతో ఎంతో మనస్తాపానికి గురయిన శ్రీపాదుడు అన్నపానీయాలు మానేసి నిరాహారంగా కాలం గడుపుతుంటాడు.

pc:youtube

బ్రహ్మాణ ద్రోహం

బ్రహ్మాణ ద్రోహం

ఈ విషయం తెలుసుకున్న రాకుమార్తెలు బ్రహ్మాణ ద్రోహం వంశానికే అరిష్టమని భావించి రహస్యంగా కారాగారంలోని శ్రీపాదుడుని కలుసుకుని తమ తండ్రి, సోదరులు చేసిన ద్రోహానికి క్షమించమని వేడుకుంటారు.

ఇది కూడా చదవండి: తాజ్ మహల్ ను పోలిన 6 కట్టడాలు !

pc:youtube

మీకెప్పుడూ మంచే జరుగుతుంది

మీకెప్పుడూ మంచే జరుగుతుంది

ఒకరోజు రాకుమార్తెలు తులసితీర్థాన్ని తెచ్చి అది తీసుకుని దీక్షని విరమించమని శ్రీపాదుడుని కోరతారు అయితే ఆ తులసి తీర్థం తీసుకున్న శ్రీపాదుడు "మీకెప్పుడూ మంచే జరుగుతుంది" అని ఆ రాకుమార్తెలని దీవిస్తూ, కూర్చున్న చోటనే ప్రాణాలు విడుస్తాడు.

pc:youtube

రాకుమార్తెలు

రాకుమార్తెలు

ఆ తరువాత కొన్నాళ్ళకు రథం లోయలో పడిన ప్రమాదంలో రాజు, రాజకుమారులు మరణించగా, ఆశీర్వాదం వలనే అలా తాము ప్రాణాలతో ఉన్నామని నమ్ముతారు రాకుమార్తెలు.

pc:youtube

దైవపీఠం

దైవపీఠం

శ్రీపాదుడిని బంధించిన కారాగారాన్ని దేవాలయంగా మార్చి, శ్రీపాదుడు కుర్చున చోటుని దైవపీఠంగా భావించి పూజలు చేసేవారు ఆ రాకుమార్తెలు.

pc:youtube

మహిళలకి మాత్రమే

మహిళలకి మాత్రమే

కేవలం మహిళలకి మాత్రమే అందులో ప్రవేశమని, మగవారు రాకూడదని శాసించారు. ఇప్పటికీ మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు.

pc:youtube

నెయ్యి, పూలతో పూజలు

నెయ్యి, పూలతో పూజలు

అలా లోపలికి వెడితే చెడు జరుగుతుందని వారి నమ్మకం కేవలం స్త్రీలు మాత్రమే ఆలయంలోకి వెళ్ళి ఒకప్పుడు శ్రీపాదుడు కూర్చున్న ఎత్తైన అరుగుకి పసుపురాసి, నెయ్యి, పూలతో పూజలు చేస్తారు. మహిళల కోసం మహిళలే కట్టుకున్న ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది.

ఇది కూడా చదవండి: వారణాసి - పవిత్ర పుణ్య క్షేత్రం !!

pc:youtube