Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు సమీపంలో రివర్ ర్యాఫ్టింగ్ ప్రదేశాలు !

బెంగళూరు సమీపంలో రివర్ ర్యాఫ్టింగ్ ప్రదేశాలు !

బెంగళూరు చుట్టుపక్కల సందర్శించటానికి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. డిఫెరెంట్ గా ఆలోచించేవారికి మరియు సాహసికులకు సూచించదగినది రివర్ ర్యాప్టింగ్. రివర్ ర్యాఫ్టింగ్ అనేది ఒక నీటి క్రీడ.

By Mohammad

మీరు బెంగళూరు లో ఉన్నారా ? (లేదా) బెంగళూరు కు వస్తున్నారా ? మీ సమాధానం 'అవును' అయితే బెంగళూరు చుట్టుపక్కల ఉన్న సాహస క్రీడల ప్రదేశాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎప్పుడూ హిల్ స్టేషన్లు, టెంపుల్స్ వెళ్లేవారికి ఇది డిఫెరెంట్ గా ఉంటుంది. ట్రై చేయండి.

బెంగళూరు సమీపంలోని ఫిషింగ్ మరియు నేచర్ క్యాంప్ లు !

బెంగళూరు భారతదేశంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న సిలికాన్ సిటీ. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఏడాది పొడవునా తరలివస్తుంటారు. ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు, స్థానికులు మరియు విద్యార్థులు శని, ఆదివారాలలో చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్రదేశాలను చూసి వస్తుంటారు. వారి తోడు పర్యాటకుల రాకతో ఆ ప్రదేశాలన్నీ కిటకిటలాడుతుంటాయి.

బెంగళూరు చుట్టుపక్కల సందర్శించటానికి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. డిఫెరెంట్ గా ఆలోచించేవారికి మరియు సాహసికులకు సూచించదగినది రివర్ ర్యాప్టింగ్. రివర్ ర్యాఫ్టింగ్ అనేది ఒక నీటి క్రీడ. బృందాలుగా ఏర్పడి (5 లేదా 7 మంది) తెప్పలలో ప్రయాణిస్తారు. తెప్పలంటే నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ ల వద్ద ఉంటాయే అవని అనుకునేరు ... ఇవి వేరు. కేవలం ర్యాఫ్టింగ్ క్రీడ కు మాత్రమే ఈ తరహా వాడుతారు.

15 అంశాలకు ప్రసిద్ధి చెందిన కూర్గ్ !

1. భీమేశ్వరి

1. భీమేశ్వరి

భీమేశ్వరి బెంగళూరు కు 100 కి. మీ ల దూరంలో, మండ్య జిల్లాలో కావేరి నది ఒడ్డున కాలదు. మేకేదాటు, శివనసముద్ర మధ్య గల ఈ విహారకేంద్రం వివిధ ఆకర్షణలతో పర్యాటకులను సంతృప్తి పరుస్తుంది.

చిత్రకృప : Ashwin Kumar

రివర్ రాఫ్టింగ్

రివర్ రాఫ్టింగ్

భీమేశ్వరి లో రివర్ ర్యాఫ్టింగ్ క్రీడ ఆచరించవచ్చు. కావేరి నది నీటి ప్రవాహం మీద తెప్పలలో విహారం సాహసికులను మైమరిపిస్తోంది. సుమారు 8 కిలోమీటర్ల వరకు సాగే ర్యాఫ్టింగ్ క్రీడలో కావేరి మలుపులు, ఎత్తుపల్లాలు ఆనందాన్ని ఇస్తాయి. ర్యాఫ్టింగ్ కు అవసరమయ్యే తెప్పలు, తెడ్డులు, హెల్మెట్లు మరియు ఇతర వస్తువులు అద్దెకు దొరుకుతాయి. ర్యాఫ్టింగ్ తర్వాత ఫిషింగ్, జీప్ రైడ్, ట్రెక్కింగ్ వంటివి చేపట్టవచ్చు.

చిత్రకృప : Philip Larson Follow

2. కూర్గ్

2. కూర్గ్

బెంగళూరు నుండి దూరం : 263 కి. మీ

కూర్గ్ రివర్ ర్యాఫ్టింగ్ లో బరపోలే ర్యాఫ్టింగ్ చెప్పుకోదగ్గది. ప్రకృతి ప్రేమికులకు, అడ్వెంచర్ కోరుకొనేవారికి మరియు అనుభూతిని పొందాలనుకొనేవారికి ఈ ర్యాఫ్టింగ్ నచ్చుతుంది. బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ సంచురీ బ్యాక్ డ్రాప్, నది ప్రవాహాలు గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది.

చిత్రకృప : Philip Larson

రివర్ ర్యాఫ్టింగ్

రివర్ ర్యాఫ్టింగ్

గ్రేడ్-2 నుండి గ్రేడ్ - 4 వారికి ఇది అనుకూలం. ర్యాఫ్టింగ్ కోర్స్ నేర్చుకునేవారు 3 కి. మీ వరకు వెళ్లిరావచ్చు.

సమయం : 2 గంటలు . ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు ర్యాఫ్టింగ్ క్రీడ లో పాల్గొనవచ్చు.

చిత్రకృప : Philip Larson

3. దండేలి

3. దండేలి

బెంగళూరు నుండి దూరం : 467 కి. మీ

కర్ణాటక సాహస క్రీడల విభాగంలో దండేలి ఉత్తమమైనది. దీనిని 'కర్ణాటక సాహసక్రీడల పుట్టిల్లు' గా చెప్పుకోవచ్చు. చుట్టూ దట్టమైన అడవి, జీవ వైవిధ్యంతో అలరారే కాళీ నది తీరంలో రివర్ ర్యాఫ్టింగ్ లో పాల్గొనటానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తుంటారు.

చిత్రకృప : Alosh Bennett

రివర్ ర్యాఫ్టింగ్

రివర్ ర్యాఫ్టింగ్

దండేలి ర్యాఫ్టింగ్ ట్రైల్ సుమారు 12 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గ్రేడ్ - 2, గ్రేడ్ -3 రైడర్లకు మరియు ప్రొఫెషనల్, అనుభవనం లేని రాఫ్టర్ లకు కాళీ నదిలో ర్యాఫ్టింగ్ సురక్షితం.

చిత్రకృప : Ankur P

4. కొండాజి

4. కొండాజి

కొండాజి, బెంగళూరు కు 260 కి. మీ ల దూరంలో ఉన్నది. ఇక్కడి అద్భుతమైన దృశ్యాలు ... ర్యాఫ్టింగ్ కంటే బాగుంటాయి. దట్టమైన అడవి, కొండలు ఈ ప్రాంతపు అదనపు ఆకర్షణలు.

చిత్రకృప : Rishikesh454

ర్యాఫ్టింగ్

ర్యాఫ్టింగ్

ర్యాఫ్టింగ్ : నదిలో ర్యాఫ్టింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కయాకింగ్, కొరకిల్ రైడ్ మరియు సర్ఫింగ్ క్రీడలకు శిక్షణ ఇప్పించే తిమ్మయ్య నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్వెంచర్ సంస్థ ఇక్కడ ఉన్నది.

చిత్రకృప : Balaji Photography

5. కాబిని

5. కాబిని

కాబిని వన్యజీవుల ప్రాంతం. ఇది బెంగళూరు కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కాబిని నదిలో చేసే ర్యాఫ్టింగ్ ఒక చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. చుట్టూ అడవి, కొండలను చూస్తూ నీటి ప్రవాహంలో పరవశించిపోవచ్చు. ఇక్కడ ఏనుగులు ఎక్కువగా కనిపిస్తాయి.

చిత్రకృప : Shiraz Ritwik

6. శ్రీరంగపట్నం

6. శ్రీరంగపట్నం

బెంగళూరు నుండి దూరం : 128 కి. మీ

శ్రీరంగపట్నం లో కూడా కర్ణాటక టూరిజం శాఖ ఈ మధ్య ర్యాఫ్టింగ్ సదుపాయాన్ని పర్యాటకులను అందిస్తున్నది. రూ. 600 తో బెంగళూరు నుండి శ్రీరంగపట్నానికి సింగిల్ డే ట్రిప్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ప్యాకేజీలో భాగంగా లంచ్ మరియు స్నాక్స్ తో పాటు ర్యాఫ్టింగ్ క్రీడ ను అందిస్తున్నారు.

చిత్రకృప : Philip Larson

7. హొన్నెమర్దు

7. హొన్నెమర్దు

హొన్నెమర్దు షరావతి బ్యాక్ వాటర్స్ వద్ద ఉన్న ప్రాంతం. సాహసికులు, నీటి క్రీడలు ఇష్టపడేవారు ఇక్కడికి వస్తుంటారు. బెంగళూరు నుండి 379 కి. మీ ల దూరంలో .. ఏటవాలు కొండలపై, ద్వీపం వలె రిజర్వాయర్ మధ్యలో ఉన్న ఈ ఊరిలో ర్యాఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్ ఆచరించవచ్చు.

చిత్రకృప : Srinath.holla

8. అగుంబే

8. అగుంబే

బెంగళూరు నుండి దూరం : 355 కి. మీ

అగుంబే లోని సీతా నది, రివర్ ర్యాఫ్టింగ్ కు ఫెమస్. దట్టమైన అడవులు, వివిధ రకాల ఔషధ మొక్కలు, జంతువులు, జలపాతాల మధ్యలో నదిలో ర్యాఫ్టింగ్ ఒక మరుపురాని అనుభూతి. అరేబియా సముద్రంలో సూర్యుడు అస్తమించే అద్భుత దృశ్యాన్ని ఈ ప్రాంతం నుండి చూడవచ్చు.

చిత్రకృప : Ankur P

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X