Search
  • Follow NativePlanet
Share
» »దూరమే...అయినా అందమైన అనుభూతులు మిగిల్చే మార్గం

దూరమే...అయినా అందమైన అనుభూతులు మిగిల్చే మార్గం

బెంగళూరు నుంచి మైసూరు రోడ్ ట్రిప్ గురించిన విశేషాలు

By Gayatri Devupalli

మీరు వారాంత సమయములో, బెంగుళూరు నుండి సందర్శన నిమిత్తం త్వరగా చేరుకోగలిగే ప్రదేశం ఏమిటి? కూర్గ్, మైసూర్ ఇలా అనేక ఇతర పర్యాటక ప్రదేశాలు, బెంగళూరుకు సమీపంలో ఉన్నాయి. అనేక సందర్శన స్థలాలను కలిగి ఉన్నందున, వారాంతములో బెంగుళూరు నుండి మైసూర్ కు ప్రయాణించండి. ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు కలిగి ఉన్నందున, ఈ ప్రయాణం మీకు విసుగు పుట్టించదు. బెంగుళూరు నుండి మైసూర్, కేవలం 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ, మనం కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ఉత్తమ ఆకర్షణలను చుట్టి రావడానికి వీలు కల్పించే మార్గాన్ని ఎంచుకుందాం! ఈ మార్గంలో ప్రయాణించడం ఉత్సాహభరితంగా ఉంటుంది. సుమారు 270 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి, 6 గంటల సమయం పడుతుంది. ఈ యాత్ర ప్రారంభించే ముందు, మీకోక సలహా ఇవ్వబోతున్నాము. ఈ మార్గం ద్వారా చేసే పర్యటనలో, మైసూర్ ను త్వరగా చేరుకోలేము. కానీ, మైసూర్ మార్గంలోని అందమైన ప్రదేశాలను, వీక్షించి రావచ్చు! కనుక ఎంతో ఓపికతో అడుగడుగునా ఎదురయ్యే సందర్శన స్థలాలను దర్శించి, ఆనందించండి.

రామనగరం

రామనగరం

P.C: You Tube

ఈ మార్గంలో, మీకు ఎదురయ్యే మొట్ట మొదటి గమ్యస్థానం రామనగరం. ఈ గ్రామంలోనే షోలే అనే ప్రఖ్యాత హిందీ చిత్రాన్నిచిత్రీకరించారు. ఈ ప్రదేశం పర్వతాధిరోహణ మరియు ట్రెక్కింగ్ కు కూడా పేరుగాంచినది.

మాండ్య:

మాండ్య:

P.C: You Tube

రామనగరం నుండి 50 కిలోమీటర్ల దూరంలో మాండ్య ఉంది. మద్దూర్ వడకు ప్రసిద్ధి చెందిన మద్దూర్, దాటుకుని ప్రయాణించాల్సి వస్తుంది. గంజాంలో టిప్పు సుల్తాన్ యొక్క మృత అవశేషాలను ఉంచిన సుందరమైన ప్రదేశంను, మీరు మాండ్యలో చూడవచ్చు. ఈ ప్రదేశంలో రంగనాథిట్టు పక్షి అభయారణ్యం కూడా ఉంది.

శివనసముద్ర

శివనసముద్ర

P.C: You Tube

శివనసముద్ర జలపాతం, మాండ్య నుండి కేవలం 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శివనసముద్ర జలపాతమే కాకుండా, మీరు బారచుకి మరియు గననాచుక్కి జలపాతాలను కూడా చూడవచ్చు.

తలకాడు:

తలకాడు:

P.C: You Tube

శివనసముద్ర నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకాడు, శిథిల ఆలయాలను కలిగివున్న ప్రదేశం. ఈ ప్రదేశంలో, 16 వ శతాబ్దంలో ఒకసారి, ఇసుక కింద 30 ఆలయాలు కూరుకుని పోయాయి.

శ్రీరంగపట్నం:

శ్రీరంగపట్నం:

P.C: You Tube

ఈ ప్రముఖ చారిత్రక పట్టణం, తలకాడు నుండి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరంగపట్నంలోని రంగనాథ స్వామి దేవాలయంను తప్పక దర్శించాలి. ఈ ఆలయం హొయసల సామ్రాజ్య వైభవాన్ని మరియు విజయనగర శిల్ప శైలిని వివరిస్తుంది.

మైసూరు:

మైసూరు:

P.C: You Tube

చివరగా మీరు చేరుకునే మైసూరు, శ్రీరంగపట్నం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైసూరులో సందర్శినీయ ఆకర్షణలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా దసరా ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రాంతంలో రాచనగరి మొదలు ఎన్నో ప్రాంతాలను చూసి రావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X