• Follow NativePlanet
Share
» »ఈ పర్యాటక ప్రాంతాలు...మీకు సవాలు విసురుతున్నాయి...

ఈ పర్యాటక ప్రాంతాలు...మీకు సవాలు విసురుతున్నాయి...

Written By: Beldaru Sajjendrakishore

పర్యాటకంలో అడ్వెంచర్ టూరిజంలో అనే విధానం పై పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. రివర్ రాఫ్టింగ్, కేవింగ్, డైవింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, విండ్ సర్ఫింగ్ తదితర సహసక్రీడలు. ఈ క్రీడలకు అనువుగా ఉన్న ప్రాంతాలకు ఇప్పటి యువతరం ఉరకలు వేసుకొంటూ వెలుతోంది. అందులోని రాక్ క్లైంబింగ్ పై యువత ఎక్కువ అసాక్తి చూపిస్తోంది. ఎతైన, కఠిన శిలలను ఎగబాకడమే రాక్ క్లైంబింగ్. ఈ క్రీడ వల్ల పట్టుదల, కఠిన శ్రమ అలవడుతాయని మానసిక నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మన కర్ణాటకలో రాక్ క్లైంబింగ్ కు అనువైన ప్రాంతాల వివరాలు మీ కోసం. మరింకెందుకు ఆలస్యం ఆయా శిలల పై ఎగబాకి పట్టుదల అనే మీ జండాను పాతడానికి మీరు సిద్ధమా.....

1. యానా రాక్స్...

1. యానా రాక్స్...

Image source

ఉత్తర కన్నడ జిల్లాలోని యానా గ్రామం వద్ద ఈ కఠిన శిలలు ఉన్నాయి. బైరవేశ్వర శిఖరం, మోహిని శిఖరం అనే రెండు శిలల సమూహమే యానా రాక్స్. కర్ణాటక పరిధిలోని పశ్చిమ కనుమల్లో సహద్రి పర్వత శిఖరంలో ఈ యానా రాక్స్ ఉన్నాయి. భైరవ శిఖరం 390 అడుగుల ఎత్తు ఉంటే మోహిని శిఖరం ఎత్తు 90 అడుగులు. బెంగళూరు నుంచి యానా గ్రామం 460 కిలోమీటర్లు కాగా, కార్వార్ నుంచి 60 కిలోమీటర్లు. ఇక్కడ హిందువుల పుణ్యక్షేత్రమైన భైరవేశ్వర ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న లింగం పై నిత్యం నీటి ధార పడుతూ ఉంటుంది. శివరాత్రి పర్వదినాన ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి.

2. రామనగర

2. రామనగర

Image source

బెంగళూరుకు కూత వేట దూరంలోనే ఉన్న రామదేవర బెట్ట రాక్ క్లైంబర్స్ కు స్వర్గం వంటిది. ఇక్కడి శిలలు చాలా తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ కొంత జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంతో రాక్ క్లైంబర్స్ కు ఈ శిలలు ఎప్పుడూ పరీక్షను పెడుతూనే ఉంటాయి. నగరం నుంచి కేవలం 55 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే చాలు రామదేవర బెట్టను చేరుకోవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు.

3.హంపి

3.హంపి

Image source

చారిత్రాత్మకంగానే కాకుండా శిల్ప సంపదకు కూడా హంపి కానాచి అన్న విషయం మీకు తెలిసిందే. ఒక పక్క చారిత్రతకు ఆలవావలమైన ఈ ప్రాంతం ఇటీవల సాహసికుల పట్టుదలను పరీక్షిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న శిలలు రాక్ క్లైంబర్స్ కు ఆహ్వానం పలుకుతున్నాయి. బెంగళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ ప్రాంతం ఏ వీక్ ఎండ్ అయినా రాక్ క్లైంబింగ్ కు అనుకూలమే. అయితే వర్షాకాలం మాత్రం కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

4.స్కంధగిరి

4.స్కంధగిరి

Image source

బెంగళూరుకు 62 కిలోమీటర్లు, చిక్కబళాపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం రాక్ క్లైంబింగ్ పై ఇప్పుడిప్పుడే ఆసక్తి కలుగు తున్న వారికి, ఈ క్రీడను నేర్చుకుంటున్న వారికి అనుకూలమైన ప్రాంతం. ఇక్కడి పచ్చని వాతావరణం ట్రెక్కింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది.

5. శివగంగ దుర్గం...

5. శివగంగ దుర్గం...

Image source

బెంగళూరు నుంచి 54 కిలోమీటర్ల దూరం తుమకూరు నుంచి 19 కిలోమీర్ల దూరంలోని ఈ కొండలో 2640 అడుగుల ఎతైన శిఖరం ఉంది. అంతే కాకుండా ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బండలు రాక్ క్లైంబర్స్ ను ఏడాది మొత్తం రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇది శైవ పుణ్యక్షేత్రం కూడా. ఇక్కడ ట్రెక్కింగ్ కు అనుకూలంగా 2.3 కిలోమీటర్ల పొడవైన మార్గం ఉంది. కర్ణాటకలో అత్యంత ప్రాచూర్యం పొందిన ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ప్రాంతాల్లో ఇది శివగంగ దుర్గం మొదటి వరుసలో ఉంటుంది.

6. తూరన హళ్లి

6. తూరన హళ్లి

Image source

రాక్ క్లైంబింగ్ పై ఇక్కడ శిక్షణ కూడా దొరుకుతుంది. బెంగళూరు శివారులో కనకపుర రోడ్డులో తూరన హళ్లి ఉంది. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ రాక్ క్లైంబింగ్ లో శిక్షణ తీసుకోవచ్చు. దీనికి దగ్గరగా ఉన్న రాగోడ్లు అనే ప్రాంతంలో కూడా రాక్ క్లైంబింగ్ పై ఇప్పుడిప్పుడే శిక్షణ ఇస్తున్నారు. కనకపుర నుంచి చెన్నపట్టణ వెళ్లే మార్గంలో వచ్చే కబ్బాల్ దుర్గాలో కూడా ఇటీవల రాక్ క్లైంబింగ్ చేయడానికి యువత ఆసక్తి చూపుతున్నారు.

7. బాదామి

7. బాదామి

Image source

హంపికి 150 కిలోమీటర్ల దూరంలోని బాదామి రాక్ క్లైంబర్స్ కు స్వర్గం వంటిది. బాగల్ కోట జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. ఈ క్రీడలో శిక్షణ పొందాలనుకునే వారికి సహజ పరసర ప్రాంతాల్లో ఇక్కడ అవకాశం కల్పిస్తారు. మరి ఇక మీదే ఆలస్యం. ఏ వీక్ ఎండ్ ఏ రాక్ క్లైంబింగ్ కు వెళుతారన్నది ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకోండి.

8. బాదామి రాక్ క్లైంబింగ్ పై మరింత సమాచారం కోసం..

8. బాదామి రాక్ క్లైంబింగ్ పై మరింత సమాచారం కోసం..

Image source

క్లైంబింగ్ బాదమి
మల్లికార్జున పాఠశాల పక్కన
రంగనాథ్ నగర్
బాదామి587201

Read more about: hampi హంపి

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి