Search
  • Follow NativePlanet
Share
» »రొమాన్స్ ప్రదేశాల పుట్టిల్లు - తమిళనాడు !!

రొమాన్స్ ప్రదేశాల పుట్టిల్లు - తమిళనాడు !!

తమిళనాడు రాష్ట్రం పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తు కు వచ్చేది అక్కడ వేడి వాతావరణం. కొత్త జంటలు చెన్నై చేరి పర్యటించేందుకు ఈ సమయంలో అస్సలు ఇష్టపడరు. అయితే, తమిళనాడు రాష్ట్రం శృంగారానికి అనువైన కొన్ని ప్రదేశాలు సైతం కలిగి వుంది. ఈ ప్రదేశాలన్నీ కొండ ప్రాంతాలలో ఉండటం విశేషం అందునా ఈ ప్రదేశాలు కొత్తగా పెళ్ళైన వారిలో వేడిని పుట్టిస్తుంది.

నగర బిజీ లైఫ్ నుండి ఆహ్లాదం, ఉత్సాహం కొరకు కొంత సమయం ఈ ప్రదేశాలకు కేటాయించినట్లయితే మీరు స్వర్గాని పొందవచ్చు అందునా కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ప్రదేశాలను సందర్శించి వెచ్చని సుఖాన్ని పొందవచ్చు. మరి దక్షిణ భారత దేశంలో అందునా తమిళనాడు లో సందర్శించవలసిన స్వర్గాలు ఏంటి అనేవి ఒకసారి పరిశీలించినట్లయితే ....

కోడై కెనాల్

కోడై కెనాల్

హిల్స్టేషన్ లలో యువ రాణి గా పేరు పడిన కోడై కెనాల్ ప్రదేశం కంటే ఆహ్లాదకర ప్రదేశం మరొకటి ఈ రోజుల్లో ఏది వుంటుంది ? చల్లని చిరు గాలులు, చుట్టూ కోడై సరస్సు. ఇంతే కాక, కోకర్స్ వాక్, బ్రియాంట్ పార్క్, బెరిజాం సరస్సు వంటివి మీ ప్రియమైన వారితో పర్యటించేందుకు ఈ హిల్ స్టేషన్ లో వేచి వున్నాయి.


Pic Credit: C/N N/G

కూనూర్

కూనూర్

కూనూర్ నీలగిరి హిల్స్ లోని ఉత్తమ మూడు హిల్ స్టేషన్ లలో ఒకటి. జంటలకు ఇక్కడ కల డాల్ఫిన్స్ నోస్ లేదా కేథరిన్ ఫాల్స్ లేదా లాంబ్స్ రాక్ వంటివి చక్కటి విహార ప్రదేశాలు

Pic Credit: Thangaraj Kumaravel

ఊటీ

ఊటీ

ఊటీ నిండా ఎన్నో పార్క్ లు, గార్డెన్ లు. అనేక సినిమాలు ఇక్కడ షూట్ చేసారు. టాయ్ ట్రైన్ ఒక ప్రత్యేకత. మీ ప్రియమైన వారితో కలసి టాయ్ ట్రైన్ లో ప్రయాణిస్తూ, స్థానికుల స్వాగతాలు పొందండి. జంటలు ఇక్కడ కల థ్రెడ్ గార్డెన్, బొటనికల్ గార్డెన్, రోజ్ గార్డెన్ లలో మరింత ఆనందం పంచుకోనవచ్చు. కొద్దిపాటి సాహసం చేయాలనుకుంటున్నారా...దొడ్డ బెట్ట శిఖరం పైకి ట్రెక్కింగ్ చేయండి.

Pic Credit: Swaminathan

ఏలగిరి

ఏలగిరి

ఏలగిరి వారాంతపు విహార ప్రదేశం. ప్రియమైన వారితో ముచ్చటించేందుకు మంచి వాతావరణం. ఈ ప్రదేశం నగర హడావిడి కి దూరంగా వుంది. ప్రశాంత వాతావరణంతో సందర్శకులను స్వాగతిస్తుంది. ట్రెక్కింగ్, బోటింగ్ చేయవచ్చు. లేదా సరస్సు ఒడ్డున విశ్రాంతిగా రిలాక్స్ అవచ్చు.

Pic Credit: Wiki Commons

కోటగిరి

కోటగిరి

మేఘాలు ముద్దాడే పర్వత శ్రేణులు కోటగిరి ప్రత్యేకత. ప్రశాంతమైన ఈ ప్రదేశంలో జంటలు కొద నాద వ్యూ పాయింట్, కేథరిన్ వాటర్ ఫాల్స్, ఎలకా ఫాల్స్, స్నో డౌన్ పీక్ వంటివి విహరించవచ్చు. రోజువారీ బిజి జీవితాలు మరచి ఆనందంగా సమయం గడిపేందుకు ఇది ఒక అద్భుత ప్రదేశం.

Pic Credit: Thangaraj Kumaravel

ఎర్కాడ్

ఎర్కాడ్

ఎర్కాడ్ లోఏరి అంటే సరస్సు అని, కాడు అంటే ఫారెస్ట్ లేదా అడవి అని అర్ధం చెపుతారు. మీ ప్రియమైన వారితో కలసి ఈ వేసవిలో విహరించేందుకు ఎర్కాడ్ మరొక ఆహ్లాదకర ప్రదేశం. అనేక ప్రాణులు, మొక్కలను కూడా ఇక్కడ ఆనందించవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ ఆనందాన్నిస్తుంది. మీరు కనుక ఈ ప్రదేశ విహారం మే నెలలో ప్రణాళిక చేస్తే, ఇక్కడ జరిగే సమ్మర్ ఫెస్టివల్ లో కూడా మీరు పాల్గొని ఆనందించవచ్చు.

Pic Credit: Ananth BS

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X