Search
  • Follow NativePlanet
Share
» » ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినవారికీ ఈ దేవాలయానికి సంబంధం తెలుసా?

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినవారికీ ఈ దేవాలయానికి సంబంధం తెలుసా?

సహస్ర లక్ష్మీశ్వర దేవాలయం హిందువులకు పరమ పవిత్రమైనది.

ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినవారు విద్యాలో ముందుంటారని చెబుతారు. వారు మంచి దుస్తులను, ఖరీదైన ఆభరణాలను ఇష్టపడుతారంటారు. వీరు ఎటువంటి వారినైనా ఆకర్షిస్తారని చెబుతారు. అటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఈ దేవాలయానికి వెళ్ళి పూజలు చేయిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ఆ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం....

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఆ మహిమాన్విత దేవాలయం తమిళనాడులోని పుదుకోటై జిల్లాలోని తీయత్తూరు సహస్ర లక్ష్మీశ్వర దేవస్థానం. ఈ దేవాలయం అక్కడ ఇచ్చే నైవేద్యానికి ప్రసిద్ధి చెందినది.

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఇక్కడకు ఎక్కువగా ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినవారు వస్తుంటారు. వారు తమ సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిందిగా పూజలు చేయిస్తుంటారు. ముఖ్యంగా అప్పులతో బాధపడుతున్నవారు, సంతానం లేక దుంఖిస్తున్నవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఇక్కడ భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలతో పాటు హోమాలను కూడా చేయిస్తారు. ఇక్కడ దైవానికి వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడుతారు. ఈ నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఇక్కడ ఉన్న దేవత పరియనాయకి. ఆమె దక్షిణ దిక్కుగా ఉంటుంది. ఇక్కడ వినాయక, నంది, దక్షిణమూర్తి, బ్రహ్మ, మురుగన్, నవగ్రహాలు, చందికేశ్వర, భైరవ తదితర దేవుళ్లకు ఉపాలయాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి.

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఉత్తరభాద్ర నక్షత్రానికి ఈ దేవాలయానికి విశేష ప్రాముఖ్యత ఉంది. మహాపురుషులైన అగీర్ బుధన్, అంగీరాస, అగ్ని పురంధక, శిల్పి విశ్వకర్మ వీరంతా ఉత్తరాభాద్ర నక్షత్రానికి చెందినవారే. వీరు ప్రతి నెలా అద`ష్యరూపంలో ఇక్కడికి వస్తుంటారని చెబుగారు.

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఈ దేవాలయం ఉదయం 6 గంల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరిచే ఉంటారు. ఆ సమయంలో తేనే, ద్రాక్షి, గోడంబి, తేనే తదితర పదార్థాలతో తయారుచేసిన వస్తువులను ఇక్కడ నైవేద్యంగా పెడుతారు.

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
స్థానిక కథనం ప్రకారం ఇక్కడ విష్ణువు ప్రతి రోజూ 1000 కమలాలతో ఇక్కడి శివుడిని పూజించేవారు. ఒకసారి ఈ కమలాల సంఖ్యలో ఒకటి తగ్గుతుంది. దీంతో విష్ణవు తన కన్నును తీసి ఆ శివుడికి పూజ చేయడానికి సిద్ధమవుతాడు. అయితే పరమశివుడు ప్రత్యక్షమయ్యి విష్ణువును వారిస్తాడు.

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
ఇక అదే సమయంలో అక్కడ లక్ష్మీ కూడా ఉంటుంది. ఇక మహావిష్ణువు, లక్ష్మీ కోరిక మేరకు పరమశివుడు ఇక్కడ కొలువై ఉండిపోతాడు. అందువల్లే ఈ దేవాలయాన్ని సహస్ర లక్ష్మీశ్వర దేవాలయం అని అంటారు. సహస్రం అంటే 1,000 అని అర్థం.

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

లక్ష్మీశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
ఈ దేవాలయం తిరుప్పునావాసల నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి దగ్గర్లో అరంతంగి రైల్వే స్టేషన్ ఉంది. అదే విధంగా ఇక్కడికి దగ్గర్లో మదురై విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయానికి ఈ దేవాలయానికి మధ్య దూరం సుమారూ 131 కిలోమీటర్లు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X