Search
  • Follow NativePlanet
Share
» »సర్వశక్తులు సిద్ధించే శ్రీవేంకటేశ్వరస్వామి: సంఘీ టెంపుల్

సర్వశక్తులు సిద్ధించే శ్రీవేంకటేశ్వరస్వామి: సంఘీ టెంపుల్

సంఘి దేవాలయం, తెలంగాణ రాష్ట్రంలో సంఘినగర్ లో ఉంది. ఈ ఆలయం హైదరాబాదుకు సుమారు 35కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం యొక్క ఎత్తైన పవిత్రమైన రాజ గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి ఈ రాజగోపురాన్ని చూడవచ్చు. ఈ దేవాలయ సముదాయం పరమనంద గిరి కొండపైన అందమైన ఆలయం ఇది. కొండల మద్య ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈ ఆలయంలో శ్రీవెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో చూపరులకు కనువిందు చేస్తుంది. సర్వశక్తిమంతుడు ఆశీర్వదించబడుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి ప్రతి రూపమని ప్రతీతి. ఈ ఆలయం రాత్రి పూట చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

All images courtesy:hyderabadtourism

పవిత్రవనం

పవిత్రవనం

స్వామి వారి పూజ కొరకు ఇక్కడే పవిత్రవనం అనే తోటలో పూలచెట్లు పెంచుతున్నారు. ఈ పూలతోటలోని వివిధ రకాల పువ్వులు ఆయల పూజలకు అవసరమైన మోతాదులో పూలను సమకూర్చుతారు. ఆలయానికి సంబంధించిన కల్యాణమంటపంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుగుతాయి.

 ప్రవేశద్వారం భక్తులకు స్వాగతం

ప్రవేశద్వారం భక్తులకు స్వాగతం

ఈ సింఘి దేవాలయం యొక్క ప్రవేశద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది. లోపల వాయు పుత్రుడైన ఆంజనేయుని విగ్రహం ఈ ఆలయ యొక్క చాలా ఎత్తు అయిన ప్రదేశంలో ఉంటుంది. అక్కడి నుండి భక్తులను ఆయన ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.

పద్మావతి అమ్మవారి ఆలయం

పద్మావతి అమ్మవారి ఆలయం

ఈ ఆలయ ప్రాంగణంలోనే పద్మావతి అమ్మవారి ఆలయం, శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం, విగ్నేశాలయం, నవగ్రహాలయం, కార్తికేయ స్వామి ఆలయం వంటి ఉపఆలయాలు కూడా ఉన్నాయి. రోజూ అన్ని దేవుళ్లకు , దేవతలకు పూజలు నిర్వహిస్తుంటారు.

ఆలయ నిర్మాణం చోళ-చాళుక్యుల శైలిలో

ఆలయ నిర్మాణం చోళ-చాళుక్యుల శైలిలో

దక్షిణ భారత నిర్మాణ శైలిలో నిర్మించబడినది ఈ ఆలయం. ఆలయ నిర్మాణం చోళ-చాళుక్యుల శైలిలో ఉంటుంది. ఈ ఆలయాన్ని 1991లో నిర్మింపబడినది. హైదరాబాద్ సిటీలో చూడదగ్గ ప్రదాణ ఆకర్షణల్లో సింఘీ దేవాలయం ఒకటి.

ఈ ఆలయ మెట్ల పైన

ఈ ఆలయ మెట్ల పైన

ఈ ఆలయ మెట్ల పైన గొప్ప రాయితో చేయబడిన ఏనుగు విగ్రహం రక్షణ గా ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న మూడు గోపురాలు ఏంతో ఎత్తుగా ఉంది ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపిస్తుంది.

ఈ ఆలయంలో మరో విశేషం

ఈ ఆలయంలో మరో విశేషం

ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే సూర్యాస్తమయం సందర్భంలో కొండపై నుండి తిలకించే వారికి సూర్యాస్తమయం కన్నులపండుగగా కనబడుతుంది.

సంఘినగర్ ఆలయంగా

సంఘినగర్ ఆలయంగా

ఈ ఆలయాన్ని సాధారణంగా సంఘినగర్ ఆలయంగా పిలుస్తుంటారు. నగర శివార్లలో ఉన్న ఈ ఆలయాన్ని రోజూ వందలాది మంది భక్తులు, యాత్రికులు సందర్శిస్తుంటారు.

ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు

ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు

ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడి భగవంతుని ఆసిస్సుల కోసం వస్తుంటారు. చాలా మంది పర్యాటకులు ఇక్కడి కొండ అందాలని చూడటానికి వస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో ఆ ఆలయం ఉన్నందున అక్కడివి వెళ్ళే యాత్రికులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

సింఘినగర్ లోని పరమానందగిరి కొండపై

సింఘినగర్ లోని పరమానందగిరి కొండపై

సింఘినగర్ లోని పరమానందగిరి కొండపై ప్రముఖ పారిశ్రామిక సంస్థ సంఘి గ్రూపు యాజమాన్యం 1991లో ఈ ఆలయాన్ని నిర్మించింది. విలాసవంతమైన యాత్ర జరిపేవారికి ఈ ఆలయం విహార క్ష్రేతం. ఈ ఆలయ ప్రాంగణ పరిసరాలలో సినిమా షూటింగ్ లు జరుగుతూ ఉండటం కారణంగా కూడా అనేక మంది ఇక్కడకు వస్తుంటారు.

 భక్తుల దర్శనం

భక్తుల దర్శనం

ఈ దేవాలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. భక్తుల దర్శనం మాత్రం ఉదయం 8.30గం నుండి 10.30 వరకు మరియు సాయంత్రం 4నుండి 6వరకు తెరవబడి ఉంటుంది.

వారాంతాలలో

వారాంతాలలో

వారాంతాలలో ఎక్కువ మంది సందర్శకులు హాయిగా, సంతోషంగా రోజంతా గడపడానికి కుటుంబసమేతంగా ఇక్కడికి వస్తుంటారు. కొందరికి ఈ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపిస్తుంది. ఇక్కడ వారు ఆధ్యాత్మికతను ఆచరిస్తుంటారు.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ కు సుమారు 30కిలోమీటర్ల దూరంలో సంఘీనగర్ లో ఉన్న ఆలయాన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 205కె మరియు 290ఎస్ బస్సుల్లో వెళ్లవచ్చు. (లాలాగూడ-తార్నాక-ఉప్పల్ రింగ్ రోడ్-యల్ బి నగర్- సంఘీనరగ్). అలాగే కోటి నుండి దిల్ సుక్ నగర్ నుండి కూడా చాలా బస్సు సర్వీసులున్నాయి,.

హైదరాబాద్ లో చూడదగ్గ మరికొన్ని ప్రదేశాలు

హైదరాబాద్ లో చూడదగ్గ మరికొన్ని ప్రదేశాలు

గోల్కొండ కోట:

హైదరాబాద్ కు సుమారు 11కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గోల్కొండ కోటను 15వ శతాబద్దంలో ఎంతో కళకళలాడేది,. కానీ ఇప్పుడు శిథిలావస్తులో ఉన్నందున పురాతన వైభవం మాత్రమే కనబడుతుంది. ఇబ్రహిం ఖులి ఖుతుబ్ షా వాలి ఈ గోల్కొండ ఫోర్ట్ నిర్మాణానికి ప్రధాన సహకారం అందించారు.

PC: Ritwick Sanyal

రామోజీ ఫిల్మ్ సిటి:

రామోజీ ఫిల్మ్ సిటి:

హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ సౌత్ ఇండియన్ సినిమా షూటింగ్ లకు ప్రసిద్ది. ఇంకా లోకల్ గా ఉన్నవారికి ఫిక్నిక్ స్పాట్, థీమ్ బేస్డ్ పార్టీలకు, కార్పొరేట్ ఈవెంట్స్ కు, వైభవోపేతమైన పెళ్లిళ్ళకు, హనీమూన్ జంటలకు అనుకూలమైన ప్రదేశంగా ప్రసిద్ది చెందినది.

Photo Courtesy: Shillika

చౌమహల్లా ప్యాలెస్:

చౌమహల్లా ప్యాలెస్:

ఈ ప్యాలెస్ హైదరాబాద్ నిజాములకు చెందినది. పర్షియన్ పదాలయిన చహార్ మరియు మహాలట్ నుండి చౌమోహుల్లా ప్యాలెస్ పేరు వచ్చింది. ఈ ప్యాలెస్ నిర్మాణం మరియు ఆకృతి వివిధ రకాల శైలులతో ఉంటుంది. నిజాముల పాలనలో పట్టాభిషేకం ఇక్కడే జరిగేవి.

PC: prashanth dara

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more