Search
  • Follow NativePlanet
Share
» »మంత్రముగ్దులకు గురిచేసే సత్తోడి & మాగోడ్ జలపాతాలు !

మంత్రముగ్దులకు గురిచేసే సత్తోడి & మాగోడ్ జలపాతాలు !

By Mohammad

ఎప్పుడూ నగర జీవితానికి అలవాటు పడ్డ వారు ఒక్కసారి అలా బయటి అందాలను పరిశీలిస్తే ఎంత బాగుంటుంది. వాటిని చూస్తే, మీరేం పోగొట్టుకున్నారో తెలుస్తుంది. ఎప్పుడూ ఉండే నగరమే కదా ! కాస్త వదిలి ప్రకృతి ప్రసాదించిన ప్రదేశాలవైపు తిరుగాడండి.

ఇది మాన్సూన్ సీజన్. ప్రకృతి అందాలను తనివితీరా చూడాలనుకొనేవారికి ఈ కాలం సరిగ్గా సరిపోతుంది. నదులు, సరస్సులు, వాగులు, వంకలు .. నీటితో నిండుకుండను తలపిస్తాయి.

సత్తోడి జలపాతాలు

సత్తోడి జలపాతాలు

చిత్ర కృప : Phaneesh N

ఈ సీజన్లో తప్పక చెప్పుకోవలసినది జలపాతాలు గురించి. పాల ధార వలె నీరు పై నుండి కింద కు పడుతుంటే ... ఆ దృశ్యం వర్ణనాతీతం .. సుమనోహరం .. అనుభవిస్తే గానీ తెలీదు!

అలాంటి జలపాతాల లిస్ట్ లో చెప్పుకోదగ్గ రెండు జలపాతాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆసక్తి కరమైన విషయం ఏంటంటే, ఈ రెండు జలపాతాలు కూడా ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపూర్ సమీపంలో ఉండటమే. ఈ రెండు కూడా ఒకదానికొకటి 25 కిలోమీటర్ల దూరంలో కలవు.

సత్తోడి జలపాతాలకు వెళ్లే మార్గం

సత్తోడి జలపాతాలకు వెళ్లే మార్గం

చిత్ర కృప : anoop madhavan

సత్తోడి జలపాతాలు

సత్తోడి జలపాతాలు ఉత్తర కన్నడ జిల్లాలో కలవు. ఈ జలపాతాలు 42 అడుగుల ఎత్తు నుండి కిందపడి, దట్టమైన అడవుల గుండా ప్రవహిస్తుంది. స్థానికులు వీటిని 'మిని నయాగర జలపాతాలు' గా పిలుస్తారు. సత్తోడి జలపాతాలు ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే, కింద వరకు వెళ్లి .. జలపాతాన్ని దగ్గర నుండి చూడవచ్చు.

సత్తోడి ఫాల్స్ అద్భుత దృశ్యం

సత్తోడి ఫాల్స్ అద్భుత దృశ్యం

చిత్ర కృప : Adnan Alibaksh

సత్తోడి జలపాతాలు యల్లాపూర్ కు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. యల్లాపూర్ నుండి క్యాబ్ లేదా ఆటో అద్దెకు మాట్లాడుకొని జలపాతాల వద్దకు చేరుకోవచ్చు. ఇక్కడికి చేరుకోవటానికి ఎటువంటి బస్సు సౌకర్యం లేదు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న అందమైన పర్యాటక ప్రదేశం. టూరిస్ట్ లు వసతి కై కాటేజీ లు మరియు హోటళ్లు సంప్రదించవచ్చు.

కొడసల్లి రిజర్వాయర్

సత్తోడి జలపాతాల నీటి ప్రవాహం చివరకు చేరేది కొడసల్లి రిజర్వాయర్ వద్దకే. సాధారణంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు రాఫ్టింగ్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్ మొదలైనవి ఆచరిస్తుంటారు. రిజర్వాయర్ ను కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది.

కొడసల్లి డ్యాం బ్యాక్ వాటర్

కొడసల్లి డ్యాం బ్యాక్ వాటర్

చిత్ర కృప : Krishna Kulkarni

సత్తోడి ఫాల్స్ చేరుకోవటం ఎలా ?

యల్లాపూర్ రవాణా సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుంది. సమీపంలో హుబ్లీ మరియు కర్వార్ అనే రెండు నగరాలు ఉన్నాయి. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

బస్సు మార్గం : హుబ్లీ (70 KM), బెళగవి(152 KM), కర్వార్ (100KM) మరియు బెంగళూరు (427 KM) ప్రాంతాల నుండి యల్లాపూర్ కు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు / ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

మాగోడ్ ఫాల్స్

మాగోడ్ ఫాల్స్

చిత్ర కృప : Prad.gk

మాగోడ్ ఫాల్స్

మాగోడ్ ఫాల్స్, యల్లాపూర్ కు 19 కిలోమీటర్ల దూరంలో కలదు. బెడ్తి మరియు షల్మల నదులు ఈ జలపాతాన్ని రెండు దశలుగా ఏర్పరుస్తాయి. వర్షా కాలంలో నిండుగా కనిపించే మాగోడ్ ఫాల్స్ పర్యాటకులను మంత్రముగ్ధులను మంత్ర ముగ్ధులకు గురు చేస్తుంది. వర్షాకాలంలో జలపాతం కింద వరకు చేరుకోవటం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. అయినా పై నుండి జలపాత దృశ్యాలను చూడవచ్చు.

మాగోడ్ ఫాల్స్ సుందర దృశ్యం

మాగోడ్ ఫాల్స్ సుందర దృశ్యం

చిత్ర కృప : ShrinivasN

మాగోడ్ ఫాల్స్ చేరుకోవటం ఎలా ?

  • యల్లాపూర్ నుండి మాగోడ్ ఫాల్స్ 18 KM ల దూరంలో కలదు ; మాగోడ్ అనే గ్రామం నుండి జలపాతం 3 KM ల దూరంలో ఉన్నది
  • యల్లాపూర్ నుండి ఆటో రిక్షాలు, ప్రవేట్ వాహనాలలో ఎక్కి మాత్రమే మాగోడ్ ఫాల్స్ చేరుకోవాలి. బస్సులు తిరగవు.
  • ఇంకెందుకు ఆలస్యం ? ఇది జలపాతాల సీజన్. వెంటనే మీ బ్యాగ్ లను సర్దుకొని జలపాతాలను చూసిరండి

క్లిక్ చేయండి : యల్లాపూర్ ఎలా చేరుకోవాలి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X