» »కర్ణాటకలో రెండవ ఎత్తైన శిఖరం

కర్ణాటకలో రెండవ ఎత్తైన శిఖరం

Written By: Venkatakarunasri

తడియాండమాల్ అంటే పెద్ద పర్వతం అని మళయాళ భాషలో అర్థం. ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి లేనివారికి సగం దూరం వరకు కార్లలో వెళ్ళవచ్చు. ట్రెక్కింగ్ కాస్త కష్టంగానే ఉంటుంది అయినప్పటికి శిఖరం పైకి ఎక్కి చూస్తే పడిన కష్టం అంతా పోయి ఎంతో ఆనందం కలుగుతుంది.

తడియాండమోల్ కర్నాటకలో రెండవ ఎత్తైన శిఖరంగా ప్రసిద్ధికెక్కింది. ఇది దట్టంగా అలుముకున్నపడమటి కనుమలలో ఉంది. కూర్గ్ జిల్లాలో కక్కాబే పట్టణానికి సమీపంలో ఉంది తడియాండమోల్. ఇది సరిగ్గా కేరళ - కర్నాటక సరిహద్దు ప్రాంతంలో ఉంది. సముద్రమట్టానికి 1748 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం ట్రెక్కర్లకు, పర్వతారోహకులకు ఎంతో సవాలుగా ఉంటుంది.

కర్ణాటకలో రెండవ ఎత్తైన శిఖరం

పడి ఇగ్గుతప్ప ఆలయం

పడి ఇగ్గుతప్ప ఆలయం

పడి ఇగ్గుతప్ప ఆలయం లేదా పడి లఘుతప్ప ఆలయం లోని ప్రధాన దైవం లఘుతప్ప (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం). కక్కాబే లోని కొడవల తెగకు చెందిన ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ తులాభారం. ప్రతియేటా మార్చి లో కాలియార్చి పండగ వైభవంగా జరుగుతుంది.

విరాజ్ పేట

విరాజ్ పేట

విరాజ్ పేట కాఫీ మరియు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. ఇక్కడ గల అయ్యప్ప దేవాలయాన్ని పర్యాటకులు తప్పక దర్శిస్తారు. ఈ ఆలయం పవిత్రమైనదిగా భావించి, సంవత్సరం పొడవునా భక్తులు సందర్శిస్తుంటారు.

కాకోతుపరంబు

కాకోతుపరంబు

విరాజ్ పేట నుండి 8 కి. మీ ల దూరంలో ఉన్న కాకోతుపరంబు ప్రదేశంలో సెయింట్ ఆన్స్ చర్చి తడియాండమోల్ యొక్క మరో ప్రధాన ఆకర్షణ. ఈ కాహారుచిని ఫాదర్ గుల్లివాన్ 200 సంవత్సరాల క్రితం గోతిక్ నిర్మాణ శైలిలో కట్టించాడు. నగరం మధ్యలోని క్లాక్ టవర్ మరియు సమీపంలోని గణేశ దేవాలయం కూడా చూడదగినవే!

తడియాండమోల్ శిఖరం

తడియాండమోల్ శిఖరం

కర్ణాటకలోని కూర్గ్ లేదా కొడుగు జిల్లాలో తడియాండమోల్ జిల్లాలోనే అతి పెద్ద శిఖరం మరియు రాష్ట్రంలో రెండవ అతి పెద్ద శిఖరం. ఈ శిఖరం సముద్రమట్టానికి 5724 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శిఖరాన్ని ఎక్కటానికి పర్వతారోహకులు, ట్రెక్కర్లు ఆసక్తిని కనబరుస్తుంటారు. శిఖర ఏటవాలులలోని షోలా అడవులు చాలా ప్రాచీనమైనవి మరియు ఇంతవరకు ఎవరూ చొరబడనివిగా చెపుతారు.

నలకనాడు ప్యాలెస్

నలకనాడు ప్యాలెస్

నలకనాడు ప్యాలెస్ ను రాజా దొడ్డ రాజు వీరేంద్ర నిర్మించాడు. వేట సమయంలో సురక్షితంగా ఉండేందుకు రాజు ఈ ప్యాలెస్ ను ఒక గెస్ట్ హౌస్ వలె ఉపయోగించెను. ఇది రెండు అంతస్తుల భవనం. ఇందులోని 12 స్తంభాలు మంచి చెక్కడాలతో ఉంటాయి. ట్రెక్కర్లు ఈ భవంతిని బస చేయటానికి వినియోగిస్తారు.

తడియాండమోల్ ఎలా చేరుకోవాలి ?

తడియాండమోల్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం :

మంగళూరు సమీప విమానాశ్రయం. ఇది 140 కిలోమీటర్ల దూరంలో కలదు. క్యాబ్ లేదా టాక్సి లలో తడియాండమోల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం :

తడియాండమోల్ సమీపాన మంగళూరు రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం :

మంగళూరు, మడికేరి, బెంగళూరు, మైసూరు ప్రాంతాల నుండి తడియాండమోల్ కు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.