Search
  • Follow NativePlanet
Share
» »వేసవిలో హిమపాతాన్ని ఆస్వాదించాలంటే సిమ్లా వేళ్లాల్సిందే..

వేసవిలో హిమపాతాన్ని ఆస్వాదించాలంటే సిమ్లా వేళ్లాల్సిందే..

వేసవి వస్తే చల్లని ప్రదేశాలకు వెళ్లి సెలవులను ఎంజాయ్ చేద్దామని అందరికీ ఉంటుంది. అయితే అన్నీ వేసవి కాలాలు ఒకేలా ఉండవు. భారతదేశంలో చోటుచేసుకున్న పరిస్థితులే దీనికి కారణం. కొన్ని సంవత్సరాల నుంచి భారత పర్యాటకం ప్రపంచదేశాలని విపరీతంగా ఆక్షరిస్తోంది. దానికి తోడు దేశీయ పర్యాటకం కూడా బాగా పుంజుకున్నది. ఇండియాలో 'మే' నెలలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది హిల్ స్టేషన్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అటువంటి హిల్ స్టేషన్స్ లో సిమ్లా ఒకటి. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెల‌ల్లో షిమ్లా అందాలు అద్భుతంగా ఉంటాయి. ఈ నెల‌ల్లో షిమ్లాను చాలా మంది ప‌ర్యాట‌కులు సందర్శిస్తుంటారు. హ‌నీమూన్ కు వెళ్లే వారికి కూడా ఇప్పుడే చాలా బాగుంటుంది.

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా..‘క్వీన్ ఆఫ్ ద హిల్ స్టేషన్స్

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా..‘క్వీన్ ఆఫ్ ద హిల్ స్టేషన్స్

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా..‘క్వీన్ ఆఫ్ ద హిల్ స్టేషన్స్'గా గుర్తింపు పొందింది. హిమాచల్ ప్రదేశానికి హిల్ స్టేషన్ల జాబితాలో సిమ్లా చెప్పకపోతే, ఏదో పెద్ద తప్పు చేసేసినట్లే. బ్రిటిషర్లకు వేసవి రాజధాని అయిన సిమ్లా.. వారి అభిమాన హిల్ స్టేషన్లలో ఒకటి.

PC: Prashanth Ram

దేశంతో పాటూ ప్రపంచ యాత్రికులని ఆకర్షించే అందాలు

దేశంతో పాటూ ప్రపంచ యాత్రికులని ఆకర్షించే అందాలు

దేశంతో పాటూ ప్రపంచ యాత్రికులని ఆకర్షించే అందాలు కలిగిన ఉన్న హిమాలయ పరిసర ప్రాంతాలను సందర్శించటానికి భారతదేశానికి ప్రపంచ నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వేసవి కాలంలో ప్రారంభమైన యాత్ర దాదాపు రెండు నుంచి మూడు నెలల వరకు ఉంటుంది.

ప్రకృతి అందాలతో పాటు హిమాలయాల సోయగాలుతో

ప్రకృతి అందాలతో పాటు హిమాలయాల సోయగాలుతో

ప్రకృతి అందాలతో పాటు హిమాలయాల సోయగాలుతో నిండి ఉన్న ఈ సుందరమైన ప్రదేశంలో అన్నీ చిత్రాలే. చుట్టుపక్కల కొండలు, శిఖరాల పైకి ట్రెక్కింగ్, ఫిషింగ్, నీటి కార్యకలాపాలకు నదులు, చంద్విక్ జలపాతం ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న పర్వత ప్రాంతాల రాణిగా గుర్తింపు పొందిన ప్రాంతంలో ఒకసారి విడిది చేయాల్సిందే.

వేసవి విడిదిగా పేరున్న సిమ్లాలో పర్యాటక ఆకర్షణలు ఎన్నో

వేసవి విడిదిగా పేరున్న సిమ్లాలో పర్యాటక ఆకర్షణలు ఎన్నో

వేసవి విడిదిగా పేరున్న సిమ్లాలో పర్యాటక ఆకర్షణలు ఎన్నో. అందులో ఒకటి టాయ్‌ ట్రైన్‌ జర్నీ. 1903లో ప్రారంభమైన ఈ రైలు మార్గం.. నేటికీ విశేష ఆదరణ కలిగి ఉంది. సిమ్లా నుంచి కాల్కా వరకు ఎటు నుంచి ఎటు వెళ్లినా.. కలిగే ఆనందం మాత్రం ఒకటే!

96 కిలోమీటర్ల రైల్వేలైన్‌ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు

96 కిలోమీటర్ల రైల్వేలైన్‌ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు

96 కిలోమీటర్ల రైల్వేలైన్‌ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. గిరులు దాటుతూ.. తరులు చూపుతూ.. తీగలను ఊపుతూ.. లలితంగా సాగిపోతుందీ రైలు. 102 సొరంగాలను దాటుకొని.. 87 వంతెనలెక్కి.. 900 మలుపులు తిరిగి.. 20 స్టేషన్లలో ఆగి.. గమ్యానికి చేరుకుంటుంది.

అద్దాలతో ముస్తాబైన విస్టాడోమ్‌ బోగీ.. సిమ్లా-కాల్కా దారిలోని అందాలను

అద్దాలతో ముస్తాబైన విస్టాడోమ్‌ బోగీ.. సిమ్లా-కాల్కా దారిలోని అందాలను

కాల్కా దగ్గర సముద్రమట్టానికి 656 మీటర్ల ఎత్తులో మొదలయ్యే టాయ్‌ట్రైన్‌ సిమ్లా చేరుకునేసరికి 2,276 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. అందులో ప్రయాణించే యాత్రికుల ఆనందం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. అద్దాలతో ముస్తాబైన విస్టాడోమ్‌ బోగీ.. సిమ్లా-కాల్కా దారిలోని అందాలను పూర్తిగా కళ్లముందుంచనుంది. ప్రయాణంలో హిమపాతాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.

PC: Soorajkurup

ఇంజనీర్ల అద్భుతానికి ప్రతీకగా

ఇంజనీర్ల అద్భుతానికి ప్రతీకగా

ఇంజనీర్ల అద్భుతానికి ప్రతీకగా 806 వంతెనలు , 103 సొరంగాలతో నిర్మింపబడ్డ ఈ రైల్వేను ' బ్రిటిష్ జ్యూయల్ ఆఫ్ ద ఓరియంట్ ' గా ప్రసిధ్ది పొందింది . 2008 లో UNESCO వారి ద్వారా దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడింది .

బ్రిటిష్ కాలం నుంచి కూడా సిమ్లా పర్యాటకులకు ఇష్టమైన వేసవి విడిది

బ్రిటిష్ కాలం నుంచి కూడా సిమ్లా పర్యాటకులకు ఇష్టమైన వేసవి విడిది

బ్రిటిష్ కాలం నుంచి కూడా సిమ్లా పర్యాటకులకు ఇష్టమైన వేసవి విడిదిగా పేరు పొందింది . ఎండాకాలంలో వేసవి తాపం నుంచి తెప్పించు కొనేందుకు , శీతాకాలంలో స్నోఫాల్ చూడడానికి వచ్చే పర్యాటకులతో యేడాది పొడవునా కళకళ లాడుతూ వుంటుంది . సిమ్లా పట్టణంలో చూడ్డానికి ప్రకృతి సౌందర్యం ప్రకృతి ప్రియులను ఆహ్వానం పలుకుతుంది .

ఆకాశం నుంచి పడే మంచు తునకలు పలుచని దూది పింజలు రాలుతున్నట్లుగా

ఆకాశం నుంచి పడే మంచు తునకలు పలుచని దూది పింజలు రాలుతున్నట్లుగా

సాధారణంగా డిసెంబరు ఆఖరివారం లో గాని జనవరి మొదటి వారం లో గాని వాతావరణం బాగుంటే స్నోఫాల్ అవుతుంది . ఆకాశం నుంచి పడే మంచు తునకలు పలుచని దూది పింజలు రాలుతున్నట్లుగా వుండి అహ్లాదాన్ని కలిగిస్తాయి .సిమ్లాలో ముఖ్యంగా చూడవల్సిన ప్రదేశాలు మాల్ రోడ్డు , నేచురల్ ఐస్ స్కేటింగ్ రింక్ , కుఫ్రీ , నారకండ .

మాల్ రోడ్ :

మాల్ రోడ్ :

ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రతీ వేసవి విడిది లోనూ ఓ మాల్ రోడ్ ఉంటుంది. తెలుగులో మనం బజారు వీది అనుకోవచ్చు. ఇక్కడ స్థానికులు ఉత్పాదనతో పాటు స్తానికుల అవసరాలకు కావల్సిన వస్తువులు లభించే స్థలం. ఇక్కడ స్థానిక కళాత్మక చేతి తయారీలు అమ్మకానికి ఉంటాయి. సిమ్లా గోనె పట్టామీద ధారాలతో తయారుచేసిన హెంగింగ్స్ కి ప్రసిద్ది.

నేచురల్ ఐస్ స్కేటింగ్ రింక్ :

నేచురల్ ఐస్ స్కేటింగ్ రింక్ :

నేచురల్ ఐస్ స్కేటింగ్ రింక్ కి దేశ విదేశాలలో ప్రసిద్ది పొందింది. ఇది ఇక్కడ ఉన్న పెద్ద సరస్సు గడ్డకట్టడం వల్ల ఏర్పడ్డ స్కేటింగ్ రింక్. ఇక్కడ దేశ, దేశాంతర స్కేటింగ్ పోటీలు నిర్వహించబడుతూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సరస్సు స్కేటింగ్ చెయ్యడానికి కావలసినంత గడ్డకట్టడం మానేయడంతో స్కేటింగ్ పోటీలు జరగడం లేదు.

కాలాబరి ఆలయం

కాలాబరి ఆలయం

స్కాండల్‌ పాయింట్‌ నుండి జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వైపు కొద్ది దూరం నడిస్తే కాలాబరి ఆలయం వస్తుంది. ఇందులో ఉన్న దేవత శ్యామల దేవి. సిమ్లాకు ఆ పేరు వచ్చింది శ్యామల దేవత నుంచేనట.

జాకూ ఆలయం

జాకూ ఆలయం

జాకూ ఆలయం ఉన్న శిఖరం చూసి తీరాల్సిందే. ఇక్కడి నుంచి చూస్తే సిమ్లా అంతా కళ్ల ముందుంటుంది. ఇక్కడ హనుమాన్‌ ఆలయం ఉంది.ఇక్కడికి కొంచెం ఓపిక ఉంటే నడిచి వెళ్లవచ్చు, నడవలేని వాళ్ల కోసం పోనీలు (గుర్రాలు), టాక్సీలు ఉంటాయి.

PC: ShashankSharma2511

తత్తపాని’ హాట్‌ వాటర్‌ స్ప్రింగ్‌:

తత్తపాని’ హాట్‌ వాటర్‌ స్ప్రింగ్‌:

‘తత్తపాని’ హాట్‌ వాటర్‌ స్ప్రింగ్‌ మర్చిపోకుండా చూడాలి. హిమాచల్‌ప్రదేశ్‌ వాసులకు వేడినీటి గుండాలు మామూలు విషయమే కాని, మనకు వాటిని చూస్తే ఆశ్చ ర్యంగానే ఉంటుంది. ఆ నీటిగుండం మినహా పరిసరాల వాతావరణం రక్తం గడ్డకట్టేంత చల్లగా ఉంటుంది. హాట్‌వాటర్‌ స్ప్రింగ్‌లో నీళ్లు మాత్రం మరుగుతుంటాయి. ఈ నీటిలో సల్ఫర్‌ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతుందట. ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు పోతాయంటారు.

ఛైల్ భవనం

ఛైల్ భవనం

సిమ్లా వెళ్ళనవారు తప్పక చూడవలసిన వాటిలో ఛైల్ చారిత్రాత్మక భవనం ఒకటి. ఇదో ప్రత్యేకమైన హిల్ స్టేషన్. బ్రిటీష్ వారి కాలంలో మహారాజా భూపేందర్ సింగ్ 75 ఎకరాల విస్తీర్ణంలో ఓ గొప్ప ప్యాలెస్ ను కట్టించాడు. ఇదే చైల్ భవనం. ప్రస్తుతం ఈ ప్యాలెస్ లో హిమాచల్ పర్యాటక శాఖ వారు హోటల్ ను నడుపుతున్నారు.

శిల్పకళల నెలవు...స్టేట్‌ మ్యూజియం

శిల్పకళల నెలవు...స్టేట్‌ మ్యూజియం

ఇక ఇక్కడి స్టేట్‌ మ్యూజియంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్‌ ఉన్నాయి. భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ మ్యూజియంలో ఆసక్తి కలవారికి సమయం ఎలా గడిచిపోతుం దో కూడా తెలియదట.

PC: Abhishek Kumar

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

విమాన మార్గం:
దూరప్రాంతాల నుండి విమానయానం ద్వారా సిమ్లా చేరుకోవానుకునే పర్యా టకులకు దగ్గరి విమానాశ్రయం సిమ్లా ఎయిర్‌పోర్ట్‌. దాదాపు అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమాన సదుపాయం ఉన్నది. ఈ ఎయిర్‌పోర్ట్‌... చంఢీఘర్‌, కులు మనాలి, ఢిల్లీ నగరాల ఎయిపోర్ట్‌లతో సంబంధం కలిగి ఉంటుంది. వివిధ నగరాల నుంచి వచ్చే పర్యాటకలు ఢిల్లీ, చంఢీఘర్‌ ఎయిర్‌పోర్టులలో వారికి ఏది అనువుగా ఉంటే ఆ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా సిమ్లాకు చేరుకోవచ్చు.
రైలు మార్గం:
ఇక రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు సిమ్లాకు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్కా స్టేషన్‌ గుండా ఇక్కడికి చేరుకోవచ్చు. ఢిల్లీ మీదుగా కల్కా స్టేషన్‌కు వివిధ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
రోడ్డు మార్గం:
అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడి అనుబంధ రోడ్డు మర్గాలు ఉండడం వల్ల రోడ్డు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సిమ్లా చేరుకోవచ్చు.Photo Courtesy: Raghavan V

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X