Search
  • Follow NativePlanet
Share
» » ఈ శివరాత్రికి బెంగళూరులో ఉన్న ఈ శివాలయాలను తప్పక సందర్శించండి

ఈ శివరాత్రికి బెంగళూరులో ఉన్న ఈ శివాలయాలను తప్పక సందర్శించండి

మన హిందు పండగలలో అతి ముఖ్యంగా జరుపుకునే పండగ శివరాత్రి శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందడానికే మనం శివరాత్రిని అతి పవిత్రమైన పండుగగా జరుపుకుంటున్నాము. పురాణాల్లో చెప్పినట్టు ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.

ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అయితే వాటిలో నిత్య శివరాత్రి, పక్షశివరాత్రి, మాసశివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి, వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్థ్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈ రోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల ద్వారా తెలపడం జరిగింది.

బెంగళూరు అనగానే పచ్చదనం కళ్లముందు కదులుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది. అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. ఈ మహానగరం మాత్రమే కాదు..ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రసిద్ది చెందినది. బెంగళూరు మహానగరంలో కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ దీపకాంతులతో శోభాయమానంగా తీర్చు దిద్దుతున్నారు. మరి ఈ మహానగరం బెంగళూరులో మీరు సందర్శించాల్సిన కొన్ని ముఖ్యమై శివాలయాలు..

కెంప్ ఫోర్ట్ శివ ఆలయం :

కెంప్ ఫోర్ట్ శివ ఆలయం :

కెంప్ ఫోర్ట్ శివ ఆలయం బెంగుళూర్ లో ప్రసిద్ధి చెందిన శివ ఆలయం. ఈ విగ్రహం సుమారు 65 అడుగుల ఎత్తు వుంది. నగరంలోని ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న ఈ దేవాలయం అత్యంత ఆకర్షనీయమైన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం చూడటానికి చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తారు. ఈ ఆలయంలో ఇంకా ఒక పెద్ద వినాయకుడి విగ్రహం, శివుని యొక్క ఇతర రూపాలు కూడా ఉన్నాయి. ఇది బెంగళూరు ఓల్డ్ విమానాశ్రయం రోడ్ లో గలదు. శివరాత్రికి ప్రతి ఒక్కరు తప్పక సందర్శించవలసిన దేవాలయాలలో ఇది ఒకటి. Photo Courtesy: Rameshng

గవి గంగాధరేశ్వరాలయం :

గవి గంగాధరేశ్వరాలయం :

గవి పురంలో గల ఒక పురాతన గుహ దేవాలయం గవి గంగాధరేశ్వరాలయం. ఆలయంలో మరో ఆసక్తికరమైన దృగ్విషయం ఏమిటంటే మకర సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం నంది విగ్రహం కొమ్ములు గుండా సూర్యకాంతి నేరుగా లింగం మీద ప్రసరిస్తుంది. ఈ దృశ్యము పండుగ రోజున ప్రతి సంవత్సరం జరుగుతుంది. Photo Courtesy: Pavithrah

హలసూరు సోమేశ్వర ఆలయం:

హలసూరు సోమేశ్వర ఆలయం:

ఉల్సూర్ లో గల హలసూరు సోమేశ్వర ఆలయం సందర్శనలో మీకు మొట్టమొదటి ఆలయం. ఈ ఆలయం చోళుల కాలం నాటిది. బెంగుళూర్ లో ఇది అతి ప్రాచీన దేవాలయం. దేవాలయంలో విజయనగర కాలం నాటి శిల్ప శైలి ప్రభావం కనిపిస్తుంది. Photo Courtesy: Dineshkannambadi

ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం :

ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం :

శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో 12 చిన్న శివాలయాలు కూడా ఉన్నాయి. ఇది భారతదేశం అంతటా గల ఇతర జ్యోతిర్లింగ దేవాలయాలను సూచిస్తుంది. శ్రీనివాసపుర ఓంకార్ హిల్స్ వద్ద ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం వుంది. ఇక్కడ శివరాత్రి రోజున రాత్రి మొత్తం ప్రత్యేక పూజలు జరుగుతాయి.

Photo Courtesy: Sagar Sakre

కోటే జలకంఠేశ్వర స్వామి ఆలయం :

కోటే జలకంఠేశ్వర స్వామి ఆలయం :

కోటే జలకంఠేశ్వర స్వామి ఆలయం చోళ రాజవంశానికి చెందిన బెంగుళూర్ లో గల మరో ఆలయం. ఇది కలాసిపాల్య బస్ స్టాండ్ కు సమీపంలో ఉంది.నగర నడిబొడ్డులోని కళాసిపాళ్య ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయం కూడా చోళుల కాలానికి చెందినది. అత్యంత ప్రాచీన మైన ఈ శివాలయం శిల్ప కళకు నిలవు. ఆలయంలో జలకంఠేశ్వర స్వామి, పార్వతి మరియు కైలాసనాథార్ అనే ముగ్గురు దేవుళ్ళు గల పవిత్ర స్థలం.

Photo Courtesy: Siddhartha Sahu

బేగూర్లో గల నాగేశ్వర ఆలయం :

బేగూర్లో గల నాగేశ్వర ఆలయం :

నాగేశ్వర ఆలయం గంగా రాజవంశం పాలనలో నిర్మించారు. కొన్ని కన్నడ శాసనాలు బెంగుళూరు నగరం గురించి చెపుతాయి. ఈ పురాతన ఆలయానికి 890 ఎ.డి కి చెందిన శాసనాలలో చారిత్రక ఆధారం ఉంది. తరువాతి కాలంలో చోళ రాజవంశం యొక్క పాలనలో కొన్ని మరమత్తులు జరిగినవి. ఇక్కడ లభించిన శిలాశాసనాలను భారత పురవస్తు శాఖ భద్ర పరిచింది. శివరాత్రి నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. నగరంలోని బేరులో ఈ దేవాలయం ఉంది.

Photo Courtesy: Dineshkannambadi

ధర్మగిరి మంజునాథ స్వామి ఆలయం :

ధర్మగిరి మంజునాథ స్వామి ఆలయం :

ధర్మగిరి ఆలయం బనశంకరి బిడిఎ కాంప్లెక్స్ కి సమీపంలో వుంది మరియు ఆదునిక కాలానికి చెందిన బనశంకరి బీడీఏ కాంప్లెక్ల్స్ లో ఉంది. కన్నడ సీరియల్స్ ఎక్కువగా ఇక్కడ షూటింగ్ జరుగుతుంటాయి. ఇక్కడి పెద్ద లింగం చూడటానికి ఆకర్శనీయంగా ఉంటుంది. శివరాత్రి పర్వదినాన ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి.

కాడు మల్లేశ్వరాలయం :

కాడు మల్లేశ్వరాలయం :

ఈ ఆలయం మల్లేశ్వరంలో వుండటం వల్ల దీనికి కాడు మల్లేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. పరమశివుడికి అంకితమైన 17 వ శతాబ్దం నాటి ఆలయం. నందీశ్వర తీర్థం ఈ ఆలయంకు మరో ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నీరు నిరంతరం నంది విగ్రహం నోటి నుండి ప్రవహిస్తూ శివలింగం మీద పడుతుంది. ఈ నీరు వృషభవతి నది మూలం అని చెప్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X