Search
  • Follow NativePlanet
Share
» »ఆ టెంపుల్ లోకి ఎవరైనా వెళ్తే ఇక అంతే !

ఆ టెంపుల్ లోకి ఎవరైనా వెళ్తే ఇక అంతే !

గుజరాత్ లోని బావ్ నగర్ సమీపానికి వున్న కొలియక్ అనే గ్రామంలో సముద్రం నుండి ఒకటిన్నర కిలోమీటర్ల లోపల వుంది ఈ టెంపుల్. ఇక్కడున్న ఆలయంలో శివుడు వుంటాడు. ఇందులో శివలింగం వుంటుంది. ఇదే ఇక్కడ ప్రధాన దైవం.

రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ గుడిని చూడవచ్చును. మిగతా సమయమంతా ఈ గుడి సముద్రంలోనే మునిగిపోయి ఉంటుంది. ఇంతకీ ఈ గుడి ఎక్కడుంది? అని తెలుసుకోవాలని వుంది కదూ! శివుడు సముద్రంలోనే నివాసమున్నాడు!

గుజరాత్‌ లో అరేబియా సముద్రం తీరం వెంబడి ఒకటిన్నర కిలోమీటర్ల లోపలికి ఒక గడ్డమీద నిష్కళంక మహదేవ్‌గా శివుడు వెలసివున్నాడు. ఉదయం, సాయంత్రాల్లో అలలు తగ్గినప్పుడు కొన్ని గంటల సేపు మాత్రమే మనం స్వామిని దర్శించుకోవచ్చును. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలియాక్‌ గ్రామంలో భక్తుల దోషాలనూ, పాపాలనూ తొలగించే దేవుడిగా శివుడు పూజలందుకుంటున్నాడు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ప్రాణాలతో మాత్రం మీరు తిరిగి రారు

1. ప్రాణాలతో మాత్రం మీరు తిరిగి రారు

ఆ ఆలయానికి ఎప్పుడుపడితే అప్పుడు వెళ్ళడానికి వీలు లేదు. ఒక వేళ కాదని వెళితే ప్రాణాలతో మాత్రం మీరు తిరిగి రారు. ఎందుకంటే సముద్రం మిమ్మల్ని మింగేస్తుంది కాబట్టి.ఉదయాన్నే లేసి మీరు ఆలయం దగ్గరకు వెళితే అక్కడ మీకు ఆలయం కనపడదు.

PC: Bernard Gagnon

2. ధ్వజస్తంభం

2. ధ్వజస్తంభం

దూరంలో సముద్రం మధ్యలో వున్న ధ్వజస్తంభం మాత్రమే కనపడుతుంది. కానీ మధ్యాహ్నం పూట వెళితే మాత్రం మీరు ఆ ఆలయాన్ని చూడవచ్చు. ఆ సమయంలో మాత్రమే సముద్రం మెల్లగా వెనకకు వెళుతుంది. మధ్యాహ్నమంటే సుమారు ఒంటిగంట సమయంలో సముద్రం వెనకకు వెళ్లినతర్వాత మీరు తాడుసహాయంతో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి.

PC:Siddharth Bargate

3. ఆలయంలో ప్రశాంతంగా గడపొచ్చు

3. ఆలయంలో ప్రశాంతంగా గడపొచ్చు

అలా వెళ్లి మీరు రాత్రి 10గంటల వరకు పూజలు కూడా చేసుకోవచ్చు. ఆలయంలో ప్రశాంతంగా గడపొచ్చు. ఆ సమయం దాటితే మాత్రం వెనక్కి వచ్చేయాలి. లేదు కాదు నేను అక్కడే వుంటానని అంటే ఇక మీరు సముద్రంలో కలిసిపోవటం మాత్రం ఖాయం. రాత్రి 10దాటిన తర్వాత సముద్రం మళ్ళీ యధావిధిగాముందుకు వస్తుంది.

PC:Ice Cubes

4. లింగం

4. లింగం

ఆ గుడిని ముంచేస్తుంది.దాంతో ఆ గుడి మీకు కనిపించదు. ఆ గుడి కనిపించనప్పుడు ఆ గుడిలో వున్న లింగం కూడా కనిపించదు. ఇక శివాలయం కాదు కదా మీకు ఏ ఆలయం కనపడదు ఆ సమయంలో వుట్టి సముద్రం మాత్రమే కనపడుతుంది.

PC:Darshan Trivedi

5. ధ్వజస్తంభం

5. ధ్వజస్తంభం

ఆలయంలో ఎత్తుగా వుండేది ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఉన్నంత ఎత్తు నీళ్ళు వచ్చేస్తాయి. ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాల నుండి ఇదే విధంగాజరుగుతుందట అక్కడ. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని అందరూ అంటుంటారు.

PC: Vinoth Chandar

6. పౌర్ణమి

పాండవులు పూజలు చేసి ప్రతిష్టించిన 5 శివలింగాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా వున్నాయి.పౌర్ణమిలో సముద్రం ముందుకు వచ్చి మెల్లగా గుడిని ముంచెత్తడం అద్భుతంగా కనిపిస్తుందట.

7. పాండవులు

7. పాండవులు

పాండవులు మరియు కౌరవుల యుద్ధంలో శ్రీకృష్ణుడి సారథ్యంలో పాండవులు విజయం సాధించారు. ఈ యుద్ధంలో ఎంతోమంది రక్తసంబంధీకులనూ, పెద్దలనూ సంహరించాల్సి రావడం ఆ ఐదుగురు అన్నదమ్ములనూ కలవరపరచింది. ఈ విషయాన్ని కృష్ణుడికి విన్నవించారు.

PC:Kaushik Patel

8. శ్రీకృష్ణుడు పాండవులకు

8. శ్రీకృష్ణుడు పాండవులకు

శ్రీకృష్ణుడు పాండవులకు ఒక నల్ల ఆవునూ, ఒక నల్ల జెండానూ ఇచ్చాడు. ఆవును వదిలేయమని జెండా పట్టుకొని దాని వెంట నడవమని చెప్తాడు. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే జెండా రంగూ, ఆవు రంగూ తెల్లగా మారతాయో ఆ ప్రదేశంలో పరమశివుడిని దోష పరిహారం కోసం ప్రార్థించమని చెప్పాడు.

నరేంద్ర మోడీ పుట్టిన ఊర్లో ఏమేమి అద్భుతాలు వున్నాయో తెలుసా ?

PC:gujarat tourism

9. ఆవు

9. ఆవు

అంతట పాండవులు ఆ ఆవు వెంబడే నడిచారు. ఒకరోజు సముద్ర తీరం వెంట ఒక నల్ల ఆవు ప్రయాణం సాగించింది. అలా వెళ్తూవున్నప్పుడు ఒకానొక చోట ఆవురంగూ, జెండా రంగూ తెల్లగా మారిపోయాయి. అక్కడే అన్నదమ్ములంతా కూర్చుని శివుడ్ని ధ్యానించారు. అంతట శివుడు కరిగిపోయాడు.

PC:tamil oneindia

10 .5 శివలింగాలు

10 .5 శివలింగాలు

ధ్యానంలో ఉన్న ఆ 5 గురు అన్నదమ్ముల ముందూ శివుడు 5 శివలింగాల రూపంలో ఉద్భవించాడు. పాండవులు ఆ శివలింగాలను చూసి ఆనందాశ్చర్యాలకు గురయ్యారు.

PC:tamil oneindia

11. నిష్కళంక మహదేవ్‌

11. నిష్కళంక మహదేవ్‌

భక్తితో పూజించారు. వారి పాపాలను తొలగించేందుకు ఉద్భవించిన శివుడు కనుక ఆయన్ను నిష్కళంక మహదేవ్‌గా కొలుస్తారు భక్తులు.

PC:tamil oneindia

12.

12.

500 అడుగుల ఎత్తులో విశాలంగా పరచుకున్న నలుచదరపు నేల కనిపిస్తుంది. ఇక్కడే ఐదు శివలింగాలూ నందితో కలిసి వెలసి ఉంటాయి.

PC:tamil oneindia

13. చిన్న సరస్సు

13. చిన్న సరస్సు

అక్కడే ఓ పక్క పాండవ కొలను అన్న పేరుతో చిన్న సరస్సు ఉంటుంది. అందులో కాళ్లు కడుక్కుని స్వామి దర్శనానికి వెళతారు భక్తులు. పక్కనే రెండు జెండా స్తంభాలూ కనిపిస్తాయి. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే ఇక్కడి స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.

PC:Kaushik Patel

14. ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు

14. ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు

పౌర్ణమి అమావాస్య సమయాల్లో సముద్రపోటు ఎక్కువగా ఉన్నా వెనక్కు వెళ్లే సమయమూ ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు.

PC:Trinidade

15. ప్రతి శ్రావణ మాసంలో

15. ప్రతి శ్రావణ మాసంలో

17వ శతాబ్దంలో భావ్‌నగర్‌ మహారాజు భావ్‌సింగ్‌ ఈ ప్రాంతాన్ని భక్తులు పూజ చేసుకునేందుకు వీలుగా కాంక్రీటూ, నాపరాళ్లతో మలచారు. ప్రతి శ్రావణ మాసంలోని అమావాస్యనాడు భాదర్వి పేరుతో ఇక్కడ ఓ వేడుక జరుగుతుంది. దాన్ని దేవాలయ పండుగగా పిలుస్తారు.

PC:gujarat tourism

16. ధ్వజస్తంభం

16. ధ్వజస్తంభం

ఆ రోజు భావ్‌నగర్‌ మహారాజులు ఇక్కడి ధ్వజస్తంభం మీద కొత్త జెండాను ఉంచుతారు. వేడుకగా జరిగే ఈ ఉత్సవానికి వేల మంది భక్తులు వస్తారు.

PC: youtube

17. స్థానికులు

17. స్థానికులు

తర్వాత సంవత్సరం మళ్లీ మార్చేదాకా ఆ జెండానే అక్కడ ఉంటుంది. సముద్ర తీరంలో భూకంపం లాంటివి వచ్చిన సందర్భాలతో సహా ఏనాడూ ఈ జెండా అక్కడి నుంచి కదలలేదని స్థానికులు చెబుతారు.

PC: youtube

18. బ్రహ్మహత్యా పాతకం

18. బ్రహ్మహత్యా పాతకం

బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు రామచంద్రుడు శివుణ్ని అర్చించాడు. అలాగే కౌరవులతో జరిగిన యుద్ధంలో బంధువులను చంపిన పాపాన్ని పరిహారం చేసుకునేందుకు పాండవులూ మహాదేవుడ్నే శరణువేడారు.

PC: youtube

19. హారతి

19. హారతి

ఉదయం ఏడు గంటలకూ, సాయంత్రం ఆరున్నర గంటల సమయంలోనూ ఇక్కడ హారతి నిర్వహిస్తారు. ఆ రోజు తిథిని బట్టి హారతి సమయాలు కాస్త అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఇక, ఇక్కడి నీళ్లలో అస్థికలు కలిపితే చనిపోయిన వాళ్లకి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మిక.

PC: youtube

20 .ప్రశాంత వాతారణం

20 .ప్రశాంత వాతారణం

సముద్రం లోపల, ప్రశాంత వాతారణంలో హరహర మహాదేవ నాదాలు సాయంత్రం మళ్లీ సాగరుడు పలకరించే దాకా రోజూ వినిపిస్తూనే ఉంటాయిక్కడ!

PC: youtube

21 .ఎలా దర్శించుకోవాలి

21 .ఎలా దర్శించుకోవాలి

ఈ ఆలయాన్ని దర్శించుకొనుటకు గుజరాత్‌ భావ్‌నగర్‌ నుంచి కొలియాక్‌ గ్రామానికి వెళ్లాలి. అక్కడి అరేబియా సముద్ర తీరం దగ్గర నిల్చొని చూస్తే సముద్రం లోపలికి దూరంగా రెండు స్తంభాలపై జెండాలు ఎగురుతూ కనిపిస్తాయి.

దెయ్యాల బీచ్ గురించి మీకు తెలుసా ?

PC: youtube

22. అలల పోటు తగ్గినప్పుడు

22. అలల పోటు తగ్గినప్పుడు

అక్కడే శివుడు వెలసిన ప్రాంతం. అలల పోటు తగ్గినప్పుడు నడుచుకుంటూ ఇక్కడికి చేరుకోవచ్చును.

PC: youtube

23. ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

23. ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా మీరు భావ్ నగర్ చేరుకోవాలి. భావ్ నగర్ నుండి బస్సుల్లో లేదా ఆటోల్లో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు.

PC: youtube

24 .భావ్ నగర్ చేరుకోవడం ఎలా ?

24 .భావ్ నగర్ చేరుకోవడం ఎలా ?

విమాన మార్గం

భావ్ నగర్ లో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి ముంబై, ఢిల్లీ, గాంధీనగర్, జైపూర్ వంటి అంగరాలకు రెగ్యులర్ గా విమానాలు నడుస్తుంటాయి.

రైలు మార్గం

భావ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా అహ్మదాబాద్, ఓఖా, వడోదర, ముంబై నగరాల నుండి ప్రతిరోజూ రైళ్లు నడుస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం

భావ్ నగర్ వ్యాపార నగరం. సమీప పట్టణాల నుండి, సూరత్, రాజ్ కోట్, జామ్ నగర్ ప్రాంతాల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.

PC: youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more