» »శ్రీ బాల హనుమాన్ ఆలయం, ఢిల్లీ !

శ్రీ బాల హనుమాన్ ఆలయం, ఢిల్లీ !

Written By:

ఢిల్లీ భారతదేశ రాజధాని. పూర్వం దీనిని ఇంద్రప్రస్థపురం అని పిలిచేవారట. ఈ నగరాన్ని ఎన్నో రాజ వంశాలు పరిపాలించారు అయినా చెక్కుచెదరలేదు .. ఎన్నో యుద్ధాలను చూసింది అయినా బెదరలేదు.

ఇంద్రప్రస్థపురం గురించి పురాణాల్లో ...

పాండవ రాజులు ద్రౌపదిని వివాహం చేసుకొని రహస్యజీవనం లో నుంచి బహిరంగ జీవనంలోకి వచ్చాక, దృతరాష్ట్రుడు రాజ్యాన్ని రెండు భాగాలు చేస్తాడు. ఇంద్రప్రస్థపురం రాజధానిగా ఒక భాగానికి రాజుగా ధర్మరాజుకు, ప్రధాన రాజ్యానికి రాజుగా దుర్యోధనకు ఇచ్చేస్తాడు. అంతేకాదు ప్రధాన రాజ్యం మీద నీకు హక్కు లేదని కూడా చెబుతాడు.

కొత్త ఢిల్లీ లో మీరు షాపింగ్ వీధులు, మాల్స్, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు ఇంకా ఎన్నో స్థలాలను చూసి ఉంటారు. అయితే, మీరు చూడని సరికదా కనీసం వినని ఒక కొత్త ప్రదేశం గురించి చెప్పబోతున్నాను అదే కనౌట్ ప్లేస్ ! ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ బాల హనుమాన్ దేవాలయం కలదు. ఇది చాలా పురాతమైనది, మహిమకలది.

శ్రీ బాల హనుమాన్ దేవాలయం

                                                               శ్రీ బాల హనుమాన్ దేవాలయం

                                                            చిత్ర కృప : आशीष भटनागर

కనౌట్ ప్లేస్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు 1.3 కిలోమీటర్ల దూరంలో, హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ నుండి 9 కిలోమీటటర్ల దూరంలో కలదు. కనౌట్ ప్లేస్ దగ్గర బాబా ఖరాక్ సింగ్ మార్గంలో ప్రసిద్ధి చెందిన శ్రీ బాల హనుమాన్ ఆలయం కలదు. ఇది జంతర్ మంతర్ కు కూడా దగ్గరే.

ఇది కూడా చదవండి : ఢిల్లీ లో అతి పెద్ద హిందూ దేవాలయం !

అది మొఘలాయుల కాలం .. రాజపుత్ర రాజు పృద్వీరాజ్ చౌహాన్ మహమ్మదీయులకు ఎదురుతిరిగేవాడు. దీనికి ప్రతీకారంగా మొఘలులు హిందూ దేవాలయాలపై దండయాత్ర చేసేవారు. ఇలా మొఘల్ దండయాత్ర కు సైతం తట్టుకొని నిలబడ్డ అతి కొద్ది దేవాలయాలలో శ్రీ హనుమాన్ దేవాలయం ఒకటి. ఇలా దండయాత్ర చేసిన దేవాలయ రాళ్లను మసీదులకు వాడేవారట. హనుమాన్ గుడి ఆలయం యొక్క రాళ్లను కూడా కుతుబ్ కాంప్లెక్స్ లోని లాల్ కోట వద్ద గల అవ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ నిర్మాణానికి వాడారు.

దక్షిణ ముఖుడైన హనుమంతుని విగ్రహం

                                                             దక్షిణ ముఖుడైన హనుమంతుని విగ్రహం

                                                                        చిత్ర కృప : Nvvchar

శ్రీ బాల హనుమాన్ దేవాలయం

బాల హనుమాన్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హనుమంతుడు దక్షిణ ముఖం ఉండటం వల్ల ఒక కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. గంధ సింధూరం పూతతో, ధగధగతో, మెడలో పుష్పమాలలతో శ్రీ హనుమాన్ దర్శనమిస్తాడు. ఎడమ చేతిలో గధ, మరో చేయి ఛాతీ మీద పెట్టుకొని ప్రార్థన చేస్తున్నట్లు ఉండే విధంగా కనిపిస్తాడు.

దేవాలయం విమానం పై నెలవంక

                                                              దేవాలయం విమానం పై నెలవంక

                                                                    చిత్ర కృప : Nvvchar

ప్రత్యేకత

సాధారణం గా దేవాలయం విమానం మీద ఓం లేక సూర్యుని చిహ్నాలు ఉండటం సంప్రదాయం .దీనికి భిన్నంగా ఇక్కడ చంద్ర వంక (నెలవంక) ఉండటం ప్రత్యేకత .ఈ చంద్రవంక ను చూసి ముస్లిములు దీన్ని పవిత్రంగా భావించి ఈ బాల హనుమాన్ దేవాలయం జోలికే పోలేదు. ఆ చంద్ర వంక యే ఈ ఆలయాన్ని కాపాడింది.

ఇది కూడా చదవండి : రూ. 500 ల్లో ఢిల్లీ పర్యటన ఎలా ?

దేవాలయ వెండి ద్వారాలన్నీ చక్కని కళా త్మక చిత్రాలతో వైభవం గా కని పిస్తాయి. రామాయణ గాధ లన్ని దీనిపై చెక్క బడి ఉండటం విశేషం ..ముఖ ద్వారమే అనేక శతాబ్దాల ప్రాచీన మైనది గా భావిస్తారు. శ్రీ తులసీ దాసు విరచిత రామాయణాన్ని ముఖ మండపం పై భాగం లో చిత్రించారు.ఇవి కనులకు గొప్ప విందును చే కూరుస్తాయి.

ముఖ మండపం పై రామాయణ గాధలు

                                                              ముఖ మండపంపై రామాయణ గాధలు

                                                                        చిత్ర కృప : Nvvchar

ఇతర ఆకర్షణలు

10 జనపథ్, అగర్సేన్ కి బయోలి, అమత్ ర్రా స్పా, బంగ్లా సాహిబ్ గురుద్వారా, సెంట్రల్ పార్క్, జంతర్ మంతర్, స్టేట్ ఎంపోరియా మొదలైనవి చూడదగ్గవి.

వసతి

కనౌట్ ప్లేస్ వద్ద బడ్జెట్ కు తగ్గట్టు హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్, నాన్ డీలక్స్ తో పాటు అన్ని తరగతుల గదులు లభ్యమవుతాయి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ డిషెష్ తో పాటు విదేశీ వంటకాలు లభ్యమవుతాయి.

Please Wait while comments are loading...