Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో కెల్లా అతిపెద్ద హిందూ దేవాలయం !!

భారతదేశంలో కెల్లా అతిపెద్ద హిందూ దేవాలయం !!

By Mohammad

అక్షరధామ్ నిజంగా పర్యాటకులకు ఒక అద్భుతం . అహ్మదాబాద్, గాంధీనగర్ లో ఉన్న అక్షరధామ్ కంటే దేశ రాజధాని కొత్త ఢిల్లీ లో ఉన్న అక్షరధామ్ చాలా పెద్దది మరియు విశాలమైనది. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హిందూ దేవాలయ సముదాయాన్ని అప్పటి భారత రాష్ట్రపతి ఏ పి జె అబ్దుల్ కలాం ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి : రూ. 500 తో ఢిల్లీ పర్యటన ఎలా ??

అక్షరధామ్ అంటే "పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం" అని అర్థం. ఈ ఆలయ సముదాయం పూర్తి పేరు "శ్రీ స్వామి నారాయణ్ అక్షరధామ్". నిత్యం వేదాలతో, ఉపనిషత్తులతో ప్రతిధ్వనించే ఈ ఆలయం ఆధ్యాత్మికులను, పర్యాటకులను అలరిస్తున్నది. సంప్రదాయ కళలు, పూర్వ సంస్కృతి, ప్రాచీన నాగరికతల్ని ఉట్టిపడే విధంగా పూర్తి ఆధునిక పరిజ్ఞానంతో సృజనాత్మకంగా మలిచిన తీరుకి నిదర్శనం ఈ అక్షరధామ్ ఆలయ సముదాయం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న అక్షరధామ్ ఆలయ విశేషాలను ఒకసారి పరిశీలిస్తే ..

ఇది కూడా చదవండి : కుతుబ్ మినార్ గురించి కొన్ని వాస్తవాలు !!

అక్షరధామ్ ను కట్టిన శైలి

అక్షరధామ్ ను కట్టిన శైలి

రాజస్థాన్ నుండి తెప్పించబడిన వేలాది టన్నుల కెంపువన్నెల ఇసుక రాళ్లు, పాలరాతి రాళ్లతో కట్టబడిన ఈ ఆలయం లో ఇసుమంతైనా ఉక్కు వాడాక పోవడం ఆశ్చర్యకరమైన విషయమే ..!

చిత్ర కృప : Vaibhav Patel

అక్షరధామ్ ను కట్టిన శైలి

అక్షరధామ్ ను కట్టిన శైలి

గుజరాత్ లోని గాంధీనగర్ లో వెలసిన అక్షరధామ్ ఆలయం మొదటిది కాగా ఢిల్లీ లో ఉన్న ప్రస్తుత అక్షరధామ్ ఆలయం రెండవది. దేశంలో పేరుమోసిన ఆలయ భవన నిర్మాణాలను చూసి, వైదిక శాస్త్రాలను ఉపయోగించి అక్షరధామ్ నిర్మాణం చేపట్టడం ఒక శుభపరిణామమే ..!

చిత్ర కృప : Emmanuel Cobb

దశద్వార్, అక్షరధామ్

దశద్వార్, అక్షరధామ్

అక్షరధామ్ లో లోనికి ప్రవేశించేటప్పుడు భారీ బలగాలు మోహరించి ఉంటాయి. వీరిని దాటుకొని లోనికి వెళితే మొదట కనిపించేది దశద్వార్. ఇది పది దిక్కులకు ప్రతీకలు.

చిత్ర కృప : Gurukul Events

భక్తిద్వార్, అక్షరధామ్

భక్తిద్వార్, అక్షరధామ్

దశద్వార్ దాటగానే కనిపించే మరో ద్వారం భక్తిద్వార్. అత్యంత సుందరంగా చెక్కబడిన శివపార్వతులు, లక్షివిష్ణువు, బ్రహ్మ సరస్వతి, రాముడు సీత లాంటి మొత్తం 208 వరకు జంట విగ్రహాలు ఉన్న పెద్ద ద్వారం స్వాగతం పలుకుతుంది.

చిత్ర కృప : Manu Kalra

భక్తిద్వార్, అక్షరధామ్

భక్తిద్వార్, అక్షరధామ్

మీకు చూడటానికి ఈ విగ్రహాలు చిన్నవిగానే కనిపిస్తాయి కానీ ఒక్కసారి భక్తి భావంతో చూస్తే జీవకళ ఉట్టిపదేవిధంగా అగుపిస్తాయి.

చిత్ర కృప : DJ DiLjEeT

మయూర ద్వారం, అక్షరధామ్

మయూర ద్వారం, అక్షరధామ్

భక్తిద్వార్ దాటిన వెంటనే మీకు కనిపించే మరో ద్వారం మయూర ద్వారం. దాదాపు 869 నెమళ్ళు నాట్యం చేస్తున్నట్లు అందంగా ఆలయ స్తంభాల మీద చెక్కిన తీరుకి శిల్పి పనితనాన్ని మెచ్చుకోక తప్పదు.

చిత్ర కృప : siva rajendhra pasupuleti

అక్షరధామ్ ఆలయం

అక్షరధామ్ ఆలయం

ఈ మూడు ద్వారరాలను దాటగానే సువిశాలమైన ప్రాంగణంలో అద్భుతంగా కనిపించే అక్షరధామ్ కనిపిస్తుంది. ఈ నిర్మాణాన్ని సరిగ్గా ప్రాంగణం మధ్యభాగంలోనే నిర్మించినారు.

చిత్ర కృప : siva rajendhra pasupuleti

అక్షరధామ్ ప్రధాన దేవాలయం

అక్షరధామ్ ప్రధాన దేవాలయం

తెల్లని గులాబీ పాలరాతితో కట్టిన 141 అడుగుల ఎత్తైన ఈ ఆలయాన్ని చూస్తే ఎవ్వరైనా నివ్వెరపోక తప్పదు. ఈ ఆలయంలో ఎన్నో వేల శిల్పాలు, కళాత్మకమైన స్తంభాలు అందంగా తీర్చిదిద్దారు.

చిత్ర కృప : siva rajendhra pasupuleti

అక్షరధామ్ ప్రధాన దేవాలయం

అక్షరధామ్ ప్రధాన దేవాలయం

ఆలయం చుట్టూ భారతీయ మహా పురుషులు, యోగులు, ఋషులు, దేవతామూర్తులు ఇలా ఒకటేమిటి అన్ని కళ్ళ ముందర కనిపిస్తుంటే ఏమని చెప్పాలి.

చిత్ర కృప : siva rajendhra pasupuleti

అక్షరధామ్ ప్రధాన దేవాలయం

అక్షరధామ్ ప్రధాన దేవాలయం

ఇలా చుట్టూ చూసుకుంటూ ఆలయం లోపలికి వెళ్ళగానే కన్పించే మరో అద్భుతఘట్టం బంగారు తాపడం చేయబడిన 11 అడుగుల స్వామి నారాయణ్ పంచ లోహ విగ్రహం. ఆలయం బయట శిల్ప సంపద ఒకెత్తైతే లోపల ఉన్న శిల్ప సంపద మరో ఎత్తు.

చిత్ర కృప : Gurukul Events

అక్షరధామ్ ప్రధాన దేవాలయం దర్శనం తరువాత ...

అక్షరధామ్ ప్రధాన దేవాలయం దర్శనం తరువాత ...

ఆలయం లో దేవుని దర్శనం అయిపోగానే నేరుగా బయటి కివెళ్లవలసిన అవసరం లేదు. ఇక్కడచూడవలసిన మరొక ప్రదేశం ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ అంటే అదేదో మన ఊర్లో జరిగే జాతర అనుకొనేరు. జేంట్ వీల్, ఊయల, రైలు ... అబ్బో ఇవి కాదు. ఇక్కడి ఎగ్జిబిషన్ లో చూడవలసినవి సహజానంద దర్శన్, నీలకంఠ్ దర్శన్, సంస్కృతి విహార్

చిత్ర కృప : siva rajendhra pasupuleti

సహజానంద దర్శన్, అక్షరధామ్

సహజానంద దర్శన్, అక్షరధామ్

సహజానంద దర్శన్ లో ముందుగా స్వామి నారాయణ్ గురించి, అక్షరధామ్ గురించి లఘుచిత్రాన్ని చూపించి, మట్టి బొమ్మలతో, రోబోటిక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వామి నారాయణ్ జీవితాన్ని ప్రదర్శిస్తారు.

చిత్ర కృప : Colombi Travel

నీలకంఠ దర్శన్, అక్షరధామ్

నీలకంఠ దర్శన్, అక్షరధామ్

నీలకంఠ దర్శన్ లో 45 నిమిషాల చిత్రాన్ని ఐమాక్స్ థియేటర్ లో ప్రదర్శిస్తారు. బాల్య దశ నుండి స్వామి నారాయణ్ గా ఎదిగిన తీరు, ఆయన పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్ళు కళ్ళకు అద్దినట్లు చూపిస్తారు.

చిత్ర కృప : SANDEEP MATHUR

సంస్కృతి విహార్, అక్షరధామ్

సంస్కృతి విహార్, అక్షరధామ్

సంస్కృతి విహార్ లో భారతీయ సంస్కృతిని, చరిత్ర ని, గొప్పతనాన్ని, మేధస్సుని, నాగరికత ని పావుగంట సేపు ప్రదర్శిస్తారు. అందమైన మట్టి బొమ్మల ని ఉపయోగించి దేశ సంస్కృతిని ప్రదర్శించే తీరు చూపరులను ఆకట్టుకొంటుంది.

చిత్ర కృప : v!n!sh

అక్షరధామ్ ప్రధాన దేవాలయం లో సాయంత్రం వేళ ...

అక్షరధామ్ ప్రధాన దేవాలయం లో సాయంత్రం వేళ ...

అక్షరధామ్ సాయంత్రం వేళ దీపాల వెలుగు లో బంగారు వర్ణ కాంతి తో మెరుస్తూ ఉంటుంది. మొత్తం దీపాలన్ని వెలిగించగానే యజ్న పురుష కుండ్ అనే మ్యూజికల్ ఫౌంటేన్ మొదలవుతుంది.

చిత్ర కృప : Anilkflick

యజ్ఞ పురుష కుండ్, అక్షరధామ్

యజ్ఞ పురుష కుండ్, అక్షరధామ్

కేవలం భారతీయ సంప్రదాయ సంగీతం తో నాట్యమాడే యజ్ఞ పురుష కుండ్ ని తప్పక చూడాలి. దీనికి టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని లోనికి వెళ్ళగానే ఆ సంప్రదాయ సంగీతం వింటుంటే చెవుల్లో పన్నీరు పోసినట్లుంటుంది.

చిత్ర కృప : Juthani1

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X