Search
  • Follow NativePlanet
Share
» »పరమశివుడు స్వయంగా చెరువు తవ్వాడు. సాక్ష్యం ఇదిగో?

పరమశివుడు స్వయంగా చెరువు తవ్వాడు. సాక్ష్యం ఇదిగో?

సిరిచెల్మ మల్లన్న దేవాలయానికి సంబంధించిన కథనం.

లోక కళ్యాణం కోసం త్రిమూర్తుల్లో ఒకడు, లయకారకుడైన పరమశివుడు అనేక యుద్ధాలను చేసి రాక్షసులను సంహరించడమే కాకుండా అనేక మంది భక్తులను కాపాడాడు. ఇందు కోసం సాధారణ మానవుడి వలే అనేక కార్యాలు కూడా చేశాడు. అలా లోక కళ్యాణం కోసం శివుడు చేసిన పని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పని ఎక్కడో కాదు మన తెలుగు నేలలోనే. ప్రస్తుత కథనంలో ఆ ప్రాంతం, అక్కడ వెలసిన దేవాలయం తదితర వివరాలన్నీ మీ కోసం....

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిరిచెల్మ అనే చిన్న గ్రామంలోనే శివుడు లోకకళ్యాణం కోసం సాధారణ కార్మికుడి వలే మట్టి తట్టలను మోసాడు. పార్వతీ సమేతంగా ఇక్కడ స్వయంభువుగా వెలిసాడు

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

ప్రస్తుతం ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది. శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ సమయంలో ఆ నీలకంఠుడు పార్వతీ సమేతంగా ఇక్కడకు వచ్చి పూజలందుకొంటాడని ప్రతీతి.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

చాలా కాలం క్రితం ప్రస్తుత సిరిచల్మ అనే గ్రామం ఉన్న ప్రాంతంలో పిట్టయ్య, నుమ్మవ్వ అనే దంపతులు ఉండేవారు. ఈ క్రమంలో వారి గ్రామానికి ఒక పిల్లవాడు పశువుల కాపరిగా వస్తాడు.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

పిల్లలు లేని ఆ దంపతులు ఆ బాలుడు అనాధ అని తెలుసుకొని అతనికి మల్లన్న అని పేరుపెట్టి పెంచుతారు. ఆ మల్లన్న వయస్సులో చిన్నవాడైనా సాయంలో మిన్న.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడూ సాయం చేస్తూ అందరితో మంచి బాలుడు అని పించుకొంటూ ఉండేవాడు. ఒక సారి ఆ గ్రామంలో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. ప్రజలకు తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

దీంతో మల్లన్న తాను ఒక రోజులోపల చెరువును తవ్వడమే కాకుండా వర్షం వచ్చేలా చేస్తానని గ్రామ ప్రజలతో చెబుతాడు. అంతేకాకుండా చెరువును తవ్వడం ప్రారంభిస్తాడు.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

అయితే ఒక రోజులోపల చెరువును తవ్వడం సాధ్యం కాదని చెబుతూ ఎవరూ మల్లన్నకు సాయం చేయడానికి ముందుకు రాడు. అయినా వెనుదిరగకుండా మల్లన్న చెరువు తవ్వడంలో నిమగ్నమవుతాడు.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

రాత్రి చికటి పడినా ఈ బాలుడు చెరువు తవ్వడం మాత్రం మానలేదు. ఇక మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు ఆ చెరువు దగ్గరకు వచ్చి చూస్తారు. చెరువు తవ్వడం పూర్తి అయినా కూడా బాలుడు మాత్రం కనిపించడు.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

అదే సమయంలో చెరువు మధ్య భాగంలో ఒక లింగం కూడా ఉంటుంది. అదే సమయంలో శివలింగం పై భాగంలో కొంత లోనికి వెళ్లినట్లు కనిపిస్తుంది. దీంతో ఆ బాలుడు ఎవరో కాదు శివుడే అని నమ్ముతారు.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

అంతేకాకుండా ఆ శివుడు తాను వెలుతూ తన ప్రతి రూపమైన శివలింగాన్ని ఇక్కడ వదిలి వెళ్లడాని భావిస్తారు. అంతేకాకుండా రాత్రి మొత్తం ఆ బాలుడు మట్టితట్టలను మోయడం వల్ల ఇలా గుంట ఏర్పడి ఉండవచ్చునని అనుకొంటారు.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

అదే రోజు రాత్రి పిట్టయ్య దంపతుల కలలో మల్లన్న కనిపించి తనకు అక్కడ ఓ దేవాలయం నిర్మించాల్సిందిగా సూచిస్తాడు. అదే మల్లికార్జున దేవాలయంగా ప్రసిద్ది చెందింది. ఈ పుణ్యక్షేత్రంలో రెండు నందులు ఉంటాయి.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

ఒకటి గర్భగుడిలో ఉంటే మరొకటి దేవాలయానికి 25 అడుగుల దూరంలో ఉంటుంది. సూర్యకిరణాలు ఈ నంది విగ్రహం పై మొదట పడి అటు పై గర్భగుడిలోని శిలింగం పై ప్రకాశిస్తాయి. ఆ సుందర ద`ష్యాన్ని ప్రత్యక్షంగా చూడాల్సిందే కాని మాటల్లో వర్ణించడానికి వీలుకాదు.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

ఇక ప్రతి శివరాత్రి రోజున అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ సమయంలో పార్వతీ సమేతంగా శివుడు ఇక్కడకు వస్తాడని చెబుతారు. అందువల్లే స్థానికులే కాకుండా చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయంలో భారతీయ శిల్పసంపదకు అద్దం పట్టే అద్భుత శిల్పసంపదను చూడవచ్చు. ఇక్కడ హిందూ ధర్మానికి చెందిన శిల్పాలతో పాటు జైన, బౌద్ధ, శిల్పాలను కూడా మనం చూడవచ్చు.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

దీంతో అనేక మంది రాజులు ఈ క్షేత్రం అభివ`ద్ధికి పాటుపడ్డారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ దేవాలయానికి సమీపంలో అనేక జలపాతాలు ఉన్నాయి. తెలంగాణాలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అందమైన జలపాతంగా పేరుగాంచిన కుంతల జలపాతం ఈ దేవాలయానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 సిరిచెల్మ మల్లన్న దేవాలయం

సిరిచెల్మ మల్లన్న దేవాలయం

P.C: You Tube

అదేవిధంగా గాయిత్రి జలపాతం కూడా సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు అనేక బస్సులు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి ఇచ్చోడకు సుమారు 32 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సిరిచెల్లమ ఉంటుంది. ఇక నిర్మల్ నుంచి సిరిచెల్మకు సుమారు 48 కిలోమీటర్ల దూరం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X