Search
  • Follow NativePlanet
Share
» »మహేశ్వరం కోనేటిలో కొలువుదీరిన రాజరాజమహేశ్వరుడు

మహేశ్వరం కోనేటిలో కొలువుదీరిన రాజరాజమహేశ్వరుడు

మహేశ్వరం మహిమానిత్యమైన ప్రదేశం.శివుడు శివగంగ రాజరాజేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న పుణ్య క్షేత్రం మహేశ్వరం. మహేశ్వరంలో 16 శివాలయాల మధ్య శివగంగ నడుమ పైన రాజరాజేవ్వరస్వామి, క్రింద రాజరాజేశ్వరి దేవి (అమ్మ)ఆలయాలున్నాయి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామానికి సమీపంలో ఉన్న మహేశ్వరం పూర్వ నామధేయం మాంకాల్ మహేశ్వరం.

సుమారు 400 సంవత్సరాలకు పూర్వం గోల్కొండ నవాబు తానీషా ఆస్థానంలో మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. కుతుబ్ షాహీల మత సామరస్యాన్ని , మొగలాయిల నిర్దాక్షిణ్యాన్ని చవి చూసిన క్షేత్రం మాంకాల్ మహేశ్వరం. ఛత్రపతి శివాజీ విడిది చేసిన ప్రదేశంగా, అక్కన్నమాదన్నలు తిరుగాడిన ఊరుగా చెబుతారు. చారిత్రకంగా ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ మహేశ్వరం గ్రామంలో ఓ దివ్యాభరణంలా శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం విలసిల్లుతుంది. మరి ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం..

రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం

రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం

రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా, విహార క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయం ఇతర ఆలయాలకు మల్లే కాకుండా నీటిలో రెండతస్తులతో అలరారుతోంది. ఆలయం చుట్టూ పుష్కరిణి ఉంది. ఇది ఐదు వందల అడుగుల పొడవు, రెండు వందల యాభై అడుగుల వెడల్పుతో దర్శనమిస్తుంది. విశాలమైన చతురస్త్రాకార పుష్కరిణిలో రాజరాజేశ్వరుడు రాజేశ్వరీ దేవితో కలిసి ఉద్భవించినట్లు భక్తుల నమ్మకం. అందుకే పుష్కరిణి మధ్యభాగంలో రెండంతుస్తులతో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు.

PC : YOUTUBE

శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో

శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో

శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో ఓ దివ్యాభరణంలా ఇక్కడున్న షోడశ మూర్తుల మందిరాలు అలరారుతున్నాయి. వేటికవే ప్రాధాన్యాన్ని, పవిత్రతను సంతరించుకున్న ఆ దివ్యాలయాల శోభ వర్ణనాతీతం. ఈ ఆలయం ముందున్న చెట్టుకు ఓ చరిత్ర ఉంది. రావి, వేప, మేడి చెట్లు అల్లుకుని త్రివృక్షమై బాసిల్లుతున్న ఈ ప్రదేశంలో కాకతీయుల కాలంలో నిర్మితమై దినదినాభివృద్ధి చెందుతూ..భక్తుల కొంగుబంగారమై అలలారుతోంది. పిల్లలు కాని వారు ఈ చెట్లకు కొత్త కొబ్బరికాయ కడితే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈ త్రివృక్షం కిందనే నాగేంద్రాలయం కూడా ఉంది.

PC : YOUTUBE

కాకతీయుల కాలంలో రాజరాజేశ్వరస్వామి ఆలయం

కాకతీయుల కాలంలో రాజరాజేశ్వరస్వామి ఆలయం

కాకతీయుల కాలంలో రాజరాజేశ్వరస్వామి ఆలయం నెలకొల్పడంతో ఈ గ్రామానికి మహేశ్వరం అని పేరు వచ్చింది. శివగంగలో కొలువుదీరిన ఈ ఆలయం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ ఆలయాన్ని అష్టాదశ సంఖ్య వచ్చేలా నిర్మించడం విశేషం. సహాజంగా శివుడి తలపై గంగ ఉంటుంది. గంగలోనే శివుడు ఉండటంతో ఆయన కింద భాగంలోనే రాజేశ్వరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ శివగంగలో స్నానమాచరిస్తే వారి దోషాలు పోతాయని భక్తుల నమ్మకం.

PC : YOUTUBE

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం తానీషా నవాబుల వద్ద పనిచేసిన అక్కన్న మాదన్నలు 1672లో వారి పర్యటనలో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్దరించారు. గోల్కొండ నవాబు తానీషా కాలంలో అక్కన్న మాదన్నలు 1673-1680 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని కట్టించారని చారిత్రాక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అప్పటి రాజధాని గోల్కొండ కోటకు పశ్చిమ భాగంలో 37 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ గ్రామాల మీదుగా అక్కన్న మాదన్నలు ఇక్కడికి చేరుకునే వారు.

PC : YOUTUBE

మహేశ్వరం ఆలయంతో పాటు

మహేశ్వరం ఆలయంతో పాటు

మహేశ్వరం ఆలయంతో పాటు సమీపంలోనే కోదండరామస్వామి ఆలయం, శివగంగ పుష్కరిణి, విష్ణు భగవాన్, ఆంజనేయ స్వామి ఆలయాలను సైతం అక్కన మాదన్నలు నిర్మించినట్లు ప్రతీతి. ఎనిమిదేళ్ల కాలంలో వీటి నిర్మాణం పూర్తియినట్లు చరిత్ర చెబుతోంది. 1677లో ఈ ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నప్పుడు శ్రీశైలం దర్శనానికి వెళ్లిన శివాజీ కూడా రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని వెళ్లినట్టు చరిత్ర చెబుతుంది.

PC : YOUTUBE

మహేశ్వరంకు పక్కనే వున్నా గడికోట

మహేశ్వరంకు పక్కనే వున్నా గడికోట

మహేశ్వరంకు పక్కనే వున్నా గడికోట (అక్కనసారాయి) లో పురాతన కట్టడాలను మనముచూడొచ్చు.పురాతన కట్టడాలకు నిలయం మన మహేశ్వరం. కోరిన కోరికలు తీర్చే ఆలయంగాను పేరు పొందిన శివగంగ ఆలయాన్ని రాష్ట్ర నాలుమూలల నుండి నిత్యం భక్తులు సందర్శిస్తుంటారు.

ఎన్నో సినిమా షూటింగ్ లకు ఈ ప్రదేశం అద్భుత ఆలమవాలమైంది. భవిష్యత్‌లో మరిన్ని సినిమా షూటింగ్‌లతో మహేశ్వరం ప్రాంతం, సినిమా స్పాట్‌గా పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు.

PC : YOUTUBE

ఉత్సవాలు:

ఉత్సవాలు:

ప్రతి శివరాత్రికి ఆలయాన్నివిద్యుతు దీపాలంకారాణ చేసి వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు,ఆ రోజులో రాత్రి వేళలో ఆలయాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

ఆలయం హైదరాబాద్ నుంచి 25 కిలో మీటర్లు దూరంలో ఉంటుంది. హైద్రాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి మహేశ్వరం దివ్య క్షేత్రానికి సిటీ బస్సు సౌకర్యం ఉంది. వీటి ద్వారా లేదా, ఇతర వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్‌-శ్రీశైలం హైవే మీదుగా మహేశ్వరం గేటు నుంచి లోపలికి 6 కి.మీ. దూరంలో శివగంగ రాజరాజేశ్వర ఆలయం ఉంది. చార్మినార్‌, కోఠి, ఇబ్రహీంపట్నం, ఐఎస్‌సదన్‌, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌, సికింద్రాబాద్‌ల నుంచి బస్సులు నడుపుతున్నారు. జూబ్లీబస్ స్టేషన్ నుంచి మహేశ్వరానికి 253/ 90కె, చార్మినార్ నుంచి 253 ఎం, 253 కె, 253 టి, 253 హెచ్, సికింద్రాబాద్ నుంచి 8ఎ/ 253ఎం. జూబ్లీహిల్స్ నుంచి 253 ఎం, బస్సులు ఎక్కాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఔటర్‌రింగ్ రోడ్డు మీది నుంచి తుక్కుగూడ వరకు వచ్చి శ్రీశైలం రహదారి మీదుగా మహేశ్వరం గేట్ కమాన్ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు.

PC : YOUTUBE

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X